ఇండియా టారీఫ్‌లపై ట్రంప్ ట్వీట్
By Sakshi

‘ఇండియా , అమెరికా దిగుమతులపై గత కొంత కాలం నుంచి అధికంగా సుంకాలను విధిస్తునే ఉంది. తాజాగా కూడా సుంకాలను పెంచింది. ఇది మంచిది కాదు దీనిని మేం అంగీకరించం. ఈ సుంకాలను ఇండియా ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై ఇండియా ప్రధాని నరేంద్రమోదీతో చర్చలకై ఎదురుచూస్తున్నా’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. ఈ వారం చివరిలో జీ 20 సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ విషయానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతకు ముందు ట్రంప్ భారత్‌ను టారిప్ కింగ్ అని పిలిచిన విషయం తెలిసిందే. భారత ఎగుమతులైనా స్టీల్, అల్యుమినియంపై అమెరికా సుంకాలు పెంచడంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బాదం, పప్పుదినుసులు, నట్స్ వంటి 28 వస్తువులపై ఇండియా సుంకాలను పెంచింది. ఫలితంగా 2,170 లక్షల డాలర్ల అదనపు ఆదాయం ఇండియాకు సమకూరనుంది. వాణిజ్య ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి అమెరికా ఇండియాను తొలగించడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్దం మొదలైంది.
You may be interested
తగ్గుముఖం పట్టిన పసిడి
Thursday 27th June 2019చైనాతో వాణిజ్య యుద్ధ చర్చలపై అమెరికా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 7డాలర్లు నష్టపోయి 1,408 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సులో చైనా- అమెరికా దేశాధ్యక్షులు వాణిజ్య యుద్ధంపై చర్చించనున్నారు. ఈ కీలక పరిణామాణ నేపథ్యంలో నిన్న యూఎస్ ట్రెజరీ అధికారి స్టీవెన్ మాట్లాడుతూ ఇరుదేశాలకు ఆమోదయోగ్యంగా
అమెరికా-చైనా మధ్య తాత్కాలిక సంధి
Thursday 27th June 2019కీలకమైన జీ 20 సమ్మిట్ ముందు చైనా- అమెరికా దేశాల మధ్య తాత్కాలికంగా సంధి కుదిరిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్(ఎస్సీఎమ్పీ) రిపోర్ట్ చేసింది. ఫలితంగా 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా విధించనున్న సుంకాలు తాత్కాలికంగా నిలిచాయని తెలిపింది. ఈ తాత్కలిక ఒప్పందాన్ని వాషిగ్టన్ కూడా ఒప్పుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షడు జిన్‌పింగ్‌తో శనివారం ఉదయం 11.30కు సమావేశం కానున్నారు. ‘ఈ వారం చివరిలో