News


బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 7th August 2019
Markets_main1565150768.png-27587

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:-
ఏవియేషన్‌ ఫ్యూయల్‌ విక్రయంతో పాటు, దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన బీపీ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ వాటా 51శాతం గానూ, బీపీ లిమిటెడ్‌ వాటా 49శాతంగానూ ఉంటుంది.
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.25వేల కోట్లను, రుణాల ద్వారా రూ.1000 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- కమర్షియల్‌ పేపర్లకు సంబంధించి రూ.5కోట్ల చెల్లింపుల్లో విఫలమైంది. 
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌:- పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటర్‌ రాధాకృష్ణ ధమానీ రూ.62.3లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అలాగే కంపెనీ రూ.50కోట్ల కమర్షియల్‌ పేపర్ల జారీ ఇష్యూను విడుదల చేయనుంది. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- కంపెనీ రిజెల్యూషన్‌ ప్రణాళిక సమర్పణ వాయిదాకు కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ అనుమతినిచ్చింది.
టాటా స్టీల్‌:- సౌత్‌ ఈస్ట్‌ వ్యాపారాన్ని హెచ్‌బీఐస్‌కు విక్రయించడాన్ని రద్దు చేసుకుంది. జవవరిలో కంపెనీ సౌత్ ఈస్ట్ ఆసియా వ్యాపారంలో 70 శాతం విక్రయించడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
ఆర్‌ఈసీ:- అనుబంధ సంస్థలైన ఆర్‌ఈసీ ట్రాన్స్‌మిషన్స్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో వాటాను విక్రయ ప్రతిపాదన, వాటా బదిలీలకు ఆమోదం తెలిపింది.
ఎల్‌ అండ్‌ టీ:- ఒక ప్రధాన విమానశ్రయానికి మౌలిక సదుపాయాలకు కల్పించేందుకు సుమారు రూ.7,000 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఆగస్ట్‌ 05, 06 తేదీల్లో రూ.43.3 కోట్ల వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైంది.

నేడు క్యూ1 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, లుపిన్‌, సిప్లా, అరబిందో ఫార్మా, సిమెన్స్‌, ఆస్ట్రర్‌ డీఎం హెల్త్‌కేర్‌, మాట్రిమోనీ డాట్‌ కామ్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, టాటా టెలీసర్వీసెస్‌, అస్ట్రాజెనికా ఫార్మా, పంజాజ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ మెటల్స్‌ అండ్‌ ఫెర్రో అలయాస్‌, కళ్యాణి స్టీల్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, శ్రేయాస్‌ షిప్పింగ్స్‌, ఫోనిక్స్‌ మిల్స్‌, ఓరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌, జిందాల్‌ డ్రిల్లింగ్స్‌, రామ్‌ కో ఇండస్ట్రీస్‌, ఇండియా సిమెంట్స్‌, ఉత్తమ్‌ షుగర్స్‌ మిల్స్‌, రామ్‌ కో మిల్స్‌, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పీటీసీ ఇండియా. You may be interested

డిమాండ్‌ భయాలు..తగ్గిన చమురు

Wednesday 7th August 2019

lయుఎస్‌ చమురు నిల్వలు పడిపోయినప్పటికి రెండు పెద్ద చమురు వినియోగ దేశాలైన యుఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ, చమురు డిమాండ్‌ ఆందోళనలను పెంచుతోంది. ఫలితంగా బుధవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.41 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.70 డాలర్లకు చేరుకుంది. కాగా ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ గత ఏడు నెలల కనిష్ఠం వద్ద ట్రేడవుతుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ధర కూడా

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 7th August 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో  బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్పలాభంతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,058 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, జీ టెలి, పవర్‌గ్రిడ్‌, విప్రోలు 1-3 శాతం మధ్య లాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 5 శాతం గ్యాప్‌డౌన్‌తో

Most from this category