News


బ్రోకరేజీల టాప్‌ సిపార్సులు

Thursday 7th November 2019
Markets_main1573109134.png-29414

కార్పోరేట్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సానుకూలంగా కదులుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠాన్ని నమోదుచేయగా, నిఫ్టీ కొత్త గరిష్ఠానికి చేరువలో ట్రేడవుతోంది. కార్పోరేట్‌ ఫలితాలు వెలువడ్డాక వివిధ కంపెనీలపై బ్రోకరేజి పాజిటివ్‌గా ఉన్నారు. వివిధ బ్రోకరేజిలు బై సిఫార్సును కలిగివున్న టాప్‌ కంపెనీలు..

బ్రోకరేజి: మోతిలాల్‌ ఓస్వాల్‌


హెచ్‌డీఎఫ్‌సీ: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: 2,600; అప్‌సైడ్‌: 19 శాతం కదలగలదు
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ), సెప్టెంబర్‌ త్రైమాసికంలో మెరుగైన ఆపరేటింగ్‌ పనితీరును కనబరిచిం‍ది. ఫలితంగా ఆర్థిక సంవత్సరం 2020 క్యూ2లో ఏడాది ప్రాతిపదికన స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం 60.5 శాతం పెరిగి రూ .3,961.53 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 2,467.08 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 19.9 శాతం పెరిగి రూ .13,487.44 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న లిక్విడిటీ పరిస్థితులలో బలమైన మాతృ సంస్థను కలిగివున్న కంపెనీలు, డెట్‌ మార్కెట్‌, బ్యాంకుల నుంచి నిధులను తేలిగ్గా సమీకరించగలవని మోతిలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. హెచ్‌డీఎఫ్‌సీ ఈ అంశాలను స్పష్టంగా కలిగివుందని, రూ .1.2 ట్రిలియన్ డిపాజిట్ బేస్ ఉన్నప్పటికీ, కంపెనీపై పెరుగుతున్న ఆకర్షణ గతంలో కంటే బలంగా ఉందని తెలిపింది.

 

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 138; అప్‌సైడ్‌: 23 శాతం
 సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికం(రూ .571.3 కోట్లు)తో పోలిస్తే 40.6 శాతం తగ్గి రూ. 339.5 కోట్లుగా నమోదైంది. అదేవిధంగా కంపెనీ ఆదాయం రూ. 3,381.4 కోట్ల నుంచి 18.9 శాతం తగ్గి రూ. 2,742.7 కోట్లుగా నమోదైంది. ఎబిట్డా 36.2 శాతం తగ్గి రూ. 545 కోట్లకు, ఎబిట్డా మార్జిన్ 540 బీపీఎస్‌ తగ్గి 19.9 శాతానికి చేరుకున్నాయి. కంపెనీ ఈపీఎస్‌(షేరు పై లాభం) అంచనాలను మోతిలాల్‌ ఓస్వాల్‌ ఆర్థిక సంవత్సరం 2020కి గాను 9 శాతం తగ్గించింది. కానీ ఆర్థిక సంవత్సరం 21/22కి గాను ఈపీఎస్‌ అంచనాలను అలానే కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బ్యాక్‌లాగ్, అమలుచేయడంలో సమయపాలన, కంపెనీ సామర్ధ్యం బట్టి, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌పై ‘బై’ కాల్‌ను కలిగివున్నామని తెలిపింది.

బ్రోకరేజి: డోలాట్‌ 

జేకే లక్ష్మి సిమెంట్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 425; అప్‌సైడ్‌: 38 శాతం
జేకే లక్ష్మి సిమెంట్ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ .49.72 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ రూ .5.7 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. కంపెనీ క్యూ2లో కార్యకలాపాల ద్వారా రూ .1,012.36 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 958.6 కోట్లుగా నమోదైంది. డిమాండ్‌ పుంజుకోవడంతో పాటు, సిమెంట్‌ ధరలను స్థిరీకరించాలనే డిమాండ్‌ ఉండడం వలన ఆర్థిక సంవత్సరం 2020లో కంపెనీ వాల్యుమ్‌ల వృద్ధి 3.6 శాతం పెరిగి 10 మెట్రిక్‌టన్నులకు చేరుకుంటుందని యాజమాన్యం భావిస్తోంది. కంపెనీ ఆదాయ అంచనాలను ఆర్థికసంవత్సరం 20ఈ/21ఈ కిగాను 4శాతం/2.9 శాతం, ఎబిట్డాను 18.8 శాతం/15.3 శాతం, ఏపీఏటీ(పన్నులాభ మార్జిన్‌ తర్వాత)ను 23.5 శాతం/17.4 శాతం కు ఈ బ్రోకరేజి పెంచింది.

