STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th August 2019
Markets_main1565755496.png-27745

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఫ్యూచర్‌ రీటైల్‌:-
అమెజాన్‌ సంస్థ 8నుంచి 10శాతం వాటాను కొనుగోలుకు చర్చలు జరుపుతోంది. 
ఎంఅండ్‌ఎం:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ధీర్ఘకాలిక ఇష్యూయర్‌/ఇన్‌స్ట్రూమెంట్‌ రేటింగ్‌ను ఇండియా ఎఎఎగానూ,  అవుట్‌లుక్‌ స్థిరత్వంగానూ కేటాయించింది. 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- గాయత్రి ప్రాజెక్ట్‌ కన్షారియం జాయింట్‌ వెంచర్‌తో కలిసి నాగాలాండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సంబంధించి రూ.914.3కోట్ల విలువైన ఆవార్డును దక్కించుకున్నట్లు ప్రకటించింది.
విప్రో లిమిటెడ్‌:- ఇంటెల్ ఆధారిత ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను విడుదల చేసింది
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ:- ఇంటర్నేషనల్‌ బాండ్‌ అమ్మకం ద్వారా 750 కోట్ల మిలియన్‌ డాలర్ల మూలధన నిధుల సమీకరణకు షేర్‌ హోల్డర్ల నుంచి అనుమతులు దక్కించుకుంది. 
ఇన్ఫోసిస్‌:- నార్త్‌ అమెరికా ఆధారిత టయోటా మెటిరియల్‌ కంపెనీకు డిజిటల్‌ సెల్యూషన్‌ సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సం‍స్థ ఎసెంబుల్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ నుంచి డీమెర్జ్‌కు బోర్డు నుంచి అనుమతులు దక్కించుకుంది. 
గెయిల్‌:- పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు దాబోల్-బెంగళూరు పైప్‌ లైన్ల సుంకాన్ని 11శాతాన్ని పెంచినట్లు గెయిల్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. పెంచిన సుంకాలు సెప్టెంబర్‌1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 
మిశ్ర ధాతు నిగమ్‌:- హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ వాటాను 4.92శాతం నుంచి 5.03శాతానికి పెంచినట్లు తెలిపింది. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఐడీబీఐ బ్యాంక్‌, వాక్‌హార్డ్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, జీఎంఆర్‌ ఇన్ప్రాస్ట్రక్చర్‌, ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఐఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, హెచ్‌ఈజీ, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, గేట్‌వే డిస్ట్రిపార్స్స్‌, యూనిటెక్‌, జీ లెర్న్‌, సద్భావన్‌ ఇంజనీరింగ్స్‌, ప్రభాత్‌ డైరీ

 You may be interested

ఆర్థిక వ్యవస్థకు ఉద్ధీపనం!

Wednesday 14th August 2019

ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి బయటపడేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. . కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలను సిద్ధంచేస్తున్నారని అన్నారు. ఇందులో పన్నులను తగ్గించడం, సబ్సీడీలివ్వడం, ఇతర ప్రోత్సాహాకాలందించడం వంటి పరిశ్రమల వృద్ధికి సంబంధించిన చర్యలే కాకుండా వ్యాపారాలను సులభతరం చేసుకునే విధంగా పలు చర్యలు తీసుకోనున్నారని వివరించారు.  నిజాయితీగా పన్నులను చెల్లించే వాళ్లను వేధించకుండా,  చిన్న లేదా

లాభాల ప్రారంభం

Wednesday 14th August 2019

క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో పాజిటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 275 పాయింట్ల లాభంతో 37233 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,003 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ప్రారంభమైన కొద్ది నిముషాలకే లాభాల్లో కొంతభాగాన్ని కోల్పోయాయి. గత రాత్రి కొన్ని చైనా ఉత్పత్తులపై టారీఫ్‌ల పెంపుదలను డిసెంబర్‌ 15 వరకూ వాయిదా

Most from this category