News


టాప్‌ 12 టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 12th November 2019
Markets_main1573540601.png-29529

వివిధ బ్రోకరేజిల సాంకేతిక నిపుణులు సమీప కాలానికి గాను టాప్‌ స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. అవి..

(ముస్తాఫా నదీమ్‌, సీఈఓ, ఎపిక్‌ రిసెర్చ్‌)

యస్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 82; స్టాప్‌ లాస్‌: రూ. 59


కనిష్ఠ స్థాయిల నుంచి ర్యాలీ చేశాక, ప్రస్తుతం ఈ స్టాక్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. ఈ షేరు ధర అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో 50 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే పైన ముగిసింది. ఇది ఈ స్టాక్‌ మరింత పైకి కదులుతుందనే సంకేతాన్నిస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎస్‌ఐ(రెలిటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌) 60 స్థాయికి పైన ఉండడంతో బుల్లిష్‌ సంకేతాలు కనిపిస్తున్నాయి. 

 

బయోకాన్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 295; స్టాప్‌ లాస్‌: రూ. 252
బయోకాన్‌ రోజువారి చార్టులో ‘ఇన్వర్టడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌’ నమూనాను బ్రేక్‌ ఔట్‌ చేసింది. అంతేకాకుండా ఈ షేరు ఈ నమూనా ‘నెక్‌లైన్‌’కు పైన ముగిసింది. ఆర్‌ఎస్‌ఐ 60 స్థాయికి పైన ఉండడంతో, ఈ షేరు సానుకూలంగా కదులుతుందని అంచనావేస్తున్నాం. 

 

నాగరాజ్‌ శెట్టి, టెక్నికల్‌ రిసెర్చ్‌ఎనలిస్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌


కోటక్‌ మహింద్రా బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,730; స్టాప్‌ లాస్‌: రూ. 1,505
ఈ  బ్యాంక్‌ స్టాక్‌లో దిద్దుబాటు పూర్తయినట్టు అనిపిస్తోంది. ఈ స్టాకు తన కనిష్ఠ స్థాయి నుంచి బౌన్స్‌ అయ్యింది. ఈ బౌన్స్‌ రూ. 1,550 స్థాయి వద్ద ఏర్పడింది. ఈ షేరు పైకి కదిలినప్పుడు  వాల్యుమ్‌లు పెరిగాయి. అంతేకాకుండా 14-వారాల ఆర్‌ఎస్‌ఐ 60 స్థాయికి పైన ఉంది. ఇది స్టాక్‌ సానుకూలంగా కదులుతుందనే సంకేతాన్నిస్తుంది. ఈ స్టాకును ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయమని, రూ. 1,535 స్థాయికి చేరితే అదనంగా జోడించుకోమని సలహాయిస్తున్నాం.

 

 ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,650; స్టాప్‌ లాస్: రూ. 1,445
అక్టోబర్‌ మధ్యలో, చివరిలో బలహీనంగా కదిలిన ఈ స్టాక్‌, గత కొన్ని వారాల నుంచి కన్సాలిడేషన్‌ వంటి నమునాలో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఈ షేరు రూ. 1,530-40 స్థాయి వద్ద కన్సాలిడేషన్‌ నుంచి అప్‌సైడ్‌ను బ్రేక్‌ఔట్‌ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్టాక్‌ ‘హయ్యర్‌ టాప్స్‌ అండ్‌ హయ్యర్‌ బాటమ్స్‌’ ను ఏర్పరుస్తుండడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం ఈ షేరు హయ్యర్‌ బాటమ్స్‌ రూ. 1,380 స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది. రోజువారి, వారపు ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌, ముందుకెళ్లేకొద్ది ఈ షేరు ధర మరింత పెరుగుతుందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర వద్ద ఈ స్టాకును కొనుగోలు చేయమని, రూ. 1,470 స్థాయికి పడిపోయినప్పుడు మరికొన్ని షేర్లను జోడించుకోమని సలహాయిస్తున్నాం.

