News


నష్టాల మార్కెట్లో ఈ రెండు స్టాక్స్‌ జూమ్‌

Monday 23rd December 2019
Markets_main1577080868.png-30380

ఇండియామార్ట్‌- బ్రోకింగ్‌ సంస్థ సిఫారసు ఎఫెక్ట్‌
బీఏఎస్‌ఎఫ్‌- కెమికల్‌ బిజినెస్‌ విక్రయం ఫలితం

ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌
బ్రోకింగ్‌ సంస్థ జెఫరీస్‌ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించిన వార్తలతో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియామార్ట్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. రూ. 2072 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2097 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 2028 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. బీటూబీ క్లాసిఫైడ్‌ ప్లాట్‌ఫామ్‌ విభాగంలో దేశీయంగా లీడర్‌గా ఉన్న ఇండియామార్ట్‌ కంపెనీ రానున్న రెండేళ్లలో 20 శాతం వృద్ధి చూపగలదని జెఫరీస్‌ అంచనా వేస్తోంది. లాభదాయకత(మార్జిన్లు) సైతం భారీగా మెరుగుపడగలవని భావిస్తోంది. దీంతో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేరుకి రూ. 2500 టార్గెట్‌ ధరతో కొనుగోలుకి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఇండియామార్ట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు.

బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా
గ్లోబల్‌ పీఈ కంపెనీ లోన్‌స్టార్‌కు కెమికల్‌ బిజినెస్‌ను విక్రయించేందుకు జర్మన్‌ మాతృ సంస్థ బీఏఎస్‌ఎఫ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెలువడిన వార్తలు దేశీ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి.ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియామార్ట్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. రూ. 1001 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1016 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 945 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. 3.17 బిలియన్‌ యూరోలకు కన్‌స్ట్రక‌్షన్‌ కెమికల్స్‌ బిజినెస్‌ను లోన్‌స్టార్‌కు విక్రయించేందుకు బీఏఎస్‌ఎఫ్‌ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు.
 
 



You may be interested

కొత్త ఏడాది కోసం కాంట్రాబెట్స్‌

Monday 23rd December 2019

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినిచ్చే అవకాశమున్న కాంట్రా స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. ఐటీసీ: ఈ ఏడాది ఐటీసీ దాదాపు 14 శాతం పతనమైంది. సిగిరెట్లపై అధిక సెస్సు భయాలు షేరును కుంగదీశాయి. అయితే అలాంటి ప్రతిపాదనలేమీ రానందున ఇకపై షేరు పుంజుకుంటుందని మోతీలాల్‌ఓస్వాల్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తున్నాయి. వాల్యూం గ్రోత్‌ క్రమంగా పెరుగుతోందని తెలిపాయి. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు వివరించాయి. షేరు

రూ.38వేలపైన ప్రారంభమైన పసిడి

Monday 23rd December 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర సోమవారం రూ.38వేలపైన రూ.38,040 వద్ద ప్రారంభమైంది. నేడు అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడికి ధరకు డిమాండ్‌ లభించడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనం‍గా ప్రారంభం పసిడి ఫ్యూచర్ల లాభాలకు కారణమవుతున్నాయి. ఉదయం గం.10:15ని.లకు డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.108.00ల లాభంతో రూ.38099.00 వద్ద ట్రేడింగ్‌  అవుతోంది. ‘‘ ఈ వారంలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవు సందర్భంగా పసిడి

Most from this category