News


ఐటీసీ సహా 46 షేర్లు బుల్లిష్‌!

Tuesday 31st December 2019
Markets_main1577787379.png-30564

ఎంఏసీడీ సంకేతాలు
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిలో బుల్లిష్‌ సంకేతాలు
దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 46 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐటీసీ, ఓఐఎల్‌, లుపిన్‌, ఎన్‌బీసీసీ, నాట్కో, తేజాస్‌, జీఎస్‌పీఎల్‌, వరుణ్‌ బెవరేజెస్‌, స్కిప్పర్‌, ఓబెరాయ్‌ రియల్టీ, టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
 ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 15 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌, క్రిసిల్‌, జేకేపేపర్‌, రెప్కోహోమ్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


 ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

2019కు నష్టాలతో వీడ్కోలు

Tuesday 31st December 2019

సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనం నిఫ్టీ 87 పాయింట్లు డౌన్‌ ఎదురీదిన రియల్టీ రంగం ఈ కేలండర్‌ ఏడాది(2019) చివరి రోజుకి దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి ఏ దశలోనూ కోలుకోలేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి ఇంట్రాడే కనిష్టాలకు చేరువలో మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనమై 41,254 వద్ద నిలవగా.. నిఫ్టీ 87

2020లో పెట్టుబడులకు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బెట్స్‌

Tuesday 31st December 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: 2020 స్టాక్‌ పిక్స్‌ విభిన్న రంగాల నుంచి 23 స్టాక్స్‌ ఎంపిక జాబితాలో ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, టెక్‌ సెక్టార్స్‌ దేశీ రీసెర్చ్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొత్త ఏడాది(2020)లో పెట్టుబడులకు అనువైన 23 స్టాక్స్‌ను ఎంపిక చేసింది. వీటిని విభిన్న రంగాల నుంచి ఎంచుకుంది. జాబితాలో ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఫార్మా, ఇండస్ట్రియల్స్‌, ఆయిల్‌, ఆటోమొబైల్‌, సిమెంట్‌, టెక్నాలజీ రంగాలకు చోటు లభించడం గమనార్హం. గత మూడు నెలల్లో దేశీయంగా స్టాక్‌

Most from this category