వైశాలి పరేఖ్‌, సీనియర్‌ టెక్నికల్‌ ఎనలిస్ట్‌, ప్రభుదాస్‌ లిలాధర్‌

 


వోల్టాస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 750; స్టాప్‌ లాస్‌: రూ. 665
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో హయ్యర్‌ బాటమ్స్‌ నమూనాను ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ స్టాక్‌కు 50 రోజుల కదిలే సగటు(డీఎంఏ) అయిన రూ. 665 వద్ద మద్ధతు లభిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ కూడా సానుకూల ట్రెండ్‌ రివర్సల్‌ను చూపడంతో, ఈ స్టాక్‌ ముందుకెళ్లే కొద్దీ పెరుగుతుందని అంచనావేస్తున్నాం.

 

గ్రీవ్స్‌ కాటన్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 150; స్టాప్‌ లాస్‌: రూ. 127
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో రూ. 128 వద్ద డబుల్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాన్నిస్తుంది. ముందుకేళ్లే కొద్ది ఈ స్టాక్‌ పాజిటివ్‌గా కదులుతుందని అంచనావేస్తున్నాం.

 

మజ్హర్‌ మహమ్మద్‌, చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, టెక్నికల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వజరీ, చార్ట్‌వ్యూఇండియా.ఇన్‌

 


అశోక్‌ లేలాండ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 89; స్టాప్‌ లాస్‌: రూ. 73.90
ఈ స్టాక్‌ తన కీలకమైన దీర్ఘకాలిక కదిలే సగటు కంటే పైన ముగిసింది. ఇది గతంలో ఈ షేరు ర్యాలీలను మించింది. ఫలితంగా ఈ స్టాక్‌ బ్రేక్‌ ఔట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. రూ. 81 స్థాయికి పైన ఈ కదలిక వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం రూ. 74 స్థాయికి దగ్గర్లో ఈ షేరుకు బలమైన మద్దతు లభిస్తోంది. ఈ స్థాయికి పైన కదిలినంత వరకు, ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌పై పాజిటివ్‌ దృక్పథాన్ని కలిగివుండి, రూ. 81 వద్ద ప్రధాన బ్రేక్‌ఔట్‌ కోసం వేచి చూడాలి.

 

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 357; స్టాప్‌ లాస్‌: రూ. 297
ఈ స్టాక్‌, అక్టోబర్‌ 23న ఏర్పరిచిన తాజా కనిష్ఠం రూ. 230 స్థాయి వద్ద డబుల్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. ఆ తర్వాత స్వల్పకాలం వరకు అప్‌ట్రెండ్‌ను కొనసాగించింది. కొన్ని సెషన్ల విరామం తర్వాత ఈ స్టాక్‌ రూ. 296 కనిష్ట స్థాయి నుంచి తిరిగి తన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ ధర కంటే, టెక్నికల్‌ స్టాప్‌లాస్‌ దూరంగా ఉండడంతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలనుకునే పొజిషనల్‌ ట్రేడర్లు, రెండెంచల పద్దతిలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. మొదట ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేసి, రూ. 310-305 పరిధి వద్ద పడిపోయినప్పుడు మరికొన్ని షేర్లను జోడించుకోవడం ఉత్తమం.

 

సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌; కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 185; స్టాప్‌ లాస్‌: రూ. 148
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో అక్టోబర్‌ నెలలో రూ. 113 స్థాయి వద్ద డబుల్‌ బాటమ్‌ను ఏర్పరిచింది. ఆ తర్వాత ఈ స్టాక్‌ నిరోధ స్థాయయిన రూ. 160 స్థాయి వరకు ర్యాలీ చేసింది. అంతేకాకుండా ఈ ర్యాలీ అధిక వాల్యుమ్‌లతో జరగడంతోపాటు, నవంబర్‌ 7నాటి సెషన్‌లో ఈ స్టాక్‌ తన 200 డీఎంఏ స్థాయికి పైన ముగిసింది. రూ. 149 స్థాయికి పైన కదులుతున్నంతకాలం, రూ. 165 స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం. ఒక సారి ఈ బ్రేక్‌ఔట్‌ జరిగితే, రూ. 185 వరకు ఈ స్టాక్‌ కదలవచ్చు. 

