News


11950 దిగువన షార్ట్‌ చేయొచ్చు!

Monday 9th December 2019
Markets_main1575874610.png-30129

నిఫ్టీపై నిపుణుల సలహా
నిఫ్టీ స్వల్పకాలానికి డౌన్‌ట్రెండ్‌లోనే ఉండొచ్చని, ఈ సమయంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 11950 పాయింట్ల దిగువన కదలాడుతుంటే స్వల్పకాలానికి షార్ట్‌ చేయొచ్చని సూచిస్తున్నారు. 
= చార్ట్‌వ్యూఇండియా నిపుణుడు మజార్‌ మహ్మద్‌
నిఫ్టీ తన స్వల్పకాలిక ఊర్ధ్వముఖ ఛానెల్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ సాధించింది. అందువల్ల స్వల్పకాలానికి ట్రెండ్‌ డౌన్‌గానే ఉంటుంది. గతంలో మద్దతునిచ్చిన 13రోజుల డీఎంఏ దిగువన ముగియడం మరింత బలహీనత చూపుతుంది. అప్‌సైడ్‌ ప్రస్తుతానికి పరిమితంగా ఉండొచ్చు. 12081 దాటితేనే అప్‌సైడ్‌ ర్యాలీ ఛాన్సులు పెరుగుతాయి. ట్రేడర్లు షార్ట్‌పొజిషన్లకు 12000 పాయింట్లు స్టాప్‌లాస్‌గా 11730 పాయింట్లు టార్గెట్‌గా పెట్టుకోవచ్చు. 
= మోతీలాల్‌ఓస్వాల్‌ నిపుణుడు చందన్‌ తపారియా
నిఫ్టీ కీలకమైన 11950 పాయింట్ల దిగువన క్లోజవడం స్వల్పకాలికి బేరిష్‌నెస్‌కు సంకేతం. చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. దీంతో మరింత ప్రాఫిట్‌ బుకింగ్‌ జరిగి క్రమంగా 11800, 11700 పాయింట్ల వరకు నిఫ్టీ దిగజారవచ్చు. పైన 12050 పాయింట్లను దాటితే మరోమారు ఆల్‌టైమ్‌ హైని చేరవచ్చు.
= కోటక్‌ సెక్యూరిటీస్‌ నిపుణుడు శ్రీకాంత్‌ చౌహాన్‌
పదేళ్ల జీసెక్‌లో అనూహ్య ర్యాలీతో మార్కెట్లు వెనుకంజ వేశాయి. మార్కెట్‌ 12160 వద్ద టాప్‌ ఏర్పరిచినట్లు కనిపిస్తోంది. సమీప భవిష్యత్‌లో క్రమంగా 11700 పాయింట్ల వరకు దిగజారవచ్చు. నిఫ్టీ కొంత పైకి వచ్చినా, ఉన్న లాంగ్స్‌ వదిలించుకోవడం ఉత్తమం. 
= ఎపిక్‌ రిసెర్చ్‌ నిపుణుడు ముస్తపా నదీమ్‌
ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయమిది. నిఫ్టీ బ్రేక్‌డౌన్‌ నేపథ్యంలో ఒకటిరెండ్రోజుల్లో 11850 పాయింట్ల దిగువకు వస్తే ట్రెండ్‌ పూర్తిగా రివర్సవుతుంది. అలాంటప్పుడు నిఫ్టీ 11200 పాయింట్ల వరకు పతనం కావచ్చు. 11850 పాయింట్ల పైన ఉన్నంతవరకు అప్‌మూవ్‌ తిరిగి కొనసాగించేందుకు ఛాన్సులు అధికంగా ఉంటాయి. 



You may be interested

వోడాఫోన్‌ ఐడియా 12 శాతం పతనం

Monday 9th December 2019

ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్‌ ఐడియా ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యాలతో ఈ కంపెనీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 12శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.6.58 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊరట చర్యలేమీ తీసుకోకపోతే వోడాఫోన్‌ ఐడియా సం‍స్థ మూసివేయాల్సి ఉంటుందని బిర్లా శుక్రవారం ఒక సదస్సులో తెలిపారు.  ఈ సెప్టెంబర్‌

బ్యాంకింగ్‌ షేర్లలో రికవరీ

Monday 9th December 2019

సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన బ్యాంకింగ్‌ రంగ షేర్లకు నెమ్మదిగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోకి మళ్లింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,341.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 0.70శాతం(119 పాయింట్లు) నష్టపోయి 31122.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Most from this category