STOCKS

News


ఆ మూడింటికే సత్తా ఉంది!

Wednesday 18th December 2019
Markets_main1576661517.png-30288

రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించేవి అవే...
టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో రూ.20 లక్షల మార్కెట్‌ క్యాప్‌ సాధించగల సత్తాకలిగినవని మోతీలాల్‌ ఓస్వాల్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఒత్తిడిలో ఉన్న టెలికం, ఇన్‌ఫ్రా, రియల్టీ, పీఎస్‌బీ రంగాల ఎర్నింగ్స్‌ మొత్తం ఎర్నింగ్స్‌లో 50 శాతం ఉండడం వల్ల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ స్పష్టంగా కనిపించడం లేదన్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం కంపెనీలు మంచి ఫలితాలు చూపుతాయని, రాబోయే ఐదారేళ్లలో పైన చెప్పిన మూడు కంపెనీలు రూ.20లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ రేసులో గెలుస్తాయని చెప్పారు. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పదేళ్లలో రూ.15 లక్షల కోట్ల కంపెనీగా అవతరించవచ్చన్నారు.

ప్రస్తుతం నిఫ్టీ పీఈ అధికంగా ఉన్నా, పీబి నిష్పత్తి మాత్రం 3 వద్దే ఉందన్నారు. మార్కెట్‌క్యాప్‌- జీడీపీ నిష్పత్తి సాధారణ స్ధాయిల వద్ద ఉంది. ఎర్నింగ్స్‌ మాత్రం ఉండాల్సినదానికన్నా సగమే ఉన్నాయి. ఇందుకు ఒత్తిడిలో ఉన్న రంగాలే కారణం. ఈ రంగాల కంపెనీలు నగదు ఉత్పత్తి చేయలేకపోతున్నాయన్నారు. ఐఐపీలో క్షీణత సైక్లిక్‌లో భాగమన్నారు. ఎకానమీలో నగదు కొరత ఉందని ప్రభుత్వం లేటుగా గ్రహించిందన్నారు. ఇప్పుడిప్పుడే లిక్విడిటీ మెరుగుపడుతోందన్నారు. వచ్చే బడ్జెట్లో విత్తలోటు 4 శాతంగా ప్రభుత్వం ప్రకటిస్తే తిరిగి నగదు కొరత ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతోందని రామ్‌దేవ్‌ అభిప్రాయపడ్డారు. ఎకానమీలో పునరుజ్జీవానికి మరో ఆరేడు నెలలు పట్టవచ్చని అంచనా వేశారు. 



You may be interested

టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకం!

Wednesday 18th December 2019

అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్నియమిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ(అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాలిచ్చింది. మిస్త్రీని తొలగించడం, ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం అనైతికమని ప్రకటించింది. మిస్త్రీ పునర్నియామకం నాలుగువారాల్లో అమల్లోకి వస్తుందని, ఈ గడువులోపు టాటా గ్రూప్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలోని ద్విసభ్య బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. దీంతో పాటు టాటాసన్స్‌ను పబ్లిక్‌ నుంచి ప్రైవేట్‌

లాభాల మార్కెట్లో బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో...

Wednesday 18th December 2019

మార్కెట్‌ ర్యాలీలోనూ బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ షేర్లు పతనంతో నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నస్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రూ.5,250 కోట్ల మొండిబకాయిలను కలిగి ఉన్నట్లు ఆర్‌బీఐ రిస్క్‌ అసెస్‌మెంట్‌

Most from this category