News


మీడియం టెర్మ్‌ కోసం స్టాక్‌ సిఫార్సులు

Monday 4th November 2019
Markets_main1572859677.png-29335

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి....
విశ్లేషకులు: ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌

 

 

కోటక్‌ మహింద్రా బ్యాంక్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 1,578; టార్గెట్‌ ధర: రూ. 1,871; అప్‌సైడ్‌: 18 శాతం; కాలవ్యవధి: 9-12 నెలలు
కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ వారపు చార్టులలో 2017 జనవరిలో ఏర్పరిచిన స్థాయి రూ. 692 నుంచి జూన్‌ 2018 ఏర్పరిచిన స్థాయి రూ. 1,417 వరకు గణనీయంగా పెరిగింది. 2018 అక్టోబర్‌ నెలలో ఈ స్థాయి నుంచి 58 శాతం పడిపోయి రూ. 1,002 స్థాయికి చేరుకుంది. గత ర్యాలీతో పోల్చుకుంటే వాల్యుమ్‌లు స్వల్పంగా తగ్గినప్పటికి, ఈ బ్యాంక్‌ రూ. 1,002 స్థాయి నుంచి మే 2019 నాటికి రూ. 1,556 స్థాయికి చేరుకొని ఆల్‌టైం గరిష్ఠాన్ని ఏర్పరిచింది. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్‌ నెల వరకు ఈ షేరు రూ. 1,398-రూ. 1,556 పరిధిలో కదలాడి, దీర్ఘ చతురస్ర నమూనాను ఏర్పరిచింది. ఈ షేరు సెప్టెంబర్‌ నెలలో గరిష్ఠ స్థాయిలను అధిగమిం‍చి రూ. 1,684 వద్ద కొత్త గరిష్ఠాన్ని ఏర్పరిచింది. గత మూడు వారాల నుంచి దీర్ఘచతురస్ర నమూనాలో గరిష్ఠ స్థాయి పైన ట్రేడవుతోంది. అంతేకాకుండా ఈ స్టాకుకు రూ. 1,556 స్థాయి బలమైన మద్ధతు స్థాయిగా పనిచేయగలదు. ఈ స్థాయి నుంచి మంచి ర్యాలీని ఆశిస్తున్నాం. ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రంథ ఇండెక్స్‌) లైన్‌, రెడ్‌లైన్‌కు పైన కదులుతోంది. ఇది ఈ షేరు మరింత పైకి వెళుతుందనే సంకేతాన్నిస్తోంది. రూ. 1,555-1,440-1,390 స్థాయిలు మద్ధతు స్థాయిలుగా పనిచేయగా, రూ. 1,684-1,760-1870 స్థాయిలు నిరోధక స్థాయిగా పనిచేస్తాయి. అందువలన ఈ షేరు కొనుగోలు చేయమని ట్రేడర్లకు సలహాయిస్తున్నాం. 

 

బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 3,289; టార్గెట్‌ ధర: రూ. 3,895; అప్‌సైడ్‌: 18 శాతం; కాల వ్యవధి: 9-12 నెలలు
వారపు చార్టులలో బ్రిటానియా షేరు, గతేడాది అగష్టు నెల నుంచి అక్టోబర్‌ 2019 మధ్య వరకు డౌన్‌వార్డ్‌ మూవింగ్‌ ట్రెండ్‌ లైన్‌ను ఏర్పరించింది. ఈ స్టాకుకు ప్రతి దిగువ స్థాయి వద్ద మద్ధతు లభించగా, ప్రతి గరిష్ఠం వద్ద నిరోధం ఎదురయ్యింది. గత వారంలో ఈ నమూనా అప్పర్‌సైడ్‌ను అధిగమించడంతో పాటు, గరిష్ఠ స్థాయిల వద్ద ముగిసింది. ఇది మరింత పైకి ర్యాలీ ఉంటుందనే సంకేతాన్నిస్తుంది. రూ. 3,050-2,920-2,800 స్థాయిల వద్ద మద్ధతు లభించనుండగా, రూ. 3,470-3,580-3,700 స్థాయిల వద్ద నిరోధం ఎదురుకానుంది. బ్రిటానియా స్టాకును కొనుగోలు చేయమని ట్రేడర్లకు మేము సలహాయిస్తున్నాం.

