News


ట్రెంట్‌- అరబిందో.. ఒకటే జోరు!

Friday 7th February 2020
Markets_main1581057516.png-31594

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌
7 శాతం జంప్‌చేసిన షేర్లు

వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో సెన్సెక్స్‌ 112 పాయింట్లు క్షీణించి 41,140కు చేరగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,111 వద్ద ట్రేడవుతోంది. ఈ  నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అటు రిటైల్‌ రంగ టాటా గ్రూప్‌ కంపెనీ ట్రెంట్‌ లిమిటెడ్‌, ఇటు.. హెల్త్‌కేర్‌ కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ట్రెంట్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ట్రెంట్‌ లిమిటెడ్‌ రూ. 54 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 21 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 49 శాతం పెరిగి రూ. 1028 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ట్రెంట్‌ షేరుకి రీసెర్చ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. టార్గెట్‌ ధరను రూ. 595 నుంచి రూ. 685కు పెంచింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ట్రెంట్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 633 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 640 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.

అరబిందో ఫార్మా 
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అరబిందో ఫార్మా రూ. 705 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది నామమాత్ర క్షీణతకాగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 11 శాతం బలపడి రూ. 1208 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 12 శాతం పెరిగి రూ. 5,895 కోట్లను తాకింది. యూఎస్‌ ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 2969 కోట్లకు చేరింది. ఇది మొత్తం ఆదాయంలో సగభాగంకాగా.. ఇబిటా మార్జిన్లు 20.5 శాతం వద్ద నిలకడను చూపాయి. వాటాదారులకు షేరుకి రూ. 1.75 చొప్పున అరబిందో బోర్డు మధ్యతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 551 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 553 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.



You may be interested

టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌కు కరోనా వైరస్‌ కష్టాలు

Friday 7th February 2020

చైనాలో జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌ మూసివేత మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: పవన్ గోయెంకా మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: ఎంఅండ్‌ఎం చైనాలో కరోనా వ్యాధి వ్యాప్తితో టాటా మోటర్స్‌ కంపెనీ జేఎల్‌ఆర్‌ వాహన ఉత్పత్తులపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. టాటా మోటర్స్‌,  చైనా కంపెనీ చెర్రీ.. జాయింట్‌వెంచర్‌గా ఏర్పాటుచేసిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ ప్లాంట్‌ చైనాలోని షాంఘై నగర సరిహద్దుల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతం కరోనా వైరస్‌ పుట్టికొచ్చిన

అధిక వాల్యూషన్‌ ఉన్న షేర్లే బెటర్‌!

Friday 7th February 2020

శంకర్‌ శర్మ సంచలన సూచన సాధారణంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో అందరూ అల్ప పీఈ(ప్రైస్‌ టు ఎర్నింగ్‌) నిష్పత్తి ఉన్న షేర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. పీఈ తక్కువగా ఉన్న షేర‍్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు అనలిస్టులు లెక్కిస్తారు. కానీ సీనియర్‌ అనలిస్టు శంకర్‌ శర్మ తాజాగా కొత్త సూచన చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో అధిక పీఈ ఉన్న స్టాకులను కొనడం, అల్ప పీఈ ఉన్న స్టాకులను షార్ట్‌ చేయడం

Most from this category