News


నెల రోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Wednesday 19th February 2020
Markets_main1582106255.png-31936

వచ్చే నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు.
1. డా.రెడ్డీస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3380. స్టాప్‌లాస్‌ రూ. 3230. ఏడాదిన్నరగా క్రమానుగత అప్‌మూవ్‌ చూపుతోంది. రూ. 1900 వద్ద మద్దతు జోన్‌ ఏర్పరుచుకుంది. తాజాగా రెండు వారాల కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ చూపింది. దీంతో మరో అప్‌మూవ్‌కు సిద్ధమైన సంకేతాలు ఇస్తోంది.
2. సిప్లా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 415. స్టాప్‌లాస్‌ రూ. 450. ఫార్మా కంపెనీల్లో సిప్లా నెగిటివ్‌ ధృక్పథంతో ట్రేడవుతోంది. చాలా సార్లు 200 రోజుల డీఎంఏను దాటేందుకు యత్నించి విఫలమైంది. తాజాగా కన్సాలిడేషన్‌ రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపింది. దీంతో మరింత పతనం ఉండే ఛాన్సులు పెరిగాయి.
3. ఎన్‌టీపీసీ ఫిబ్రవరి ఫ్యూచర్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 104. స్టాప్‌లాస్‌ రూ. 117. చాలా సంవత్సరాలుగా షేరు పేలవ ప్రదర్శన చూపుతోంది. ఇప్పటికీ అదే ధోరణిలో ఉంది. ప్రస్తుతం కీలక నిరోధాలు దాటలేక సతమతమవుతోంది. తాజాగా చార్టుల్లో మరో డౌన్‌మూవ్‌ సంకేతాలు ఏర్పరిచింది. 
దీంతో పాటు నిఫ్టీలో బలహీనత కొనసాగుతుందని, పీఎస్‌యూ బ్యాంకులు, ఆటోల్లో కొంత రీబౌండ్‌ కనిపించినా కొత్త షార్ట్స్‌ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

బుల్‌ దూకుడు- సెన్సెక్స్‌ 430 పాయింట్లు జంప్‌

Wednesday 19th February 2020

సెన్సెక్స్‌ 430 పాయింట్లు ప్లస్‌ 140 పాయింట్లు ఎగసిన నిఫ్టీ ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ జోష్‌ అరబిందో, ఐడియా జోరు ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌కు హుషారొచ్చింది. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 41,323 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 12,130 వద్ద ముగిసింది. ఓవైపు ఎంపిక చేసిన రంగాలలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడగా.. మరోపక్క ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో మార్కెట్లు

ట్రంప్‌ పర్యటనలో భారీ ఆయిల్‌ డీల్‌ ?

Wednesday 19th February 2020

అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 24న భారత్‌ రానున్న నేపథ్యంలో ఏయే రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే క్రూడ్‌ ఆయిల్‌ డీల్‌ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక అమెరికాలోని అతిపెద్ద ఆయిల్‌ సరఫరా కంపెనీలు ఇండియాలో భారీ దిగుమతులకు ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో బ్యారెల్‌పై 5 డాలర్ల డిస్కౌంట్‌ ఉండవచ్చని

Most from this category