News


అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Wednesday 13th November 2019
Markets_main1573629245.png-29557

అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ స్టాక్‌ సిఫార్సులు ...
బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ

అదాని పోర్టు: ఈ కంపెనీ షేరుపై క్రెడిట్‌ సూసీ ‘ఔట్‌ఫెర్ఫర్మ్‌’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 480 గా నిర్ణయించింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌ ఆధారిత వృద్ధి తగ్గినప్పటికి కంపెనీ కంటైనర్‌ వృద్ధి హేతుబద్ధంగా ఉందని ఈ బ్రోకరేజి తెలిపింది. దామ్రా, కట్టుపల్లి పోర్టుల పనితీరు వలన కంపెనీ మంచి వృద్ధిని నమోదుచేస్తుందని ఈ బ్రోకరేజి అంచనావేస్తోంది.

 


హిందాల్కో: క్రెడిట్‌ సూసీ, హిందాల్కో షేరుపై  ఔట్‌ఫెర్ఫర్మ్‌’ రేటింగ్‌ను కలిగివుంది. అంతేకాకుండా ఈ షేరుపై రూ. 260 టార్గెట్‌ ధరను నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితియార్ధంలో కంపెనీ బొగ్గు లభ్యతపై జాగ్రత్తగా ఉండాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. 

 


లుపిన్‌: కంపెనీ షేరుపై క్రెడిట్‌ సూసీ ఔట్‌ పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తూ, షేరు టార్గెట్‌ ధరను రూ. 850 గా నిర్ణయించింది. జపాన్‌లోని వ్యాపారాలకు మంచి ఒప్పందాలు కుదిరాయని, దీంతో అమెరికా, ఇండియాలో క్యాపిటల్‌, మేనేజ్‌మెంట్‌ బాండ్‌విడ్త్‌ల లభ్యత పెరగుతుందని ఈ బ్రోకరేజి తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2021లో కంపెనీ షేరును ప్రభావితం చేసే అనేక ఉత్ర్పేరకాలు ఉన్నాయని అభిప్రాయపడింది.  

 

బ్రోకరేజి: సిటీ


బ్రిటానియా: ఈ కంపెనీ షేరుపై సిటీ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటిం‍గ్‌ను కొనసాగిస్తూ, టార్గెట్‌ ధరను రూ. 3,575 గా నిర్ణయించింది. కంపెనీ క్యూ 2 ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండడంతో, ఆర్థిక సంవత్సరం 20-21ఈ(ఆదాయం) ఈపీఎస్‌ అంచనాలను 9-10 శాతం పునరుద్ధరించింది. ఈ  షేరును కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు ఈ బ్రోకరేజి సలహాయిస్తోంది. 

 

బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ

నారయణ హృదయాలయా: ఈ స్టాకుపై మోర్గాన్‌ స్టాన్లీ ‘ఓవర్‌వెయిట్‌’ రేటింగ్‌ను కొనసాగిస్తు, షేరు టార్గెట్‌ ధరను  రూ. 349 గా నిర్ణయించింది. కంపెనీ లాభాల సామర్ధ్యం గత 3-4 ఏళ్ల నుంచి మెరుగుపడుతుందని, వివిధ బౌగోళిక ప్రదేశాలలో ఈ ఆసుపత్రి బెడ్‌ సామర్ధ్యం విస్తరిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ఈ కొత్త కేంద్రాలలో నష్టాలు తగ్గుముఖం పట్టాయని, ఉన్నతమైన సౌకర్యాలను ఈ ఆసుపత్రి అందిస్తుండడంతో, ఈ హాస్పిటల్‌ వృద్ధి ఆశాజనకంగా ఉందని అభిప్రాయపడింది.

 

బ్రోకరేజి: నోమురా


సన్‌టీవీ:  ఈ స్టాకుపై నోమురా బై రేటింగ్‌ను కలిగివుంది. అంతేకాకుండా ఈ షేరు టార్గెట్‌ ధరను రూ. 689 గా నిర్ణయించింది. ప్రకటన వృద్ధి మందగమన ప్రభావం క్యూ2 ఫలితాలలో కనిపించినప్పటికి , కంపెనీ సబ్‌స్క్రిప్సన్‌ వృద్ధిపై ఎటువంటి ప్రభావం లేదని ఈ బ్రోకరేజి తెలిపింది. డిజిటలైజేషన్‌ వలన సన్‌ అధికంగా ప్రయోజనం పొందుతుందని అభిప్రాయపడింది. 

