News


రేట్‌ కట్‌తో లాభపడే స్టాకులు!

Saturday 5th October 2019
Markets_main1570254030.png-28732

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ఎంపీసీ(మానేటరీ పాలసీ కమిటీ) శుక్రవారం సమావేశంలో మరో 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా 135 బేసిస్‌ పాయింట్లు వరకు రెపో రేటును తగ్గించినట్టయింది. ఈ చర్య వలన నిర్ధిష్టంగా కొన్ని స్టాకులు లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. వివిధ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం రేట్‌ కట్‌ వలన లాభపడే స్టాకులు:
విశ్లేషకులు: అజిత్‌ మిశ్రా, వైస్‌ ప్రెసిడెంట్‌ రిసెర్చ్‌, రెలిగర్‌ బ్రోకింగ్‌
ఎం అండ్‌ ఎం, ఎస్కార్ట్‌: ఆటో సెక్టార్లో డిమాండ్‌ తగ్గడంతో గత కొన్ని నెలల నుంచి ఆటో రంగ కంపెనీలు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత రేట్ల కోత వలన వాహన కంపెనీలు గ్రామీణ మార్కెట్లో వాటి అమ్మకాల పరిమాణాన్ని మెరుగుపరుచుకోడానికి అవకాశం ఉంటుం‍ది. అంతేకాకుండా ఫైనాన్సియల్‌గా కొంత ఉపశమనం ఉంటుంది.
యాక్సిస్‌ బ్యాంక్‌: రేట్ల కోత వలన రుణాలపై వడ్డీ తగ్గడంతో యాక్సిస్‌ బ్యాంకు రుణ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆస్తి నాణ్యత మెరుగుపడడంతోపాటు ఎన్‌పీఏ(మొండిబకాయిలు)లు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ చర్య వలన బ్యాంక్‌కు ఫైనాన్సియల్‌గా స్థిరత్వం వస్తుంది.
ఓబ్రాయ్‌ రియల్టీ, వోల్టాస్‌: రేట్ల కోత ఫలితాలను బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తే కిందిస్థాయి నుంచి వృద్ధి పుంజుకుంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, వినియోగం పెరగడానికి సహయపడతాయి. దీని వలన ఓబ్రాయ్‌ రియల్టీ, వోల్టాస్‌ వంటి స్టాకులు లాభపడే అవకాశం ఉంటుంది.

విశ్లేషకులు: జితేంద్ర ఉపధ్యాయ్‌, ఫండ్‌మెంటల్‌ ఎనలిస్ట్‌, బొనాంజా పోర్టుఫోలియో
ఓబ్రాయ్‌ రియల్టీ, గ్రోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: రేట్ల కోత వలను గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఈఎంఐ ఖర్చులు తగ్గుతాయి. ఈ చర్య వలన రియల్‌ఎస్టేట్‌ సెక్టార్‌ లాభపడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మిగిలిన కంపెనీలతో పోల్చుకుంటే ఓబ్రాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ కంపెనీల పుస్తకాలలో తక్కువ రుణాలున్నాయి. అందువలన ఈ కంపెనీల స్టాకులు రేట్‌కట్‌ వలన అధికంగా లాభపడతాయి. రుణాలపై వడ్డీరేట్లు తగ్గడంతో బ్యాంకులు కూడా లాభపడే అవకాశం ఉంది. బ్యాంకుల మార్జిన్‌లు మెరుగు పడతాయి.

