News


ఐటీసీ, ఐషర్‌ కౌంటర్లలో పెరిగిన షార్ట్స్‌

Monday 10th February 2020
Markets_main1581318449.png-31656

షేరు ధరలో పతనం నమోదయి, ఓఐ పెరిగిన షేరు కౌంటర్లో షార్ట్స్‌ పెరిగినట్లు, ధరతో పాటు ఓఐ పెరిగితే లాంగ్స్‌ పెరిగినట్లు నిపుణులు విశ్లేషిస్తారు.

ఫిబ్రవరి డెరివేటివ్స్‌ సీరిస్‌లో ట్రేడర్ల యాక్టివిటీ పెరిగిన ఐదు షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
1. ఐటీసీ: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 10 శాతం. ధరలో మార్పు: - 10.5 శాతం. బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించడం షేరుపై పెను నెగిటివ్‌ ప్రభావం చూపింది. దీంతో ఒక్కమారుగా షేరు భారీపతనం నమోదు చేసి బహుళ సంవత్సరాల కనిష్టాలకు చేరింది. పలు బ్రోకరేజ్‌లు షేరు టార్గెట్‌ ధరను తగ్గించాయి. 
2. ఐషర్‌ మోటర్స్‌: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 15 శాతం. ధరలో మార్పు: - 6.9 శాతం. క్యు3లో బలహీన ఫలితాల కారణంగా షేరు ధర బాగా పతనమైంది. పలు బ్రోకరేజ్‌లు షేరు టార్గెట్‌, రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఇప్పట్లో కోలుకోవడం కష్టమని అంచనా వేస్తున్నాయి.
3. కోల్‌ ఇండియ: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 113 శాతం. ధరలో మార్పు: - 12.7 శాతం. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఏడో విడత గత నెల విడుదలైంది. దీంట్లో 3 శాతం ఈటీఎఫ్‌ డిస్కౌంట్‌ లభిస్తుండడంతో దీనికి అప్లై చేయడం, దీనిలో భాగమైన షేర్లను షార్ట్‌ చేయడమనే ప్రక్రియను ట్రేడర్లు చేపట్టారని నిపుణుల భావన. అయితే ఇది ఫండమెంటల్స్‌లో మార్పు కారణంగా వచ్చిన పతనం కాదుకాబట్టి ఈ సీరిస్‌ చివరకు ఈ షార్ట్స్‌ అన్నీ క్లోజవుతాయని అంచనా.
4. ఎన్‌టీపీసీ: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 84.7 శాతం. ధరలో మార్పు: - 3.1 శాతం. ఇది కూడా పైన చెప్పిన ఈటీఎఫ్‌లో భాగమే. పైన చెప్పిన కారణంతో పాటు కంపెనీలో వాటాల ఉపసంహరణపై సందేహాలు, వాల్యూషన్ల భయాలు షేరుపై నెగిటివ్‌ ప్రభావం చూపాయి.
5. హెచ్‌యూఎల్‌: ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో మార్పు: 13.3 శాతం. ధరలో మార్పు: 12.1 శాతం. డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించడంతో కౌంటర్లో లాంగ్స్‌ పెరిగాయి. పలు బ్రోకరేజ్‌లు షేరు టార్గెట్‌, రేటింగ్‌ పెంచాయి. జీఎస్‌కే కన్జూమర్‌ కొనుగోలుతో మరింత ప్రయోజనాలు ఉంటాయని నిపుణుల అంచనా.

 



You may be interested

ఎయిర్‌టెల్‌.. లాభాల ట్యూన్‌ వెనుక?!

Monday 10th February 2020

3 నెలల్లో షేరు 45 శాతం ర్యాలీ ఏడాదిలో షేరు ధర రెట్టింపు గత వారం సరికొత్త గరిష్టానికి  మార్కెట్‌ విలువలో 12వ ర్యాంక్‌ మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు ఇటీవల జోరు చూపుతోంది. ఓవైపు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు సరికొత్త కనిష్టాలకు చేరినప్పటికీ ఎయిర్‌టెల్‌ కౌంటర్లో ర్యాలీ నమోదవుతూ వస్తోంది. ప్రధానంగా పేరుకుపోయిన ఏజీఆర్‌ బకాయిలు, పెరుగుతున్న నష్టాలు వంటి అంశాలతో వొడాఫోన్‌ ఐడియా డీలాపడగా.. దక్షిణాఫ్రికా

బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Monday 10th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 244 పాయింట్లు(0.75శాతం) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,248.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.75శాతం నష్టాన్ని చవిచూసి 30,957.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.11:45ని.లకు

Most from this category