News


అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు!

Wednesday 25th September 2019
Markets_main1569395280.png-28542

వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు:
బ్రోకరేజీ: సీఎల్‌ఎస్‌ఏ
సీఎల్‌ఎస్‌ఏ , వరుణ్‌ బెవరేజస్‌ స్టాక్స్‌పై ‘బై’ కాల్‌నిస్తూ, షేరు టార్గెట్‌ ధరను రూ. 860 కి పెంచింది. వరుణ్‌ బెవరేజస్‌, తను విస్తరించిన భూభాగంలో మార్కెట్‌ లాభాలను పొందేందుకు ప్రయత్నిస్తుందని ఈ బ్రోకరేజీ అంచనావేసింది. ఈ కంపెనీ కన్సోలిడేషన్‌ దశ ముగిసిందని, కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ పారామితులు మెరుగుపడనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ మేనేజెమెంట్‌ రిటర్న్‌ నిష్పత్తులపై దృష్ఠి పెట్టనుందని ఈ బ్రోకరేజి అభిప్రాయపడింది. 

బ్రోకరేజీ: మోర్గాన్‌ స్టాన్లీ
మోర్గాన్‌ స్టాన్లీ, టీవీఎస్‌ మోటార్స్‌ స్టాక్‌పై అండర్‌వెయిట్‌నిస్తూ, టార్గెట్‌ ధరను షేరుకు రూ. 326గా నిర్ణయించింది. ఈ కంపెనీ షేరు ధర ఇండెక్స్‌తో పాటే పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ద్విచక్ర వాహన పరిశ్రమలో పోటీతీవ్రత ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ షేరుపై రిస్క్‌ రివార్డు ఆకర్షిణియంగా లేదని అభిప్రాయపడింది.

బ్రోకరేజి: యూబీఎస్‌
యూబీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాక్‌పై న్యూట్రల్‌ రేటింగ్‌ను కలిగివుంది. అంతేకాకుండా కంపెనీ షేరుపై టార్గెట్‌ ధరను రూ. 470 నుంచి రూ. 580కి పెంచింది. ఈ కంపెనీ నెలవారి ప్రీమియం ట్రెండ్స్‌ అంచనాలకు మించాయని, ఏడాది ప్రాతిపదికన మార్జిన్‌ గరిష్ఠాంగానే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. 

బ్రోకరేజి: జేపీ మోర్గాన్‌ 
జేపీమోర్గాన్‌, కాన్‌కర్‌ స్టాక్‌పై ఓవర్‌వెయిట్‌ను కలిగివుండి, కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 600 గా నిర్ణయించింది. ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ రైల్వే అవకాశాలపై దృష్ఠి సారించిందని, ప్రస్తుతం కంపెనీ షేరు ఆర్థిక సంవత్సరం21ఈ(ఆదాయం)కి 20 రెట్లు వద్ద ట్రేడవుతోందని ఈ బ్రోకరేజి తెలిపింది.

బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ
దేశీయ సైక్లికల్‌ మిడ్‌క్యాప్‌ వాల్యు స్టాకులను కొనుగోలు చేయాలని మోర్గాన్‌ స్టాన్లీ సలహాయిచ్చింది. రక్షణాత్మక స్టాకుల కంటే దేశీయ సైక్లికల్‌ స్టాకులకు ప్రాధాన్యం ఇవ్వాలని, లార్జ్‌క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ బ్రోకరేజి తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం విస్తృత మార్కెట్‌ వాల్యుషన్‌ ఆకర్షిణియంగా ఉం‍దని వివరించింది.
మిడ్‌క్యాప్‌లో ప్రాధాన్య స్టాకులు: ఇండియన్ హోటల్స్, జుబిలెంట్ ఫుడ్, ఎం అండ్ ఎం ఫైనాన్స్, ఎంసీఎక్స్‌, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, అశోక్ లేలాండ్, కంటైనర్ కార్ప్

బ్రోకరేజి: యూబీఎస్‌ 
వినియోగ ఆధారిత స్టాకులపై యూబీఎస్‌ పాజిటివ్‌గా ఉంది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనాలను ఈ రంగంలో చాలా వరకు కంపెనీలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం 21 గాను ఈ రంగం ఈపీఎస్‌ అంచనాలను 0 శాతం నుంచి 17.6 శాతానికి నవీకరించింది. ఈ రంగంలో ఏసియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, నెస్లే, డాబర్‌ స్టాకులు అధిక ప్రాధాన్యం ఉన్న స్టాకులుగా ఉన్నాయి.

 You may be interested

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ పతనం

Wednesday 25th September 2019

వరుసగా రెండోరోజూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,495.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 4శాతం క్షీణించి 2,421.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ రంగానికి

3-వారాల గరిష్టానికి పసిడి

Wednesday 25th September 2019

అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర‍ 3వారాల గరిష్టాన్ని అందుకున్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులకు నష్టం చేకూర్చేందుకు విదేశీ శక్తుల్ని వాడుకోవాలని ట్రంప్ ప్రయత్నించారని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షమైన డెమాక్రటిక్ పార్టీ ఆరోపణలు చేసింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ ప్రకటించారు. మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై మేఘాలు కమ్ముకోవడంతో పసిడి ధర పసిడి ఫ్యూచర్లకు

Most from this category