 

 హెచ్‌యూఎల్‌(హిందుస్థాన్‌ యూనిలీవర్‌): కొనచ్చు; తాజా ధర: రూ. 2,169; టార్గెట్‌ ధర: రూ. 2,475; అప్‌సైడ్‌: 14 శాతం; కాల వ్యవధి: 9-12 నెలలు
ఈ స్టాక్‌ వారపు చార్టులలో 2018 డిసెంబర్‌ నుంచి సెప్టెంబర్‌ 2019 వరకు, రూ. 1,650-1,870 స్ధాయి మధ్యలో కదలాడి, చతురస్ర నమూనాను ఏర్పరిచింది. ఈ నమునా గరిష్ఠ స్థాయిని అధిగమించాక, ఈ స్టాకు కొత్త గరిష్ఠాన్ని ఏర్పరచడం చూశాం. గత నాలుగు వారాల నుంచి ఈ స్టాక్‌ చతురస్ర నమూనాకు ఎగువ స్థాయి వద్ద, అధిక వాల్యుమ్‌లతో ట్రేడవుతోంది. ఈ స్టాకు మరింత ర్యాలీ చేయనుందనేదానికి ఇది సంకేతం. రూ. 2,000-1,870-1,780 స్థాయిల వద్ధ ఈ షేరుకు మద్ధతు లభించనుండగా, రూ 2,230-2,350-2,450 స్థాయిల వద్ద నిరోధం ఎదురుకానుంది. ఈ స్టాకును కొనుగోలు చేయమని ట్రేడర్లకు సలహాయిస్తున్నాం. 

 

సెంచ్యురి ప్లే బోర్డ్స్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 163; టార్గెట్‌ ధర: రూ. 220; అప్‌సైడ్‌: రూ. 34 శాతం; కాలవ్యవధి: 9-12 నెలలు
వారపు చార్టులో ఈ స్టాక్‌, మూడు నెలల ధర పరిధిలో ట్రేడవుతోంది. గతేడాది ఏప్రిల్‌ తర్వాత 16 నెలల్లో అధిక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని, అగష్టు 2019 నాటికి రూ. 112 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఈ కాలంలో ఈ స్టాక్‌ లోవర్‌ టాప్‌-లోవర్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. రూ. 112 స్థాయి నుంచి అప్‌సైడ్‌ ర్యాలీని చూడవచ్చు. అక్టోబర్‌ నెలలో ఈ షేరు డౌన్‌ వార్డ్‌ ట్రేండ్‌ లైన్‌ను రూ. 163 అధిగమించింది. ఇది మరింత అప్‌సైడ్‌కు ఈ స్టాక్‌ కదలనుందనే సంకేతాన్నిస్తోంది. ఈ షేరు ఆర్‌ఎస్‌ఐ లైన్‌, రెడ్‌ లైన్‌కు పైన కదులుతోంది. ఇది  సానుకూల సంకేతం. రూ. 147-132-120 స్థాయిల వద్ద ఈ స్టాకుకు మద్ధతు లభించనుండగా, రూ. 174-188-200 స్థాయిల వద్ద నిరోధం ఎదురుకానుంది. ఈ స్టాకును టార్గెట్‌ ధర రూ. 220 కోసం కొనుగోలు చేయాలని ట్రేడర్లకు సలహాయిస్తున్నాం. 

 

విశ్లేషకులు: ముస్తఫా నదీమ్, సీఈఓ, ఎపిక్ రీసెర్చ్

 



వోల్టాస్ లిమిటెడ్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .713; టార్గెట్‌ ధర: రూ 775-830; స్టాప్‌ లాస్‌: రూ .650; అప్‌ సైడ్‌: 16 శాతం పెరగొచ్చు
ఎయిర్ కండీషనర్(ఏసీ) మార్కెట్ గత కొన్నేళ్ల నుంచి బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ వృద్ధి మరింతగా పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ఏసీ మార్కెట్‌లో వోల్టాస్ కీలకంగా ఉంది. అంతేకాకుండా నెగిటివ్‌ మార్కెట్‌లో సాంకేతికంగా స్టాక్ సరికొత్త బ్రేక్అవుట్‌ను ఏర్పరిచింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో, కంపెనీ పనితీరు మెరుగుపడుతుందని అంచనావేస్తున్నాం.

 

టైటాన్ కంపెనీ లిమిటెడ్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .1,315; టార్గెట్‌ ధర: 1,496;  స్టాప్‌లాస్‌: రూ .1,270; అప్‌సైడ్‌: 13 శాతం
మేమెంచుకున్న స్టాకులలో ఈ స్టాక్‌ ముందుంటుంది. కంపెనీ ప్రాథమికంగా బలంగా ఉండడంతోపాటు గత కొన్నేళ్ల నుంచి కంపెనీ నిలకడగా వృద్ధి చెందుతోంది.  ఈ వ్యాపారం వివిధ జేవీ(జాయింట్‌ వెంచర్స్‌) లను ఏర్పరచడంతో, కంపెనీ విస్తరిస్తోంది. అంతేకాకుండా ఈ జేవీల వలన కంపెనీ బాటమ్‌ లైన్‌, టాప్‌ లైన్‌ మెరుగ్గావున్నాయి. ఈ స్టాక్‌ స్థిరమైన వృద్ధినిస్తుందని అంచనావేస్తున్నాం. 