 

ఏంజెల్‌ బ్రోకింగ్‌


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ(ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ): కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 3,715; స్టాప్‌లాస్‌: రూ. 2,890
ఈ షేరు ధర ‘హయ్యర్‌ టాప్‌ హయ్యర్‌ బాటమ్‌’ సైకిల్‌ నమూనాలో బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.  గత కొన్ని సెషన్‌లలో అప్‌ట్రెండ్‌ స్తబ్దుగా ఉండడంతో  ఈ స్టాక్‌ తక్కువ పరిధిలో కదలాడింది. అధిక పరిధిని బ్రేక్‌ ఔట్‌ చేయడంతో మరింత అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని అంచనావేస్తున్నాం. ఈ బ్రేక్‌ఔట్‌కు అధిక వాల్యుమ్‌లు, బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ మద్దతుగా ఉన్నాయి. 

 

జేకే సిమెంట్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,332; స్టాప్‌ లాస్‌: రూ. 1,097
గత కొన్ని నెలల నుంచి ఈ స్టాక్ గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడవ్వడంతోపాటు, తాజాగా ఆల్‌టైం గరిష్ఠాన్ని ఏర్పరిచింది. వారపు చార్టులలో ఈ షేరు రూ.1,160 స్థాయికి పైన ముగిసింది. ఇది 2017, 2018లో కీలక అవరోధంగా పనిచేసింది. గత రెండేళ్ల కన్సాలిడేషన్‌ బ్రేక్‌ఔట్‌, సాసర్‌ నమూనాను ఏర్పరిచింది. ఈ స్టాక్‌ సమీపకాలంలో సానుకూలంగా ట్రేడవుతుందని అంచనావేస్తున్నాం.

 

అజిత్‌ మిశ్రా, వైస్‌ప్రెసిడెంట్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌


హవెల్స్‌ ఇండియా: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 730; స్టాప్‌ లాస్‌: రూ. 684
హవెల్స్‌ వారపు చార్టులో 100 డీఎంఏ వద్ద బలమైన మద్ధతు స్థాయిని ఏర్పరిచాక, నెమ్మదిగా గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటోంది. అంతేకాకుండా ఈ షేరు రోజువారి చార్టుల్లో వివిధ రకాల కదిలే సగటులను అధిగమించింది. ఇండికేటర్లన్ని ఈ షేరు సమీప కాలంలో మరింత ముందుకు కదులుతుందనే సంకేతాన్నిస్తున్నాయి. You may be interested

లాభాలు రక్షించుకోవడమే అతిపెద్ద పాఠం!

Tuesday 12th November 2019

ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా స్టాక్‌మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చిన లాభాలను పరిరక్షించుకోవడమే తాను నేర్చుకున్న పెద్ద పాఠమని ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా చెప్పారు. ఇందుకు తగిన సూత్రాలను ఫాలో కావడం వల్లనే గత రెండేళ్ల కాలంలో పలు మిడ్‌క్యాప్స్‌పై మంచి లాభాలు ఆర్జించామని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడం మంచిదని చాలామంది అనలిస్టులు సలహా ఇస్తుంటారని కానీ తాను తద్భిన్నంగా వెళ్లానని చెప్పారు. కొన్నిసార్లు స్వల్పలాభాలను

12000 దాటితే 12400 పాయింట్లకు నిఫ్టీ!

Tuesday 12th November 2019

నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా నిఫ్టీ రాబోయే రోజుల్లో 12వేల పాయింట్లను బలంగా దాటితే క్రమంగా 12400 పాయింట్ల వరకు ఎగబాకుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి షబ్బీర్‌ ఖయ్యూం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ తన స్వల్ప, దీర్ఘకాలిక డీఎంఏలకు పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా కనిపిస్తోందన్నారు. కానీ గరిష్ఠాల వద్ద బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడడం అప్రమత్తతను సూచిస్తోందని చెప్పారు. నిఫ్టీకి 11700 పాయింట్ల వద్ద బలమైన మద్దతుందన్నారు. ప్రస్తుతానికి

Most from this category