News


ఈ స్టాక్స్‌కు అంతర్జాతీయ బ్రోకరేజీల రేటింగ్‌లు

Saturday 30th November 2019
Markets_main1575054338.png-29961

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు పలు స్టాక్స్‌కు ఇచ్చిన సిఫారసులు ఇలా ఉన్నాయి..

 

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌
బ్రోకరేజీ సంస్థ సిటీగ్రూపు గ్లోబల్‌ మార్కెట్స్‌ ఈ షేరుకు రూ.266 టార్గెట్‌ ఇచ్చింది. సానుకూల వృద్ధికి తోడు మార్జిన్ల పెరుగుదల కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో కంపెనీ నికర రుణ భారం 2019-20లో పెరుగుతుందని పేర్కొంది.

 

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు సిటీ రూ.450 టార్గెట్‌ ధరగా ఇచ్చింది. గతంలో ఇచ్చిన రూ.350ను పెంచింది. కోర్టు తీర్పు, కార్పొరేట్‌ శాఖ అఫిడవిట్‌ కంపెనీ చుట్టూ నెలకొన్న ఆందోళనలను తొలగిస్తాయని సిటీ నమ్ముతోంది. 

 

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌
ఈ స్టాక్‌కు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ రూ.140ను టార్గెట్‌ ధరగా పేర్కొంది. కంపెనీ విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపింది. కంపెనీ సైజు పరంగా లాభాల విషయంలో సౌకర్యాన్ని ఇస్తున్నట్టు పేర్కొంది.

 

టాటా మోటార్స్‌
ఈ స్టాక్‌కు జేపీ మోర్గాన్‌ న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇస్తూ టార్గెట్‌గా రూ.170ను పేర్కొంది. రిస్క్‌ కొద్దీ రాబడులు తటస్థంగా ఉన్నాయని తెలిపింది. ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వ్యాపార భాగస్వామ్యం కుదిరితే కంపెనీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.

 

స్టీల్‌రంగం
దేశీయ స్టీ్‌ల్‌ రంగం పట్ల జేపీ మోర్గాన్‌ సానుకూలంగా ఉంది. రాబోయే నెలల్లో స్టీల్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొంది. రెండోసారి స్టీల్‌ కంపెనీలు ధరలు పెంచడాన్ని ప్రస్తావించింది. 



You may be interested

మార్జిన్లు క్రమంగా పెరుగుతున్నాయ్‌..! 

Saturday 30th November 2019

లాభాల మార్జిన్లను క్రమంగా పెంచుకుంటున్న కంపెనీలు పెట్టుబడులకు మంచి అవకాశాలు అవుతాయా..? బీఎస్‌ఈ 500 సూచీలోని ఏడు కంపెనీలు గత నాలుగు త్రైమాసికాల నుంచి తమ లాభాల మార్జిన్లలో వృద్ధిని చూపిస్తున్నాయి. మరి పెరుగుతున్న మార్జిన్లకు అనుగుణంగా ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయాలి కదా..! కానీ, అన్నింటిలోనూ ర్యాలీ కనిపించడం లేదు. వీటిల్లో ర్యాలీకి మంచి అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది.    లాభాల మార్జిన్లను పెంచుకుంటున్న వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ

మొండి బకాయిల్ని దాస్తున్న ఎనిమిది బ్యాంకులు!

Friday 29th November 2019

ఎన్‌పీఏ(నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌)లుగా చూపాల్సిన మొండి బకాయిల్ని, బ్యాంకులు ఎంత మేరకు ఎన్‌పీఏలుగా గుర్తిస్తున్నాయో తెలుసుకునేందుకు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నాలుగేళ్ల తర్వాత బ్యాంకుల ఆస్తి నాణ్యతను సమీక్షించింది. కాగా ఈ సమీక్షలో కనీసం ఎనిమిది బ్యాంకులు నియంత్రణ సంస్థ అంచనాల కంటే తమ ఎన్‌పీఏలను తక్కువగా చేసి నివేదించడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నిర్ధేశించిన స్థాయి కంటే, ఈ బ్యాంకులు తక్కువగా  ప్రోవిజన్లను ఏర్పాటు చేశాయి.

Most from this category