News


నిఫ్టీ 11350 స్థాయిని అందుకునే అవకాశం

Saturday 17th August 2019
Markets_main1566019186.png-27830

‘మార్కెట్లు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్‌లను కొనసాగించడానికి, కొత్తగా లాంగ్‌ పొజిషన్‌లను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు’ అని సామ్కో సెక్యురిటీష్‌, రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అన్నారు. ఈ వారం మొత్తంగా గమనిస్తే మార్కెట్‌లు నెగిటివ్‌లో ముగిశాయని, షార్ట్‌ కవరింగ్‌ జరిగితే నిఫ్టీ తిరిగి 11,350 స్థాయిని అందుకోగలదని తెలిపారు. ‘అంతర్జాతీయంగా ఎటువంటి నెగిటివ్‌ సంకేతాలు లేకపోతే అగష్టులో 10,780 ఒక మంచి మద్ధతు స్థాయి కాగలదు’ అని వివరించారు. ఎఫ్‌పీఐ అమ్మకాల ఒత్తిడి వలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ వంటి ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ దిద్దుబాటుకు గురయ్యాయని, ఈ స్టాక్స్‌ స్వల్పకాలిక, మధ్యస్థ కాలానికి గాను మంచి రివార్డులను ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. ‘సాంకేతికంగా చెప్పాలంటే ఎంఏసీడీ (మూవింగ్‌ యావరేజి కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) నిఫ్టీ ఫార్మా, ఆటో  డైవర్జన్స్‌ని ప్రదర్శిస్తున్నాయి. ఇది డౌన్‌ట్రెండ్‌ ఒత్తిడి తగ్గుముఖాన్ని చూపిస్తోంది. ఈ సెక్టార్‌లలో బుల్స్‌ నెమ్మదిగా పుంజుకుంటున్నారు’ అని తెలిపారు. అయితే రెలిటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌(ఆర్‌ఎస్‌ఐ) కూడా డౌన్‌ట్రెండ్‌ వైపు రికార్డు పతనాన్ని చూపుతోందని, ఇది మార్కెట్లో ఓవర్‌సోల్డ్‌ కండీషన్‌ను సూచిస్తుందని, ఇలాంటి పరిస్థితులలో ఏదైనా మంచి సెంటిమెంట్ బూస్టర్, మార్కెట్లను ముందుకు నడిపించే అవకాశం వుందని తెలిపారు.  కానీ అది స్వల్పకాలిక‍మే అని గుర్తుపెట్టుకోవాలన్నారు.You may be interested

ప్యాకేజీ సోమవారం వరకూ లేనట్టే!

Saturday 17th August 2019

ఆర్థిక ఉద్ధీపన ప్యాకేజీపై చర్చించడానికి వివిధ శాఖలతో మరిన్ని సమావేశాలను ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుండడంతో, సోమవారంలోపు ఎటువంటి ప్యాకేజి వెలువడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఆర్థిక మందగమనాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సంబం‍ధిత అధికారులతో గురువారం చర్చించిన విషయం తెలిసిందే. విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)ను అధిక పన్ను నుంచి మినహాయించడం, లిస్టెడ్ కంపెనీల్లో కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి

రెడీ టు కుక్‌ విభాగంలో ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌

Saturday 17th August 2019

కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో ప్లాంటు మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ విశ్వనాథ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెడీ టు కుక్‌ ఫుడ్‌ విభాగంలోకి హైదరాబాద్‌కు చెందిన మంగమ్మ ఫుడ్స్‌ ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. తమ ఉత్పత్తులకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ నాగసాయి విశ్వనాథ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.

Most from this category