 

డీసీబీ బ్యాంక్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .176 ; టార్గెట్‌ ధర: రూ .225 ; స్టాప్‌ లాస్‌: రూ .150 ; అప్‌సైడ్‌: 27 శాతం
స్మాల్‌క్యాప్ విభాగంలో డీసీబీ బ్యాంక్‌ మంచి ప్రదర్శనను చేస్తుంది. ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ గత కొన్నేళ్ల నుంచి స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. బ్యాంక్‌ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 91 కోట్లుగా ఉంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆపరేటింగ్ లాభం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. ఎన్‌ఐఎం(నికర వడ్డీ మార్జిన్‌) ఫ్లాట్‌గా ఉండడంతో తాజాగా ఈ బ్యాంక్‌ షేరు దిద్దుబాటుకు గురయ్యింది. కానీ ఈ స్టాక్‌ వచ్చే కొన్నేళ్లలో మంచి వృద్ధిని నమోదు చేస్తుందని అం‍చనావేస్తున్నాం. 

 

విశ్లేషకులు: సంతోష్ మీనా, సీనియర్ అనలిస్ట్, ట్రేడింగ్‌బెల్స్

 


ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .1,370; టార్గెట్‌ ధర: రూ 1,600; అప్‌ సైడ్‌: 16 శాతం
ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. గత ఆరు నెలల కన్సాలిడేషన్‌ తర్వాత ప్రస్తుతం ఈ స్టాక్‌ ‘కప్‌ అండ్‌ హ్యాండిల్‌’ నమూనాను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌ కొనసాగింపుకు సంకేతం. బుల్లిష్ మొమెంటం కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో ఈ షేరు రూ. 1,600 స్థాయిని తాకవచ్చు. 

 

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .2,106; టార్గెట్‌ ధర: రూ .2,500; అప్‌సైడ్‌: 18 శాతం
ఎన్‌బీఎఫ్‌సీ అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పటికి ఈ కంపెనీ మాత్రం నిలకడగా వృద్ధి చెందుతోంది. సాంకేతిక పరంగా గమనిస్తే..ఈ స్టాక్‌ డబూల్‌ బాటమ్‌ నమూనాను ఏర్పరిచింది. మూమెంటం ఇండికేటర్స్‌ కూడా సానుకూలంగా ఉన్నాయి. రూ. 2,195 స్థాయి బ్రేక్‌ఔట్‌ పాయింట్‌గా పనిచేయగలదు. ఈ కంపెనీ షేరు అన్ని రకాల మూవింగ్‌ యావరేజిలను దాటింది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల సమయంలో ఈ షేరు రూ. 2,500 స్థాయిని అందుకుంటుందని అంచనా వేస్తున్నాం.

 

పిడిలైట్ ఇండస్ట్రీస్: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ .1,365; టార్గెట్‌ ధర: రూ 1,600; అప్‌సైడ్‌: 17 శాతం
పిడిలైట్ స్టాకు బుల్లిష్‌గా ఉంది. దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి దిద్దుబాటుకు గురయిన తర్వాత, మునుపటి బ్రేక్అవుట్ పాయింట్ 1,300 చుట్టూ ఒక బేస్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. అందువల్ల, ఇది ట్రేడర్లకు అనుకూలమైన రిస్క్-రివార్డ్‌ను అందించే అవకాశం ఉంది. వచ్చే రెండు నెలల్లో, రూ. 1600 టార్గెట్‌ కోసం ఈ షేరును కొనుగోలు చేయమని సలహాయిస్తున్నాం.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 61శాతం అప్‌

Monday 4th November 2019

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి ఫ‌లితాల‌ను క‌న‌బ‌రిచింది. మోర్ట్‌గేజ్ రుణాలు అందించే ఈ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఈ క్యూ2లో రూ. 3,961.53 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.  గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన రూ.2,467.08 కోట్లతో పోలిస్తే ఇది 60.57శాతం అధికం. ఇదే క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్‌లో నికర వడ్డీ మార్జిన్‌

వెలుగులో స్టీల్‌ షేర్లు

Monday 4th November 2019

అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల ర్యాలీ కారణంగా దేశీయ మార్కెట్లో  స్టీల్‌ షేర్లు మెరుస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఈ సానుకూలాంశంతో రానున్న రోజుల్లో మందగించిన ప్రపంచ వృద్ధి తిరిగి కోలుకుంటుందనే అంచనాలు ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెంచాయి. స్థూల ఆర్థిక వ్యవస్థలో అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫెర్రస్‌

Most from this category