 

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ


లుపిన్‌:  లుపిన్‌ తన జపనీస్‌ అనుబంధ సంస్థయిన క్యోవాలో 99.82 శాతం వాటాను విక్రయించేందుకు యూనిసన్‌ క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపడుతున్నప్పటికి, కంపెనీ యుఎస్‌ మార్కెట్‌లో సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ స్టాకుపై సీఎల్‌ఎస్‌ఏ సెల్‌ కాల్‌ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా ఈ షేరు టార్గెట్‌ ధరను రూ. 650గా నిర్ణయించింది. ఏం అండ్‌ ఏ(మెర్జర్‌ అండ్‌ ఎక్విజేషన్‌) అవకాశాల కోసం ఎదురుచూస్తున్నామని ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 

 


అదాని పోర్ట్స్‌: ముంద్రా పోర్టు పనితీరు బలహీనంగా ఉండడంతో ఆర్థిక సంవత్సరం 2020 క్యూ2లో అదాని పోర్ట్స్‌ ట్రాఫిక్‌ ప్లాట్‌గా ఉంది. రుణాలను డాలరైజింగ్‌ చేయడంతో అనిశ్చితి పెరుగుతోంది. కంపెనీపై ఆర్థిక సంవత్సరం 2020 మార్గదర్శకాలను ఈ బ్రోకరేజి తగ్గించింది. కొత్త ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సౌకర్యాలు కీలకంగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2019-21 సీఎల్(కరెంట్‌ అండ్‌ లాంగ్‌ టెర్మ్‌)లో పోర్టు ఎబిటా 4 శాతం వృద్ధి చెందుతుందని ఈ బ్రోకరేజి అంచనావేసింది. ముంద్రా పోర్టు కంటైనర్‌ మార్కెట్‌లో లీడర్‌గా కొనసాగుతోందని, ఏడాది ప్రాతిపదికన కంటైనర్‌ వాల్యుమ్‌లో 10 శాతం వృద్ధిని సాధించిందని తెలిపింది.

 


కోల్‌ ఇండియా: గత కొన్ని నెలల్లో  కోల్‌ ఇండియా వాల్యుమ్‌లు భారీగా పడిపోయాయి. కంపెనీ లాభాల దృక్పథం ప్లాట్‌గా ఉన్నప్పటికి, తక్కువ రిస్క్‌ ఉండడం వలన ఈ కంపెనీ వాల్యుషన్లు ఆకర్షిస్తున్నాయి. ఈ స్టాక్‌పై బై సిఫార్సును  కొనసాగిస్తు, షేరు టార్గెట్‌ ధరను రూ. 270గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది. 



You may be interested

88 షేర్లలో సెల్‌ సిగ్నల్స్‌!

Wednesday 13th November 2019

దేశీయ సూచీలు ఒకరోజు విరామం అనంతరం బుధవారం పాజిటివ్‌గా ఆరంభమై మధ్యాహ్నాన సమయానికి నెగిటివ్‌ జోన్‌లోకి జారాయి. మరోవైపు సోమవారం ముగింపు ప్రకారం 88 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో టాటా పవర్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, కాస్ట్రాల్‌ ఇండియా, శ్రీరామ్‌

ఆర్‌బీఐకి ఉల్లిఘాటు తగిలేనా?!

Wednesday 13th November 2019

ద్రవ్యోల్బణం 4 శాతం దాటే అవకాశం ఆహార పదార్ధాల ధరల పెరుగుదలే కారణం  ఉల్లి ధరల ఘాటుకు ఆర్‌బీఐ పెట్టుకున్న ద్రవ్యోల్బణ టార్గెట్‌ కకావికలం కానుందా? అవునని అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే ద్రవ్యోల్బణం టార్గెట్‌కు అటుఇటు అయినంత మాత్రాన ఆర్‌బీఐ తక్షణమే తన మానిటరీ పాలసీలో మార్పులు చేయకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 4.35 శాతం ఉండొచ్చని బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో 33 మంది ఎకనమిస్టులు అంచనా వేశారు. ఇదే నిజమైతే

Most from this category