News


తొలి త్రైమాసికానికి 8 రికమండేషన్లు

Friday 3rd January 2020
Markets_main1578035398.png-30648

కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు(మార్చి చివరకల్లా) మంచి రాబడిని అందించే ఎనిమిది షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. సుదర్శన్‌ కెమికల్స్‌: టార్గెట్‌ రూ. 470. ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు. క్రమానుగత వృద్దిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్‌ వాటా పెంచుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పిగ్‌మెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించింది. అంతర్జాతీయంగా రెండు బడా కంపెనీలు ఈ వ్యాపారం నుంచి తప్పుకోవడం కంపెనీ మరింత ఎదిగేందుకు దోహదం చేయనుంది. 
2. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 208. ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు. ఆటో రీప్లేస్‌మెంట్‌ డిమాండ్‌ రికవరీ, టెక్‌ అప్‌గ్రెడేషన్‌, కొత్త ఉత్పత్తులతో కంపెనీ మరింత జోరు చూపనుంది. సోలార్‌, ఈరిక్షా రంగాల్లో కొత్త అవకాశాలు కంపెనీకి లాభదాయకాలు. వ్యయనియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 
3. ఎల్‌అండ్‌టీ: టార్గెట్‌ రూ. 1420. ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు. బలమైన బాలెన్స్‌ షీట్‌, బలమైన టెక్‌ సామర్ధ్యం.. కంపెనీకి ఎంతో కలిసివస్తున్నాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైస్పీడ్‌ రైల్‌ నిర్మాణంలో జాప్యం కంపెనీ ఆర్డర్‌బుక్‌పై ప్రభావం చూపవచ్చు. కానీ టెక్నికల్స్‌ మాత్రం కంపెనీషేరులో మరింత అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయి. 
4. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 920. సుసీల్‌ ఫైనాన్స్‌ సిఫార్సు. రూ. 820 స్థాయిల నుంచి డౌన్‌ట్రెండ్‌లోకి మరలింది. అనంతరం రూ. 720- 740 రేంజ్‌లో కన్సాలిడేట్‌ చెందింది. అదే స్థాయిల వద్ద బాటమ్‌ అవుట్‌ చెంది తిరిగి ర్యాలీకి రెడీ అయింది. 
5. హిండాల్కో: టార్గెట్‌ రూ. 260. సుసీల్‌ ఫైనాన్స్‌ సిఫార్సు. డౌన్‌ట్రెండ్‌ నుంచి క్రమంగా కోలుకుంటోంది. తాజాగా 200 రోజుల డీఎంఏ స్థాయిని బలంగా దాటింది. బాటమ్‌ అవుట్‌ సంకేతాలు ఇస్తోంది. చార్టుల్లో బుల్లిష్‌ హార్మోనిక్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది.
6. టాటాస్టీల్‌: టార్గెట్‌ రూ. 560. సుసీల్‌ ఫైనాన్స్‌ సిఫార్సు. చాలా రోజుల పాటు స్వల్ప రేంజ్‌లో కన్సాలిడేట్‌ చెందింది. బ్రెగ్జిట్‌పై స్పష్టత వచ్చాక బలమైన బ్రేకవుట్‌ సాధించింది. ఈ అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగుతుంది. 
7. టాటామోటర్స్‌: టార్గెట్‌ రూ. 225. మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సు. నిఫ్టీ ఆటో సూచీ ట్రెండ్‌లైన్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఇదే సమయంలో టాటామోటర్స్‌ బలమైన వాల్యూంలతో మంచి ర్యాలీ జరుపుతోంది. ప్రస్తుత నిర్మితి చూస్తే మరింత అప్‌ట్రెండ్‌ కొనసాగింపునకే ఛాన్సులున్నాయి.
8. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: టార్గెట్‌ రూ. 1830. మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సు. నాలుగు నెలలుగా హయ్యర్‌ బాటమ్స్‌, హయ్యర్‌ హైలు ఏర్పరుస్తోంది. తొమ్మిది వారాలుగా కన్సాలిడేషన్‌ జోన్‌కు పైన స్థిరంగా కదలాడుతోంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. You may be interested

ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గేవరకూ గరిష్టంలోనే చమురు

Friday 3rd January 2020

చమురు ధరలు ఇప్పటికే 3 శాతం అప్‌ ఇరాన్‌ ప్రతిచర్యలు ప్రభావం చూపవచ్చు గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయంవద్ద అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల కారణంగా ఇరానియన్‌ జనరల్‌ కాసిమ్‌ మృతి చెందడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాక్‌ చెందిన అధికారులు సైతం మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3 శాతం ఎగశాయి. ప్రపంచ చమురు సరఫరాలలో మూడో వంతు వాటాను కలిగిన ప్రాంతంలో నెలకొన్న

ఇకపై మెటల్‌ షేర్లకు డిమాండ్‌?

Friday 3rd January 2020

సాధారణంగా వర్ధమాన మార్కెట్లకూ, కమోడిటీలకు పటిష్ట బంధం ఉంటుంది. ఇవి ఒకే విధమైన కదలికలకు లోనవుతుంటాయి. వెరసి ఇకపై అటు వర్ధమాన స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు మెటల్‌ కౌంటర్లు జోరు చూపే వీలున్నదంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు! బుల్‌ ట్రెండ్‌, సాంకేతిక అంశాలు.. తదితర పలు విషయాలపై విశ్లేషకుల స్పందన తీరిలా.. బుల్‌ జోరు చూపే మార్కెట్లలో ప్రతిసారీ చోటుచేసుకునే దిద్దుబాట్లు(కరెక్షన్లు) ర్యాలీ బలాన్ని ప్రతిబింబిస్తాయి. 2019 ఆగస్ట్‌ తదుపరి వచ్చిన కరెక్షన్లు స్వల్ప

Most from this category