STOCKS

News


సోమవారం వార్లల్లోని షేర్లు

Monday 5th August 2019
Markets_main1564975857.png-27529

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
జుబిలెంట్ లైఫ్‌:-
క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల జారీ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.40 కోట్ల నిధుల‌ను స‌మీక‌రించింది.
కాక్స్ అండ్ కింగ్స్‌:-  రూ.100 కోట్ల క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల చెల్లింపుల విఫ‌లమైంది. 
మ‌న్‌ప‌సంద్ బేవ‌రీజెస్‌:- కంపెనీ ఆడిట‌ర్లుగా బాట్లిబాయ్ పురోహిత్ నియ‌మితుల‌య్యారు 
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్:- ఫెయిర్‌డీల్ స‌ప్లై ప్రైవేట్ లిమిటెడ్ రూ.40.50 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకి స‌మాచారం ఇచ్చింది.
అదానీ ప‌వ‌ర్:-  జీఎంఆర్ చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన‌ర్జీ లిమిటెన్ విలీన ప్రక్రియ‌ను పూర్తి చేసింది. 
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్:- సాఫ్ట్వేర్ రంగ‌లో సేవ‌లు అందించే షాప్‌సెన్స్ రిటైల్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 87.6శాతం వాటాను రూ. 295.25 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.  
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌:- ఆగ‌స్ట్ 02, 03 తేదీల్లో ఎన్‌సీడీల‌పై చెల్లించాల్సిన రూ.92.1 కోట్ల వ‌డ్డీ చెల్లింపులు విఫ‌ల‌మైంది.
జెట్ ఎయిర్‌వేస్‌:- వాటా విక్రయ ప్రక్రియ సంబంధించిన ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ స‌మ‌ర్పణ‌(ఈఐఓ)కు చివ‌రి గడువు తేదిని ఆగ‌స్ట్ 10కి వాయిదా వేశారు. 

బ్యాంకింగ్ రంగ షేర్ల‌:-  మోసాలను వెల్లడించే విషయంలో జాప్యం చేసినందుకు తొమ్మిది బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా విధించింది.  ఆర్‌బీఐ జరిమానా ఆదేశాన్ని అందుకున్న తేదీ నుంచి 14 రోజుల్లోగా ఈ జరిమానాను బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ తొమ్మిదింటిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌లు ఉన్నాయి.


నేడు క్యూ2 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే కొన్ని ప్ర‌ధాన కంపెనీలు:- విష్ణు కెమిక‌ల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెట్‌వ‌ర్క్స్‌, ద్వార‌కేశ్ షుగ‌ర్స్ ఇండ‌స్ట్రీస్‌, ఉషా మార్టిన్ ఎడ్యూకేష‌న్‌, కామ‌త్ హోట‌ల్స్‌, కేఈఐ ఇండ‌స్ట్రీస్‌, మంగ‌ళం సిమెంట్స్‌, ఓరియంట్ గ్రీన్ ప‌వ‌న్ కంపెనీ, వెంకీస్(ఇండియా),  బాంబే డైయింగ్‌, ఎస్ఆర్ఎఫ్‌, జిందాల్ స్టెయిన్‌లెస్‌, ఆగ్రి-టెక్‌(ఇండియా), బ‌ర్గ‌ర్ పెయింట్స్‌, ఇండియా హోట‌ల్స్ కంపెనీ, అర‌వింద్ స్మార్ట్ స్పేస్‌, హిందూస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేష‌న్ కంపెనీ, హెక్సా ట్రాడెక్స్‌, నెస్కో, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్‌, ఏషియ‌న్ పేయింట్స్‌, మ‌జెస్కో, జేపీ పెట్రోలియం, సాండ‌ర్డ్ ఇండ‌స్ట్రీస్‌, సుంద‌ర్ ఫైనాన్స్ హోల్డింగ్స్‌, సీఏల్ ఎడ్యూకేష‌న్‌, దిలీప్ బిల్డ్‌కాన్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, ఇండియ‌న్ బ్యాంక్‌, మాంటో కార్లో ఫాష‌న్స్‌, టోరెంటో ప‌వ‌ర్, పిర‌మిల్ పైతోకేర్‌, హిందూజా గ్లోబ‌ల్ సెల్యూష‌న్స్‌.You may be interested

10850ల దిగువన నిఫ్టీ

Monday 5th August 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 276 క్షీణతతో 36842 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్ల పతనంతో 10895 వద్ద మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే గతవారపు కనిష్టస్థాయి 10850ల స్థాయికి పతనమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం క్షీణించాయి. మనీలాండరింగ్‌

స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపికకు ఆరు పరీక్షలు

Sunday 4th August 2019

స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో 2017 నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి మింగుడు పడని అంశం... ఇప్పటికీ పెట్టుబడులపై రాబడులు కనిపించని పరిస్థితి. కానీ, చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ‍స్మాల్‌క్యాప్‌ పథకాలు మంచి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏడేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారు ఇప్పటికీ వీటిని పరిశీలించొచ్చు. అయితే, స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపిక కోసం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.   రాబడులు బుల్‌ దశలో కాకుండా, మార్కెట్‌

Most from this category