News


స్వల్పకాలానికి టాప్‌ సిఫార్సులు

Friday 31st January 2020
Markets_main1580453199.png-31369

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడినిచ్చే మూడు సిఫార్సులను బ్రోకరేజ్‌లు అందిస్తున్నాయి.
1. బెర్గర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 585. గతేడాది జూలై నుంచి అప్‌మూవ్‌ చూపుతూ సరైన పతనం లేకుండా దాదాపు 90 శాతం దూసుకుపోయింది. చివరకు రూ. 580 వద్ద నిరోధం ఎదుర్కొంది. అప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఐ నెగిటివ్‌గా మారింది. ప్రస్తుతం షేరు కరెక‌్షన్‌ బాటలో ఉంది.
2. భారతీ ఎయిర్‌టెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 465. ఇటీవలే బహుళసంవత్సరాల నిరోధం రూ. 508ని విజయవంతంగా దాటింది. ఈ సమయంలో వాల్యూంలు కూడా భారీగా నమోదయ్యాయి. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ మూడ్‌లో ఉంది. ఈ సమయంలో కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించవచ్చు. 
3. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 207. స్టాప్‌లాస్‌ రూ. 189. డైలీ చార్టుల్లో రూ. 198పైన బ్రేకవుట్‌ సాధించింది. ఆపై కన్సాలిడేషన్‌ స్థితిలోకి మరలింది. 200 రోజుల డీఎంఏను విజయవంతంగా దాటడంతో తదుపరి ర్యాలీకి అవకాశాలు పెరిగాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది. 



You may be interested

మార్కెట్లో ఆరంభలాభాలు ఆవిరి

Friday 31st January 2020

మార్కెట్లో ఆర్థిక సర్వే గణాంకాలు, బడ్జెట్‌ అప్రమత్తత 12వేల దిగువకు నిఫ్టీ  గరిష్టం నుంచి 450 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మెటల్‌, ఫార్మా, ఐటీ, అటో షేర్లలో అమ్మకాలు  మిడ్‌సెషన్‌ సమయానికల్లా మార్కెట్‌ ఉదయం లాభాల్ని కోల్పోయింది. ప్రధాన సూచీలైన నిఫ్టీ 12వేల దిగువకు, సెన్సెక్స్‌ 41వేల స్థాయిని కోల్పోయింది. మరికాసేపట్లో కేంద్ర ఎకానమీ చీఫ్‌ అడ్వైజర్‌ క్రిష్ణమూర్తి  2019-20 ఆర్థిక సంవత్సరపు ఎకానమి సర్వేని విడుదల చేయనున్నారు. అలాగే రేపు లోక్‌ సభలో కేంద్ర

పీఎస్‌యూ షేర్లకు అమ్మకాల షాక్‌

Friday 31st January 2020

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంపై అంచనాల ఎఫెక్ట్‌ 8 శాతం పతనమైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ సాధారణ వార్షిక బడ్జెట్‌ విడుదలకు ముందురోజు ఉన్నట్టుండి ప్రభుత్వ రంగ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొన్ని కౌంటర్లలో భారీ అమ్మకాలకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ కంపెనీలతో కూడిన నిఫ్టీ సీపీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం క్షీణించింది. వెరసి 2016 ఫిబ్రవరి తదుపరి కనిష్టానికి చేరింది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో 1724 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం నిఫ్టీ

Most from this category