News


అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల టాప్‌ సిఫార్సులు!

Tuesday 15th October 2019
Markets_main1571136258.png-28903

హిందుస్తాన్‌ యూనీలీవర్‌పై సీఎల్‌ఎస్‌ఏ
హిందుస్తాన్‌ యూనీలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈపీఎస్‌(షేరుపై ఆదాయం) అం‍చనాలను 1-2 శాతం పెంచింది. అంతేకాకుండా టార్గెట్‌ ధరను రూ. 2,135 నుంచి రూ. 2,250 కి పెంచింది. హోం కేర్‌, పర్సనల్‌ కేర్‌ విభాగంలో ఈ కంపెనీ బలమైన మార్జిన్‌లను పొందుతోందని తెలిపింది. ఈ కంపెనీ అమ్మకాల పరిమాణంలో వృద్ధి బాగానే ఉందని, వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల ట్రెండ్‌లుండడం వలన డిమాండ్‌ దృక్పథంలో కొన్ని సమస్యలున్నాయని తెలిపింది. ఈ కంపెనీ, జీఎల్‌కే ఒప్పందం ఆర్థిక సంవత్సరం 2020 క్యూ4 లో ముగిసే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు అంతగా ప్రభావితం కానప్పటికీ, లిక్విడిటీ ఆందోళనలు రిటైల్‌ స్థాయిలో అధికంగా ఉండడం గమనించాలి. ఏడాది ప్రాతిపదికన కంపెనీ అమ్మకాల వృద్ధి 5 శాతంగా ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక బలహీనతలకు సంకేతంగా ఉన్నప్పటికి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక మందగమనంలో ఇది మంచి స్థాయేనని ఈ బ్రోకరేజి వివరించింది. 

ఎన్‌టీపీసీపై సీఎల్‌ఎస్‌ఏ
ఎన్‌టీపీసీకి చెందిన ఖార్గోన్‌ ప్లాంట్‌... ఈ ఏడాది(ఏడాది ప్రాతిపదికన) ఎన్‌టీపీసీ  రెండెంకల వృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఖార్గోన్‌లో యుఎన్ సుస్థిరత లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్‌టీపీసీ కృషి చేస్తోంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఖార్గోన్‌ 1.32జీడబ్య్లూ(గిగావాట్‌) ప్లాంట్‌ కమర్షిలైజ్‌ అవుతుందని  ఎన్‌టీపీసీ ఆశిస్తోంది. ఎన్‌టీపిసీపై బై కాల్‌ను కలిగివుండి, టార్గెట్‌ ధర రూ. 157గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది.
ఫార్మా రంగంపై క్రెడిట్‌ సూసీ 
యుఎస్ జెనరిక్ మార్కెట్లో ఫార్మా కంపెనీలు వృద్ధి సవాళ్లును ఎదుర్కొంటున్నాయని, యుఎస్‌ మార్కెట్‌లో ధరల ఒత్తిడి అధికంగా కొనసాగే అవకాశం ఉందని క్రెడిట్‌సూసీ తెలిపింది. ఫార్మా రంగంలో కొన్ని కంపెనీలలో మాత్రమే ఆర్‌ఓసీఈ(రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌) పుంజుకుందని, ఆర్‌ఓసీఈ మెరుగుపడడంతో ఈ రంగంలో డా. రెడ్డీస్‌ను పరిశీలించమని సలహాయిచ్చింది. 
హిందుస్తాన్‌ యూనిలీవర్‌పై క్రెడిట్‌ సూసీ 
ఈ కంపెనీపై న్యూట్రల్‌ రేటింగ్‌ కలిగివుండి, టార్గెట్‌ ధరను రూ. 2,180గా ఈ బ్రోకరేజి నిర్ణయించింది. బలహీన ఆర్థిక వ్యవస్థలో ఈ కంపెనీ మంచి వాల్యుమ్‌ వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. కానీ ఆర్థిక సంవత్సరం 20-22 సంవత్సరాలకు ఆదాయాల వృద్ధి అంచనాలను కంపెనీ 2-4 శాతం తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం 2020 క్యూ2లో ఇండస్ట్రీ వృద్ధి తగ్గిందని కంపెనీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.
సన్‌ఫార్మాపై సిటీ
‘ఈ కంపెనీపై బై రేటింగ్‌ను కలిగివుండి, టార్గెట్‌ ధరను రూ. 540 గా నిర్ణయించాం. పొడి కళ్ల చికిత్సకు ఉపయోగించే సెక్వా(సీఈక్యూయూఏ) ప్రారంభం, కంపెనీ వ్యాఖ్యానికి అనుగుణంగా జరిగింది. దీని ప్రభావం మార్జిన్‌లపై ఉంటుందని అంచనావేస్తున్నాం’ ఈ బ్రోకరేజి తెలిపింది.
హెచ్‌యూఎల్‌ పై యూబీఎస్‌
యూబీఎస్‌, ఈ కంపెనీపై న్యూట్రల్‌ రేటింగ్‌ను కలిగివుండి, టార్గెట్‌ ధరను రూ. 2,150 గా నిర్ణయించింది. ‘కంపెనీ రెవెన్యూ వృద్ధి అస్పష్టంగా ఉంది. ప్రస్తుత స్థాయిల వద్ద ఈ షేరుపై రిస్క్‌ రివార్డు ఆకర్షణీయంగా కనిపించడం లేదు.  ధరలు తగ్గింపు, డిమాండ్‌ తగ్గడంతో రెవెన్యూ దృక్పథం తక్కువగా ఉంది’ ఈ బ్రోకరేజి తెలిపింది. You may be interested

క్యూ2లో ఈ కంపెనీలు నష్టాలు ప్రకటించే అవకాశం!

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల సీజన్‌ ఆరంభమైంది. దాదాపు అధిక శాతం కంపెనీలు ఈ నెల, వచ్చే నెలలో ఫలితాలను ప్రకటించనున్నాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రభావం క్యూ2 ఫలితాలపై పెద్దగా కనిపించదని, మందగమనం భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆటోమొబైల్స్‌, టెలికం, మెటల్స్‌ కంపెనీలు నష్టాలను ఎదుర్కోవచ్చని లేదా వాటి లాభాలు తగ్గిపోవచ్చన్నది బ్రోకరేజీ సంస్థల అంచనా. ఫార్మా, అగ్రి, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మంచి

రెండు వారాల గరిష్టానికి మార్కెట్‌

Tuesday 15th October 2019

291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 11400 పైన ముగిసిన నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు  అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్‌ మూడో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 291 పాయింట్ల లాభంతో 38,506.09 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 11,400 స్థాయి పైన 11,428.30 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఈ స్థాయిలు రెండు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య

Most from this category