విశ్లేషకులు: అమిత్‌ గుప్తా, సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ట్రేడింగ్‌ బెల్స్‌
ఉజ్జీవన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌: 
గత త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించిన కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలో ఉజ్జీవన్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ ఒకటి. ఈ కంపెనీల కీలక స్థానాలలో ప్రధాన మార్పులు జరిగాయి. ఇది కంపెనీకి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీల సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా ఈ సెక్టార్‌లో బలంగా ఉన్న ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీలు లాభపడడానికి సహాయపడుతుంది. ఈ కంపెనీలు లాభపడడంలో రేట్ల కోత సహాయపడుతుంది.
యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ: త్రైమాసిక ప్రాతిపదికన ఎన్‌పీఏలు తగ్గడంతో, తాజా మార్కెట్‌ల బుల్‌ రన్‌లో కార్పోరేట్‌ బ్యాంక్‌ల పాత్ర కీలకంగా ఉంది. రేట్లకోత జరగడంతో బ్యాంక్‌ల వృద్ధి ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక మార్కెట్‌లను యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐలు నడిపించనున్నాయి.  
అశోక్‌ లేలాండ్‌: లిక్విడిటీ సంక్షోభం వలన గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటో సెక్టార్‌ రేట్ల కోత వలన తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. వ్యవస్థలో లిక్విడిటీ సమస్య కొలిక్కి వచ్చింది. అంతేకాకుండా స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మూలధన వ్యయ చక్రం మెరుగుపడడనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్ఠి సారించడంతో అశోక్‌లేలాండ్‌ మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం, ఎలక్ట్రిక్‌ వాహనాల ఎగుమతి దారులు, కొనుదారులకు పన్ను ప్రయోజనాలను అందించిన విషయం తెలిసిందే.

డీకే అగర్వాల్‌, ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌ మెంట్‌ అండ్‌ అడ్వజరీ, చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌
ఏసీసీ: నికర అమ్మకాల వృద్ధి బాగుండడంతో పాటు, కార్యచరణ పనితీరు బలంగా ఉండడంతో కంపెనీ ‍ప్రస్తుత త్రైమాసికంలో తన లక్ష్యాలను చేరుకోవడంలో  పురోగతిని సాధించింది. కం‍పెనీ నిర్వహణ లాభం గణనీయంగా మెరుగుపడింది. ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, రహదారులను మెరుగుపరచడం వంటి చర్యల కోసం అధిక నిధులను కేటాయించడంతో సిమెంట్‌కు డిమాండ్‌ పెరుగుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.
టోరెంట్ పవర్: కంపెనీ తన సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో తన రుణ-ఈక్విటీ నిష్పత్తిని తగ్గించుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది.  ప్రసారాన్ని, పంపిణీని మెరుగుపరచుకోవడంతోపాటు, పర్యవరణహిత పవర్‌ ప్రాజెక్టులు, పునరుత్పాదక పవర్‌ప్లాంట్‌లపై కంపెనీ దృష్ఠి సారించింది. బొగ్గు సాంకేతిక పరిజ్ఞానం, పాత ప్లాంట్లను కొత్త సూపర్ క్రిటికల్ ప్లాంట్లతో భర్తీ చేయడం, ఆటోమేటిక్‌గా బొగ్గు లింకేజీల బదిలీ, కఠినమైన పర్యావరణ నిబంధనలు, డిజిటలైజేషన్‌ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి రంగాలు పుంజుకోనున్నాయి.
మారికో: ప్రస్తుతం వినియోగం మందగించింది. ఇలాంటి పరిస్థితులలో కూడా కంపెనీ మంచి పనితీరును కనబరిచింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెంటిమెంట్‌ తిరిగి కోలుకుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. 

 



You may be interested

జీడీపీ వృద్ధి అంచనాలు వాస్తవికంగా ఉన్నాయి!

Saturday 5th October 2019

-నిలేష్‌ షా, కోటక్‌ ఏఎంసీ ‘ఆర్‌బీఐ తన ఎంపీసీ సమావేశంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. ఆర్థిక సంవత్సరం 2020 మొత్తానికి సంబంధించి జీడీపీ వృద్ధిని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఆర్‌బీఐ ప్రస్తుతం చేసిన జీడీపీ వృద్ధి అంచనాల సవరణ, గతంలో చేసిన సవరణ కంటే చాలా వాస్తవికంగా ఉంది’ అని కోటక్‌ ఏఎంసీ(అసెట్‌ మేనేజ్‌మెంట్‌), ఎండీ నిలేష్‌ షా అన్నారు.  అంతేకాకుండా రేట్ల కోత మంచి చర్య అని,

27 పాయింట్ల లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 5th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది. ఇది 11,242.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11215.15 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో ఉంది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష సందర్భంగా జీడీపీ అంచనానలను తగ్గించడం, డిమాండ్ పడిపోవడంతో సెప్టెంబర్‌లో దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు మందగించడంతో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ (పీఎంఐ)

Most from this category