News


రాబడుల్నిచ్చే టాప్‌ సిఫార్సులు ఇవే

Wednesday 2nd October 2019
Markets_main1570013475.png-28678

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నెగిటివ్‌లోనే ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌-లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ సంఘటన, పీఎంసీ(పంజాబ్‌, మహారాష్ట్ర కో ఆపరేటివ్‌) బ్యాంక్‌ మోసం వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. గత సెషన్‌లో షార్ట్‌కవరింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ 700 పాయింట్లు నష్టాన్ని పూడ్చుకోగలిగి 38,000 స్థాయి పైన ముగిసింది. 
    సెన్సెక్స్‌ సెప్టెంబర్‌లో 3000 పాయిం‍ట్లకు పైగా పెరిగింది. మార్కెట్‌ భారీ స్థాయిలో ర్యాలీ చేశాక కొంత నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా బ్యాంక్‌ ఇండెక్స్‌ పడిపోయిందంటే మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ బాగలేదని అనుకొవద్దని, గత త్రైమాసికంలో దేశీయ బ్యాంకులు మంచి ప్రదర్శనను చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మార్కెట్‌ పడిపోవడంతో నాణ్యమైన స్టాకులను కొనుగోలు చేయాలని విశ్లేషకులు సలహాయిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మార్కెట్‌ మధ్యస్థ కాలానికి గాను పాజిటివ్‌గా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మధ్యకాలానికి 13-45 శాతం రిటర్న్‌లిచ్చే 9 స్టాక్‌ సిఫార్సులు:
బ్రోకరేజి: ఎమ్కే గ్లోబల్‌
ఎన్‌ఎండీసీ(నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌): కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 121; రిటర్న్‌: 26 శాతం
   కేంద్రప్రభుత్వం, 2019 సెప్టెంబర్ 27 న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మినరల్‌ రూల్స్‌ను (ప్రభుత్వ కంపెనీలు నిర్వహిస్తున్న గనులు) సవరించింది. ఈ నోటిఫికేషన్ సమీప కాలంలో ఎన్‌ఎండీసీ, మొయిల్‌కు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండు కంపెనీలకు సంబంధించి చాలా వరకు గనులు వచ్చే రెండేళ్లలో పునరుద్ధరణకు రానున్నాయి. దీంతోపాటు ఎన్‌ఎండీసీకి చెందిన  కర్ణాటకలోని కుమార స్వామి గనులపై కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకునే వీలులేకుండా తాజా నోటిఫికేషన్‌ సహాయపడనుంది. కాగా ఈ గనులు అక్టోబర్‌ 2022లో పునరుద్ధరణకు రానున్నాయి. అందువలన ఎన్‌ఎండీసీ షేరుపై రూ. 121 టార్గెట్‌ ధరను కలిగివుండి, బై సిఫార్సును చేస్తున్నాం.

బ్రోకరేజి: ఐసీఐసీఐ డైరక్ట్‌
టాటా మెటాలిక్స్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 615; రిటర్న్‌: 17 శాతం
   నీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుబంధ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెరిగాయి. ఇవి డీఐ(డక్టయిల్‌ ఐరన్‌ పైప్‌) పైపుల డిమాండ్‌ పెరగడానికి సహాయపడతాయి. మధ్యస్థ కాలానికి గాను ఈ పైపుల డిమాండ్‌ 10-12 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి టాటా మెటాలిక్స్ ఇప్పటికే దాని డీఐ సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే పనిని ప్రారంభించింది. ఫలితంగా దీర్ఘకాలంలో కంపెనీ లాభాలు బాగుంటాయని అంచనా వేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 21 ఈ(ఆదాయాలు) ఎబిట్డాకు 6 రెట్లు వద్ద ఈ స్టాక్‌ ఆకర్షిస్తోంది. ఈ కంపెనీపై టార్గెట్‌ ధరను రూ. 615గా నిర్ణయించి, కొనుగోలు రేటింగ్‌ను ఇస్తున్నాం. డీఐ తయారిలో వినియోగించే ముడి పదార్థం ఖర్చు పెరుగుతుండడంతో పాటు, డీఐ పైపుల డిమాండ్‌ ఊహించినదాని కంటే తక్కువగా పెరుగుతుండడం వంటి అంశాలు ప్రధాన ప్రమాదాలుగా ఉన్నాయి. 