 

జేబీఎం ఆటో: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 385; అప్‌సైడ్‌: 70 శాతం
 సెప్టెంబర్‌ త్రైమాసికంలో జేబీఎం ఆటో ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతపదికన 22 శాతం తగ్గి రూ .16.3 కోట్లకు, ఆదాయం 14.6 శాతం తగ్గి రూ .388.1 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఎబిట్డా 13.3 శాతం తగ్గి రూ .47.4 కోట్లకు,  ఎబిట్డా మార్జిన్ స్వల్పంగా పెరిగి 12.2 శాతానికి చేరుకుంది. బస్‌, టూలింగ్‌ విభాగాలలో ఆదాయ వృద్ధి ఆశాజనకంగా ఉండడంతోపాటు, ఖర్చు నియంత్రణ చర్యలను చేపట్టడంతో, డోలాట్‌ రిసెర్చ్‌ బ్రోకరేజి ఈ కంపెనీ టార్గెట్‌ మల్టిపుల్‌ను 15 రెట్లుకు పెంచింది. ఆర్థిక సంవత్సరం 20 లో బస్సు విభాగంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని యాజమాన్యం ఆశిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే ఈవీ(ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌), సీఎన్‌జీ(కంప్రస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌)(300 బస్సులు) రెండువిభాగాలలో  కొత్త ఆర్డర్‌లను సాధించింది. వీటిని ఆర్థిక సంవత్సరం 2020 చివరినాటికి సరఫరా చేయాల్సి వుంది. అంతేకాకుండా ప్రభుత్వం బస్సు రాయితీలను అందిస్తుండడం కూడా కంపెనీకి కలిసొచ్చే అంశం. ఫేమ్‌ పథకం రెండవ దశలో భాగంగా సీసీఈఏ రూ.100 బిలియన్ల సబ్సిడీని ఇవ్వనుందనే అంచనాలున్నాయి. ఇది కంపెనీ వాల్యుమ్‌లు పెరగడానికి సహాయపడుతుంది. 

బ్రోకరేజి: ప్రభుదాస్‌ లిలాధర్‌


నోసిల్‌(ఎన్‌ఓసీఐఎల్‌): రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 174; అప్‌సైడ్‌: 58 శాతం
సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం(ఏడాది ప్రాతిపదికన) రూ. 52.9 కోట్ల నుంచి రూ .54.9 కోట్లకు చేరింది. కానీ ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 22.9 శాతం తగ్గి రూ .209.7 కోట్లుగా నమోదైంది. గత ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ .227 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఎబిట్డా 39.2 శాతం తగ్గి రూ .48.5 కోట్లకు చేరుకోగా, ఎబిట్డా మార్జిన్ 23.1 శాతానికి పడిపోయింది.  కంపెనీ ఉత్పదకత బాగుండడంతో పాటు, కంపెనీ దీర్ఘకాల ఒప్పందాలను కుదుర్చుకున్న బెంజిన్‌, ఎనిలిన్‌ వంటి ముడిపదార్థల ధరలు తగ్గడంతో నోసిల్‌ లాభపడనుందని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ తెలిపింది. ముందుకెళ్లేకొద్ది వాల్యుమ్‌ వృద్ధిపై కంపెనీ దృష్ఠి పెడుతుందని అంచనా వేస్తున్నామని, అంతర్జాతీయంగా ఆటో రంగం మందగమనంలో ఉండడంతో డిమాండ్‌ ఆందోళనలున్నప్పటికి, ప్రస్తుత విలువ వద్ద నోసిల్‌ ఆకర్షిణియంగా ఉందని ఈ బ్రోకరేజి అభిప్రాయపడింది. ‘యుఎస్‌, రష్యా ప్లాంట్‌ల నుంచి అధిక వాల్యుమ్‌లను కంపెనీ అంచనావేస్తోంది. దేశీయంగా ఆటో అమ్మకాలు పెరుగుతుండడంతో డిమాండ్‌ పుంజుకుంటుందని అంచనావేస్తోంది’ తెలిపింది.

