News


పెరిగిన షార్ట్స్‌ రోల్‌ఓవర్‌.. అప్‌మూవ్‌కు ప్రతికూలమే!

Friday 30th August 2019
Markets_main1567148754.png-28113

-సెప్టెంబర్‌ సిరీస్ రోల్‌ఓవర్‌లో పెరిగిన షార్ట్‌పొజిషన్లు
దేశియ, అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణాన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ సిరీస్‌లో అధికంగా షార్ట్‌ పొజిషన్‌లను రోల్‌ఓవర్‌ చేసుకున్నారు. కాగా ఈ భయాలు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక చర్యలు, ద్రవ్యలభ్యత చర్యలను నిరుపయోగం చేశాయని విశ్లేషకులు తెలిపారు. నిఫ్టీ అగష్టు సిరీస్‌లో 2.7 శాతం నష్టపోయింది. దీంతో గత వరుస మూడు సిరీస్‌లలో నిఫ్టీ నష్టల్లోనే ముగియడం గమనార్హం. నిఫ్టీ అగష్టు సిరీస్‌లో అధికంగా నష్టపోయిన ఇండెక్స్‌లలో, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 16 శాతం క్షీణించి ముందుండగా, తర్వాత నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌, నిఫ్టీ మీడియా, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌లు 6-13 శాతం నష్టపోయి తర్వాత స్థానాలలో ఉన్నాయి. 
   నిఫ్టీ మూడు నెలల రోల్‌ఓవర్‌ సగటు 72 శాతం కంటే, సెప్టెంబర్‌ రోల్‌ఓవర్‌ 62 శాతంతో తక్కువగా ఉందని ప్రోవిజినల్‌ డేటా తెలుపుతోంది. ‘ షార్ట పొజిషన్‌లు అధికంగా ఉండడంతో  రోల్‌ ఓవర్‌ ఖర్చు తగ్గి 38-40 బేసిస్‌ పాయింట్లగా(బీపీఎస్‌) ఉంది. ఇది సగటు 50-55 బీపీఎస్‌ కం‍టే తక్కువ. అంతేకాకుండా నిఫ్టీ రోల్‌ఓవర్‌ మూడు నెలల సగటు కంటే తక్కువగా ఉంది’ అని ఎడెల్విస్ సెక్యూరిటీస్ అల్టర్నేటివ్‌, క్వాంటిటేటివ్‌ హెడ్‌ యోగేష్ రాడ్కే అన్నారు. ‘ నిఫ్టీ సెప్టెంబర్‌ సిరీస్‌పై జాగ్రత్తగా ఉన్నాం. నిఫ్టీ తన 200 డీఎంఏ(డే మూవింగ్‌ యావరేజ్‌) 11,200 వద్ద నిరోధం ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నాం’ అని రాడ్కే తెలిపారు. నిఫ్టీ ఈ స్థాయి కంటే పైన స్థిరపడుతుందో లేదో వేచి చూడాలని, నిఫ్టీకి దిగువన 10,585 వద్ద మద్ధతు లభిస్తుందని ఆయన అన్నారు.  ‘తక్కువ రోల్‌ ఓవర్‌ ఉండడంతో పాటు, షార్ట్‌ పోజిషన్లు పెరగడంతో సెప్టెంబర్‌ సిరీస్‌లో నిఫ్టీ 11,200-11,250 స్థాయి వద్ద నిరోధం ఎదుర్కొంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్‌ విశ్లేషకుడు చందన్ తపారియా అన్నారు. ఒక వేళ నిఫ్టీ 10,900 పైన, నిఫ్టీ బ్యాంక్‌ 27,000 పైన స్థిరంగా ఉంటే షార్ట్‌ కవరింగ్‌లను చూడవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అన్నారు.

షార్ట్‌ పొజిషన్‌లలో రోల్‌ఓవర్‌యిన స్టాకులు..
 బెర్జర్‌ పెయింట్‌, టాటా గ్లోబల్‌, మారికో, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏసియన్‌ పెయింట్‌ వంటి స్టాకులు నిఫ్టీ సెప్టెంబర్‌ సరీస్‌లో లాంగ్‌ పొజిషన్‌లలో రోల్‌ఓవర్‌ అవ్వగా, టాటాస్టీల్‌, టాటా మోటర్స్‌ డీవీఆర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, జిందాల్‌ స్టీల్‌, డిష్‌ టీవీ, టాటా మోటర్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, బీహెచ్‌ఈఎల్‌, గ్రాసిమ్‌ వంటి స్టాకులు ఈ సెప్టెంబర్‌ సిరీస్‌లో షార్ట్‌పొజిషనలలో రోల్‌ఓవర్‌ అయ్యాయి. 
    గత సెషన్‌లో నిఫ్టీ 97.80 పాయింట్లు కోల్పోయి 10,948.30 వద్ద, సెన్సెక్స్‌ 382.91 పాయింట్లు కోల్పోయి 37,068 వద్ద ముగిసింది. కాగా శుక్రవారం ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి జీడీపీ సంఖ్య వెలువడనుంది. కానీ ఈ జీడీపీ 6 శాతం కంటే ఎక్కువగా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే కాలంలో చైనా జీడీపీ 6.2 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. దీనిపై ఇన్వెస్టర్లు దృష్ఠి పెట్టనున్నారు. 



You may be interested

బలమైన ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా ఆర్‌బీఐ నిఘానేత్రం

Friday 30th August 2019

బ్యాంకింగేతర వ్యవస్థను బలపరిచేందుకు కీలకమైన ఎన్‌బీఎఫ్‌సీలను కూడా ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తన పర్యవేక్షణలోకి తీసుకురానుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు(నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు), వాణిజ్య బ్యాంకులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆర్‌బీఐ ఇకపై నిశితంగా పరిశీలించనుంది. ఇందులో శ్రీరామ్‌ గ్రూప్‌కు చెందిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ వంటి దిగ్గజాలున్నాయి. కాగా ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌లో 85 శాతం ఆస్తులు వీటి కిందనే ఉండగా, బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాల మొత్తం ఆస్తులలో 12 శాతం

అదానీ చేతికి ఎస్సెల్‌ సోలార్‌ ప్లాంట్లు

Friday 30th August 2019

డీల్‌ విలువ రూ.1,300 కోట్లు  ముంబై: ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన సౌర శక్తి ప్లాంట్లను అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్సిమిషన్‌ కొనుగోలు చేయనున్నది. ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన రెండు అనుబంధ సం‍స్థలు-ఎస్సెల్‌ గ్రీన్‌ ఎనర్జీ, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలోని 205 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను రూ.1,300 కోట్లకు కొనుగోలు చేస్తున్నామని అదానీ గ్రీన్‌ ఎనర్జీ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం

Most from this category