రిలయన్స్‌ నిప్పన్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 300; రిటర్న్‌: 13 శాతం
  రిలయన్స్‌ నిప్పన్‌ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌ఎన్‌ఏఎం) దేశంలో ఐదవ అతి పెద్ద ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌(ఏఎంసీ)గా ఉంది. ఈ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2019లో ఎయూఎం(ఎసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) మార్కెట్‌లో 8.3 శాతం వాటాను కలిగివుంది. ఐఎఫ్‌ఏ(ఇండిపెండెంట్‌ ఫైనాన్సియల్‌ అడ్వజరీ)లను బీ2 నగరాలలోకి విస్తరించడం ద్వారా ఈ నగరాలక అధిక ప్రాధాన్యం(20 శాతం ఏయూఎం)  ఇచ్చి రిటైల్‌ విభాగంలో(40శాతం ఏయూఎం) లీడర్‌గా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విభాగంలో ఈ కంపెనీ 10.6 శాతం వాటాతో మంచి స్థానంలో ఉంది. ఈ కంపెనీ నుం‍చి పాత ప్రమోటర్లు తొలగిపోవడంతో ప్రస్తుతం ఈ స్టాక్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఆఫ్‌షోర్‌ విభాగాల నుంచి, దేశీయ కార్పోరేట్‌ల నుంచి నిప్పన్‌ లైప్‌లోకి నిధుల ప్రవాహం బాగుంది. అందువలన ఈ స్టాకును బై రేటింగ్‌తో కవరేజ్‌ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కంపెనీ స్టాకుపై రూ. 300 టార్గెట్‌ ధరను కలిగి ఉన్నాం.

బ్రోకరేజి: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌
యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ ధర: రూ. 986; రిటర్న్‌: 45 శాతం
ఆర్థిక​ సంవత్సరం 2019లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఆదాయాలు స్థిరంగా ఉన్నాయి. ఈ బ్యాంక్‌లలో యాక్సిస్‌ బ్యాంక్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుండడంతో పాటు ఆర్‌ఓఏఈ(రిటర్న్‌ ఆన్‌ యావరేజ్‌ ఈక్విటీ) వృద్ధి చెందుతుండడంతో ఈ బ్యాంక్‌పై అధిక ప్రాధాన్యాన్ని కలిగివున్నాం. తాజాగా ఈ బ్యాంక్‌ జరిపిన నిధుల సమీకరణ బ్యాంక్‌పై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుందని అంచనావేస్తున్నాం. యాక్సిస్‌ బ్యాంక్‌ రూ. 12.50 కోట్ల నిధులను క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా సమీకరించింది. కాగా ఈ బ్యాంక్‌ గత రెండేళ్లలో రెండుసార్లు నిధులను సమీకరించడం గమనార్హం. కానీ ఈ నిధుల సమీకరణ బ్యాంక్‌ పుస్తకం వృద్ధి చెందడం కోసం  కాబట్టి వాల్యుషన్‌లు ఆకర్షిణియంగా మారతాయని అంచనా వేస్తున్నాం. 

