News


ఫ్లోర్‌ ప్రైస్‌ కోసం కొన్ని నెలలు ఆగాల్సిందే..

Saturday 28th December 2019
Markets_main1577474913.png-30483

టెలికం సేవలకు ఫ్లోర్‌ ప్రైస్‌ (కనిష్ట ధరలు)ను నిర్ణయించాలని టెలికం కంపెనీలు ట్రాయ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో, దీనిపై భాగస్వాముల అభిప్రాయాలను కోరుతూ ట్రాయ్‌ సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం తాము అందిస్తున్న సేవలకు, వసూలు చేస్తున్న చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, లాభ, నష్టాల్లేని స్థాయికి తీసుకొచ్చేందుకు ఫ్లోర్‌ ప్రైస్‌ను నిర్ణయించాలన్నది కంపెనీల డిమాండ్‌. అయితే, కంపెనీల డిమాండ్‌ను మన్నిస్తూనే, ఇది వినియోగదారులకు వ్యతిరేకంగా ఉండరాదన్నది ట్రాయ్‌ అభిప్రాయమని, వచ్చే జూన్‌ లోపు ఇది అమలు సాధ్యం కాదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. 

 

వ్యయాలకు సంబంధించి రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియాలు ట్రాయ్‌కు సమర్పించిన డేటా మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఒక జీబీ డేటా, ఒక నిమిషానికి వాయిస్‌ కాల్‌ విషయంలో పోలిక లేదని ఆ వర్గాలు తెలిపాయి. చార్జీలపై అటువంటి పరిమితి నిర్ణయించాల్సిన అవసరం ఉందా? వ్యయాలకు సంబంధించిన గణాంకాలను ఎలా నిర్ణయించారన్న ప్రశ్నలకు ట్రాయ్‌ సమాధానం కోరింది. టెలికం కంపెనీలకు అవుతున్న ఖర్చులపై మార్జిన్‌పై స్పష్టత కోసమే ఈ ప్రశ్నలు వేసింది. అలాగే, ఒకవేళ కనిష్ట ధరను విధించాల్సి వస్తే, అదే సమయంలో గరిష్ట ధరలను కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉందా? అని కూడా ప్రశ్నించింది. టెలికం కంపెనీలు డిసెంబర్‌లో చార్జీలను 42 శాతం వరకు పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చార్జీలు తమకు లాభసాటి కాదన్నది వాటి వాదన. సగటు వినియోగదారు నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.180-200గా ఉంటే తప్ప సేవలు లాభసాటి కావని పేర్కొంటున్నాయి. సమీప కాలంలో రూ.200కు, తదుపరి కొంత కాలానికి రూ.300కు ఏఆర్‌పీయూ పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌భారతీ మిట్టల్‌ ఇటీవలే ప్రకటించారు.  

 

మూడు టెలికం కంపెనీలు ఇటీవలే రేట్లను పెంచడంతో ఆ ప్రభావం ఎంత మేర, మొత్తం మీద పెరిగే ఏఆర్‌పీయూ ఎంత, ఒక యూనిట్‌ వాయిస్‌ కాల్‌, డేటాకు అవుతున్న ఖర్చు ఎంత అనే వివరాలను అవి అప్‌డేట్‌ చేస్తున్నాయని, ఆ వ్యక్తి తెలిపారు. తమకు అవుతున్న ఖర్చుల వివరాలను టెలికం కంపెనీలు ట్రాయ్‌కు సమర్పించగా, అందులో జియో తక్కువ వ్యయాన్ని పేర్కొంటే, వొడాఫోన్‌ ఐడియా అధిక వ్యయాన్ని చూపించిందని చెప్పారు. ఒక జీబీ, ఒక నిమిషం కాల్‌కు రూ.10 ఖర్చవుతున్నట్టు జియో తెలిపిందని.. ఎయిర్‌టెల్‌ రూ.16గా, వొడాఫోన్‌ ఐడియా రూ.22గా పేర్కొన్నట్టు వెల్లడించారు. You may be interested

పూర్తిగా జూపల్లి చేతికి ‘మై హోమ్‌’

Saturday 28th December 2019

సీఆర్‌హెచ్‌ నుంచి 50 శాతం వాటా కొనుగోలు రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించిన గ్రూప్‌ సంస్థలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటిదాకా ఐర్లాండ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీ సీఆర్‌మెచ్‌ ఇండియాతో కలిసి 50:50 భాగస్వామ్య కంపెనీగా ఉన్న ‘మై హోమ్‌ ఇండస్ట్రీస్‌’ను జూపల్లి రామేశ్వరరావుకు చెందిన సంస్థలు పూర్తిగా సొంతం చేసుకోనున్నాయి. సీఆర్‌హెచ్‌ ఇండియాకు చెందిన 50 శాతం వాటాను మైహోమ్‌కు చెందిన నిర్మాణ సంస్థ మైహోమ్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌,

అంతర్జాతీయ చార్ట్‌ల్లో భారత సూపర్‌ స్టాక్స్‌

Saturday 28th December 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే రాబడుల విషయంలో వెనుకబడినా.. మన దేశానికి చెందిన కొన్ని స్టాక్ట్స్‌ 2019లో మెరుగైన రాబడులతో అంతర్జాతీయ చార్ట్‌ల్లో చోటు సంపాదించాయి. అంతర్జాతీయంగా టాప్‌-10లో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చోటు సంపాదించాయి.    బీమారంగం ఎస్‌బీఐ లైఫ్‌ షేరు 2019లో 65.8 శాతం రాబడులు ఇచ్చి ‘బ్లూంబర్గ్‌ వరల్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇండెక్స్‌’లో టాప్‌ స్టాక్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 64.2 శాతం రాబడులతో

Most from this category