News


ట్రంప్‌ టాక్స్‌ కట్స్‌పై అనిశ్చితి- యూఎస్‌ పతనం

Thursday 12th March 2020
Markets_main1583985471.png-32419

6 శాతం దిగజారిన డోజోన్స్‌
5 శాతం చొప్పున పడిన ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌

ఆసియా మార్కెట్లు 7-3 శాతం మధ్య డీలా 
నేడు యూరోపియన్‌ మార్కెట్లు బోర్లా?

తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను విశ్వ వ్యాధి(పాండెమిక్‌)గా గుర్తించడంతో బుధవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు కరోనా ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రణాళికల్లో స్పష్టత లోపించడంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి డోజోన్స్‌ 1,465 పాయింట్లు(5.9 శాతం) కుప్పకూలి 23,553 వద్ద నిలిచింది. ఇక ఎస్‌అండ్‌పీ 141 పాయింట్లు(4.9%) పడిపోయి 2,741 వద్ద ముగిసింది. ఇదే విధంగా నాస్‌డాక్‌ 392 పాయింట్లు(4.7%) వెనకడుగుతో 7,952 వద్ద స్థిరపడింది. కాగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ధాయ్‌లాండ్‌, జపాన్‌, కొరియా, తైవాన్‌, ఇండొనేసియా, సింగపూర్‌, హాంకాంగ్‌ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. చైనా మాత్రమే 1.2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక బుధవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 1.4-0.4 శాతం మధ్య క్షీణించాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ నుంచి మార్కెట్లు భారీ సహాయక ప్యాకేజీని అంచనా వేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

యూరప్‌ స్వల్ప నష్టాలతో
అయితే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేట్ల కోత, 39 బిలియన్‌ డాలర్లతో బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. కాగా.. కరోనా వ్యాప్తి కారణంగా యూరోపియన్‌ దేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై ప్రెసిడెంట్‌ ట్రంప్‌ నిషేధాన్ని ప్రకటించడంతో నేడు ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి యూరోపియన్‌ మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ప్రారంభంకావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బోయింగ్‌ డౌన్‌ 
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు రద్దవుతున్న నేపథ్యంలో బోయింగ్‌ కంపెనీ షేరు 18 శాతంపైగా కుప్పకూలింది. మరోవైపు ట్రెజరీ ఈల్డ్స్‌ తిరిగి నీరసించడంతో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ 6 శాతం స్థాయిలో పతనమయ్యాయి. చైనాలో అమ్మకాలు క్షీణించిన వార్తలతో నైక్‌ ఇంక్‌ షేరు 5 శాతం నష్టపోయింది. గత 20 రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 11.92 బిలియన్లుకాగా.. బుధవారం 15.1 బిలియన్‌ షేర్లు చేతులు మారడం గమనార్హం!



You may be interested

సెన్సెక్స్‌ 1739 పాయింట్లు , నిఫ్టీ 510 పాయింట్లు క్రాష్‌..!

Thursday 12th March 2020

10వేల మార్కును కోల్పోయిన నిఫ్టీ   34వేల దిగువన ప్రారంభమైన సెన్సెక్స్‌ 5-7శాతం నష్టపోయిన ప్రధాన ఇండెక్స్‌లు  కరోనా వైరస్‌ వ్యాధి భయాలు మరోసారి భారత స్టాక్‌ మార్కెట్‌ను ముంచేశాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం ఏకంగా 5శాతం నష్టంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 34వేల మార్కును, నిఫ్టీ 10వేల మార్కును కోల్పోయాయి. సూచీలైన సెన్సెక్స్‌ 1739 పాయింట్ల నష్టంతో 33958 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లను కోల్పోయి 9, 948

పునరుద్దరణ ప్రణాళిక ‘‘యస్‌’’

Thursday 12th March 2020

ఈక్విటీ, డెట్‌ మార్గాల్లో నిధులు రూ. 20వేల కోట్లు ఈక్విటీ కింద  సమకూర్చనున్న బ్యాంకులు సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌లోకి రూ. 30,000 కోట్లు రాణా కపూర్‌ ఈడీ కస్టడీ పొడిగింపు ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించే ప్రణాళికను రిజర్వ్‌ బ్యాంక్‌ ఖరారు చేసింది. మారటోరియం ఎత్తివేసినా నిధుల లభ్యతపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు పరిష్కారమార్గాలు ఇందులో పొందుపర్చింది. ప్రణాళిక ప్రకారం.. ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వ రంగ ఎస్‌బీఐతో పాటు ఇతరత్రా

Most from this category