గెలాక్సీ సర్ఫాక్టంట్స్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ .1,834; రిటర్న్‌: 24 శాతం
 గెలాక్సీ సర్ఫాక్టంట్స్‌ (జీఎస్‌ఎల్‌) కంపెనీ ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ(పాస్ట్‌మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) ఎంఎన్‌సీ(మల్టినేషనల్‌ కంపెనీలు)లకు సర్ఫాక్టంట్లను, ఇతర ముఖ్యమైన రసాయనాలను సరఫరా చేస్తోంది. ముఖ్యంగా ఈ కంపెనీల  'హోమ్ అండ్ పర్సనల్ కేర్' (హెచ్‌పీసీ) విభాగానికి ప్రత్యేకంగా తన సరఫరాలను అందిస్తుండడం గమనార్హం. జీఎస్‌ఎల్‌ తన వినియోగదారులతో దీర్ఘకాల, సన్నిహిత సంబంధాలుండడంతో, ఈ కంపెనీ వాల్యూమ్ వృద్ధి, మార్జిన్‌లు స్థిరంగా పెరుగుతాయని అంచనావేస్తున్నాం. ఈ కంపెనీ మొత్తం‍ 80 దేశాలలో 200 ప్లస్‌ ఉత్పత్తులను 1,700 ప్లస్‌ వినయోగదారులకు సరఫరా చేస్తోంది. కం‍పెనికి ఉన్న అవకాశాలు, లాభాలను తిరిగి పెట్టుబడిగా పెట్టి 20 శాతం రిటర్న్‌లను సాధించగలిగే సామర్ధ్యం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌, పీఈ(ప్రైస్‌ టూ ఎర్న్‌ రేషియో) 19.0 లేదా ఆర్థిక సంవత్సరం 21/22 ఈ(ఆదాయాలు)కి 16.6 రెట్లు వద్ద చాలా చౌకగా ఉంది. జీఎస్ఎల్ ఉత్పత్తులు ప్రత్యేకమైనవి (కమోడిటైజ్ కావు). కానీ బ్రాండింగ్ లేకపోవడం గమనించాలి.

బ్రోకరేజి: ఎలరా క్యాపిటల్‌
హెచ్‌పీసీఎల్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 415; రిటర్న్‌: 34 శాతం
ఐఓసీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 182; రిటర్న్‌: 23 శాతం
  బీపీసీఎల్‌(భారత పెట్రోలియం)లోని తన వాటాను ప్రభుత్వం ఉపసంహరించుంటుందనే అంచనాల నేపథ్యంలో గత నెల రోజుల నుంచి దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీ)లు 15-34 శాతం లాభపడ్డాయి. ఒకవేళ ఇదే జరిగితే ఏఆర్‌సీని(ఎసెట్‌ రీప్లేస్‌మెంట్‌ కాస్ట్‌)  ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే 134-276 శాతం, టార్గెట్‌ ధర కంటే 117-178 శాతం పెంచి ఓఎంసీలు ఆఫర్‌చేస్తాయని అంచనావేస్తున్నాం. 2019 లో ఒపెకేతర దేశాలలో చమురు సరఫరా వృద్ధి ప్రపంచ డిమాండ్‌ను అధిగమించడం, రానున్న ఐఎంఓ(ఇంటర్నేషనల్‌ మారిటైం ఆర్గనైజేషన్‌) నిబంధనల వలన జీఆర్‌ఎం(గ్రాస్‌ రిఫైనరీ మార్జిన్‌)లు పెరగనుండడం, ఆర్థిక సంవత్సరం 2020 ప్రథమార్థంలో రిటైల్‌ మార్జిన్‌లు బాగుండడం, దేశీయంగా చమురు డిమాండ్‌ వృద్ధి చెందుతుండడం వంటి కారణాలు ఓఎంసీలకు అనుకూలంగా మారతాయని అంచనావేస్తున్నాం. ఓఎంసీలపై ఉన్న మా నెగిటివ్‌ దృక్పథాన్ని పాజిటివ్‌గా మార్చం.హెచ్‌పీసీఎల్‌(హిందుస్తాన్‌ పెట్రోలియం) ఆదాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండడంతో ఓఎంసీలలో ఈ కంపెనీపై ప్రాధాన్యాన్ని కలిగివున్నాం. హెచ్‌పీసీఎల్‌పై బై రేటింగ్‌ను కలిగి ఉండి టార్గెట్‌ ధరను రూ. 415గా నిర్ణయించాం. దీంతో పాటు ఐఓసీఎల్‌ రేటింగ్‌ను కూడా బై రేటింగ్‌కు మార్చి, టార్గెట్‌ ధరను రూ. 182 గా నిర్ణయించాం.

బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 252;  రిటర్న్‌ : 23 శాతం
  ఈ కంపెనీ, తన టెక్ గార్డెన్, డబ్యూటీసీ చెన్నైలను వాణిజ్యకరించడంతో ఆర్థిక సంవత్సరం 19-21 ఈ(ఆదాయం)లలో 25 శాతం సీఏజీఆర్‌(కాంపౌండ్‌ యాన్యుల్‌ గ్రోత్‌ రేట్‌)తో రూ .450 కోట్లను ప్రకటించే అవకాశం ఉం‍ది. బలమైన బ్రాండ్ ఈక్విటీ, రిచ్ లాంచ్ పైప్‌లైన్ (సుమారు 6 మిలియన్ చదరపు అడుగులు), స్థిరమైన బెంగళూరు మార్కెట్ (అధిక స్థోమత) గృహాల అమ్మకాలను పెంచుతాయి.  గృహాల వ్యాపారంతో పాటు హాస్పిటలైజేషన్ విభాగంలో నిధులను సరియైన సమయంలో సమీకరించడంతో ఈ కంపెనీ విలువ పెరుగింది. 1x (మారని) ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వాల్యు) ఆధారంగా..ఈ కంపెనీ స్టాకపై టార్గెట్‌ ధరను రూ. 213 నుంచి రూ. 252 కి సవరించి, కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం.

బ్రోకరేజ్: ప్రభుదాస్ లిల్లాధర్
ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ .1,792; రిటర్న్‌: 32 శాతం
ఏపీఎల​అపోలో ట్యూబ్స్ (ఏపాట్‌), ఇండియాలో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ (ఈఆర్‌డబ్యూ) స్టీల్ పైప్స్, సెక్సన్లను తయారు చేసే కంపెనీలలో ముందు వరుసలో  ఉంది. ఈ కంపెనీ వార్షిక ఉత్పాదక సామర్ధ్యం 2.55 ఎంఎన్‌ ఎంటీపీఏ(మిలియన్‌ టన్స్‌ పెర్‌ యానుయమ్‌) గా ఉంది.
 వచ్చే రెండేళ్లలో కంపెనీ ఆదాయాల సీఏజీఆర్‌ 56.3 శాతంగా, రుణ-ఈక్విటీ నిష్పత్తి సౌకర్యవంతంగా ఉంటుందని అంచనావేస్తున్నాం. వీటితో పాటు రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 26.9 శాతంగా ఉంటుందని అంచనావేస్తున్నాం.  రూ. 263.8 కోట్ల అధిక నగదు ఉత్పత్తి, ఈ స్టాకును 12.9x ఆర్థిక సంవత్సరం 20 ఈ , 9.2x ఆర్థిక సంవత్సరం 21ఈ పీఈఆర్‌ వద్ద ఆకర్షణీయంగా చేస్తోంది. ఈ స్టాక్‌పై కొనుగోలు రేటింగ్‌ను కలిగి ఉండి, కంపెనీ షేరుపై రూ. 1792 టార్గెట్‌ ధరను నిర్ణయించాం.You may be interested

వృద్ధి కోసమే క్యాపిటల్‌: రవనీత్‌ గిల్‌ 

Wednesday 2nd October 2019

డిపాజిటర్లు, రుణ గ్రహీతలు యస్‌ బ్యాంకు పట్ల నమ్మకంతోనే ఉన్నారని, వృద్ధి కోసమే బ్యాంకుకు నిధుల అవసరం ఉందని యస్‌ బ్యాంకు సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. సెప్టెంబర్‌ త్రైమాసికం పనితీరు ఇటీవలి కాలంలో బ్యాంకుకు మెరుగైన పనితీరు అవుతుందన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    బ్యాంకుపై ఇన్వెస్టర్లలో ఎంతో ఆందోళన ఉంది కదా..? జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో అంతకుముందు కాలంతో పోలిస్తే అధిక ఖాతాలు తెరిచాం. నూతన

భారత్‌-22 ఈటీఎఫ్‌ నాలుగో విడత రేపే..!

Wednesday 2nd October 2019

భారత్‌-22 ఈటీఎఫ్‌(ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌) నాలుగో విడుత ఇష్యూ గురువారం ప్రారంభం కాబోతుంది. తొలిరోజు యాంకర్‌ ఇన్వెస్టర్లు, మరుసటి రోజు సంస్థాగత, రిటైల్‌ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇష్యూ ద్వారా కేంద్రం రూ.8000 కోట్ల నిధుల సమీరకణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై 3 శాతం డిస్కౌంట్‌తో లభించనుంది. ఇష్యూ ద్వారా మొత్తం రూ.2000 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నాం. ఒకవేళ ఇష్యూకు అధిక స్పందన వస్తే కోట్లను

Most from this category