బ్రోకరేజి: జియోజిత్‌


ఎం అండ్‌ ఎం ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 412; అప్‌సైడ్‌: 18 శాతం
సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ పాట్‌(పన్ను తర్వాత లాభం) ఏడాది ప్రాతిపదికన 34 శాతం తగ్గి రూ. 252 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 382 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన రూ. 2,145 కోట్ల నుంచి 18 శాతం పెరిగి రూ. 2,541 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏ(మొండి బకాయిలు) నిష్పత్తి ఏడాది ప్రాతిపదికన 180 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 7.2 శాతంగా, నికర ఎన్‌పీఏ నిష్పత్తి 20 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 5.7 శాతంగా నమోదైంది. బ్రాంచ్‌ నెట్‌వర్కలు విస్తరించడంతో పాటు, వైవిధ్యమైన ఉత్పత్తి పోర్టుఫోలియో, ఓఈఎం(ఒరిజినల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎక్యుప్‌మెంట్‌)తో బలమైన వ్యాపార సంబంధాలను కలిగివుండడం, బలమైన మాతృ సంస్థ తోడవ్వడంతో ఈ కంపెనీ వృద్ధి బాగుంటుందుని జియోజిత్‌ రిసెర్చ్‌ అభిప్రాయపడుతోంది. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌ లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికి ఈ కంపెనీ మాత్రం పాజిటివ్‌ లిక్విడిటీ అంతరాన్ని కొనసాగించింది. కంపెనీ ఏయూఎం(అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) ఆర్థిక సంవత్సరం 2020లో 15-20 శాతం పరిధిలో ఉంటుందని మేనేజ్‌మెంట్‌ అంచనావేస్తోంది.

 

ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 572; అప్‌సైడ్‌: 12 శాతం
ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ స్టాండ్‌ ఎలోన్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్లాట్‌గా రూ 301 కోట్లుగా నమోదైంది. కానీ కంపెనీ ఆదాయం గతేడాది ఇదేత్రైమాసికంలో నమోదైన రూ. 8,990 కోట్ల నుంచి రూ. 8,027 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి గాను కంపెనీ 0.80 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్‌ అనిశ్చితి ఎలా ఉన్నప్పటికి ఈ కంపెనీ మాత్రం మంచి వృద్ధితో బలమైన ఫలితాలను ప్రకటించిందని జియోజిత్‌ రిసెర్చ్‌ తెలిపింది. రుణ స్థాయిలను కొనసాగిస్తు, ప్రీమియం వృద్ధిపై కంపెనీ దృష్ఠి సారించింది. ఇది వచ్చే రెండుమూడు త్రైమాసికాలకు కీలకంగా ఉండనుంది. కంపెనీ వార్షిక, ప్రొటెక్సన్‌ వ్యాపారాలపై తన ప్రాధాన్యాన్ని కొనసాగించనుంది.

 



You may be interested

ఐదేళ్లలో రెండింతలయ్యే స్టాకులివే!

Thursday 7th November 2019

మిడ్‌క్యాప్‌ స్టాకుల ‍ప్రదర్శన మార్చి 2015, అగష్టు 2018 మధ్య లార్జ్‌క్యాప్‌లను అధిగమించింది. కానీ గత ఏడాది కాలం నుంచి ఈ స్టాకులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ల వాల్యుషన్లు ఆర్థిక సంవత్సరం 2014 ముందు స్థాయికి చేరుకున్నాయి. పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి పరంగా చూసిన, లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌లు ఏడేళ్ల గరిష్ఠ రాయితీతో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా పీబీ (ప్రైస్‌టూ బుక్‌) నిష్పత్తి పరంగా చూసిన, మిడ్‌క్యాప్‌

4శాతం నష్టపోయిన టాటాస్టీల్‌

Thursday 7th November 2019

మెప్పించని క్యూ2 ఫలితాలు టాటా స్టీల్‌ ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. ఫలితంగా నేడు ఉదయం సెషన్‌లో కంపెనీ షేరు 3.85శాతం మేర నష్టపోయింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.3302.31 కోట్ల నికరలాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ ఆర్జించిన రూ.3,116 కోట్ల

Most from this category