News


క్యూ3- టొరంట్‌ పవర్‌ హైజంప్‌

Thursday 13th February 2020
Markets_main1581584061.png-31761

ప్రోత్సాహకర ఫలితాల ఎఫెక్ట్‌
వాటాదారులకు రూ. 11.6 డివిడెండ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ టొరంట్‌ పవర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టొరంట్‌ పవర్‌ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 421 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ. 3307 కోట్ల నుంచి రూ. 3115 కోట్లకు స్వల్పంగా నీరసించింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల(ఏప్రిల్‌-డిసెంబర్‌)కు నికర లాభం రూ. 879 కోట్ల నుంచి రూ. 1453 కోట్లకు ఎగసింది. కాగా.. వాటాదారులకు షేరుకి రూ. 11.60 చొప్పున మథ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు ఈ నెల 24 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో టొరంట్‌ పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8.2 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 333 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో మధ్యాహ్నానికల్లా 1.67 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 37,000 షేర్లతో పోలిస్తే ఇది 5 రెట్లు అధికంకావడం గమనార్హం!!



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం క్రాష్‌...

Thursday 13th February 2020

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవ్వడంతో గురువారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి 1శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,586.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టచవిచూసి 31180 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,492.90)తో పోలిస్తే 0.91శాతం నష్టంతో 31,206.00 వద్ద

జవవరిలో ఫండ్‌ మేనేజర్లు కొన్న స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లివే..!

Thursday 13th February 2020

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు జనవరిలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు ఆసక్తి చూపించే కొన్ని ప్రధాన కంపెనీల షేర్లను ఇప్పుడు చూద్దాం..! మ్యూచువల్‌ ఫండ్‌ పేరు: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ పేరు: శ్రీరాం కో సిమెంట్‌ ప్రస్తుత ధర: రూ.779 కంపెనీ మార్కెట్‌ క్యాప్‌: రూ.18,348 కోట్లు విశ్లేషణ: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వెస్ట్రన్‌ మార్కెట్లో శ్రీరాం

Most from this category