News


మళ్లీ సుంకాల పోరు..ముదిరిన వాణిజ్య యుద్ధం

Saturday 24th August 2019
Markets_main1566624828.png-27988

  • యుఎస్‌ టారిఫ్‌లకు దీటుగా సుంకాలను విధించిన చైనా
  • 75 బి. డా. యుఎస్‌ దిగుమతులపై 10 శాతం సుంకం
  • ఫలితంగా 550 బి.డా. చైనా దిగుమతులపై 5 శాతం అదనపు సుంకం విధించిన ట్రంప్‌
  • చైనా నుంచి బయటకు వచ్చేయమని అమెరికన్‌ కంపెనీలను కోరిన ట్రంప్‌ 

టిట్‌ ఫర్‌ టాట్‌..వాణిజ్య యుద్ధం

అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం 550 బిలియన్‌ డాలర్ల  చైనా దిగుమతులపై అదనంగా 5 శాతం సుంకాలను విధించడంతో యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఘర్షణ తీవ్రమయ్యింది. అంతేకాకుండా చైనా నుంచి అమెరికన్‌ కంపెనీలు బయటకు వచ్చేయలని, ఈ కంపెనీలు వెంటనే ప్రత్యమ్నయం వెతుక్కోవాలని ట్రంప్‌ కోరారు. తీవ్రతరం అవుతున్న యు.ఎస్-చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతుందని ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. ఫలితంగా యుఎస్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. యుఎస్‌ నాస్డాక్ కాంపోజిట్ 3 శాతం, ఎస్ అండ్‌ పీ 500 2.6 శాతం, డోజోన్స్‌ 2.37 శాతం నష్టపోయాయి. యు.ఎస్. ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తులవైపు మారుతుండడంతో యుఎస్‌ ట్రెజరి ఈల్డ్‌లు దిగుబడి కూడా పడిపోయాయి. అంతేకాకుండా చమురు నష్టపోయింది. 
 మన మార్కెట్లు శుక్రవారం ముగిసిన తర్వాత ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు వచ్చే వారం అతి పెద్ద నష్టాన్నిఎదుర్కొంటాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ విచారించావలసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వాలు యుఎస్‌లో  చైనా వాణిజ్యంపై ఉదారంగా వ్యవహిరించారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది’ అని ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశ అధ్యక్షుడిగా, ఇది జరగకుండా చూసుకుంటానని అన్నారు.

చైనా దిగుమతులపై సుంకాలు

250 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 25 శాతం టారిఫ్‌ను 30 శాతానికి యుఎస్‌ పెంచింది. ఈ చర్య అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం టారిఫ్‌ను 15 శాతానికి పెంచగా, ఈ చర్య సెప్టెంబర్‌ 1 నుంచి అమలులో‍కి వస్తుందని ట్రంప్‌ అన్నారు. ఇందులో సగం వస్తువులపై టారిఫ్‌లను డిసెంబర్‌ 15 వరకు మినహాయించనున్నారు. కాగా ఈ టారిఫ్‌లను విధించే తేదీలను యుఎస్‌ ట్రేడ్‌ ప్రతినిధులు ద్రువీకరించారు.

న్యాయమైన వాణిజ్యాన్ని చైనా చేయడం లేదని, యుఎస్‌ తయారిదారులు, కార్మికులను ప్రభావితం చేసేలా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఒత్తిడి చేస్తోందని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ చైనాను నిందించారు. ‘ మాకు చైనా అవసరం లేదు. వాస్తవంగా చైనా లేకపోతేనే చాలా మంచిది. గత దశాబ్దాల కాలం నుంచి చైనా అమెరికా సంపదను దోచుకుంటుంది. దీన్ని ఖచ్చితంగా ఆపాలి’ అని ట్రంప్‌ ట్విట్టర్‌లో శుక్రవారం పేర్కొన్నారు.

మాకు చైనా అవసరం లేదు.

‘చైనాలోని అమెరికన్‌ కంపెనీలు వెంటనే ప్రత్యమ్నయం వెతుక్కొండి. తిరిగి అమెరికా వచ్చి ఇక్కడ తమ ఉత్పత్తులను తయారుచేసుకోండి’ అని అన్నారు. కాగా అమెరికా కంపెనీలను చైనా నుంచి బయటకు వచ్చేయమని చెప్పే అధికారం ట్రంప్‌కు ఎంతవరకుందో స్పష్టత లేదు. అంతేకాకుండా ఫెడ్‌ఎక్స్‌, అమెజాన్‌, యూపీఎస్‌, యుఎస్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ వంటి సంస్థలు ఒపెయోడ్‌ పెంటనెల్‌(మెడికల్‌ డ్రగ్స్‌)లను యుఎస్‌లోకి డిలవరి చేయడానికి అంగీకరించకండి అని​అన్నారు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ కదలికల్లో హైడ్రామా..పాజిటివ్‌ ముగింపు

Saturday 24th August 2019

శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత దేశ, విదేశాల్లో పలు సానుకూల, ప్రతికూల వార్తలు వెలువడిన నేపథ్యంలో గత రాత్రి విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభపడింది. సింగపూర్‌లో ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 10,865.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,842 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. క్రితం రోజు మన మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక మందగమనం నుంచి

ఇక నుంచి వెర్షన్‌ సంఖ్యతోనే ఆండ్రాయిడ్‌ ఓఎస్‌

Saturday 24th August 2019

లేటెస్ట్‌ వెర్షన్‌ పేరు 'ఆండ్రాయిడ్ 10' న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌లో విరివిగా వాడకంలో ఉన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్‌)కు ఇక నుంచి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల పేర్లు పెట్టకుండా.. సింపుల్‌గా వెర్షన్‌ నంబరుతో మాత్రమే విడుదల చేయాలని టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయించింది. వివిధ వెర్షన్లకు వివిధ రకాల పేర్లు కొనుగోలుదారుల్లో గందరగోళం రేపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ బ్లాగ్‌లో వెల్లడించింది. దీంతో కొత్తగా రాబోయే వెర్షన్‌ను కేవలం 'ఆండ్రాయిడ్ 10'గా

Most from this category