రెండంకెల రాబడికి నార్నొలియా రికమండేషన్లు
By D Sayee Pramodh

స్వల్పకాలంలో 10-20 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నొలియా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సిఫార్సు చేస్తుంది
1. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 150. స్టాప్‌లాస్ రూ. 109. దిగువన రూ.110ని తాకిన అనంతరం వేగంగా రీబౌండ్ చెంది కన్సాలిడేషన్లోకి వెళ్లింది. ప్రస్తుత పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాట్రన్ నుంచి రూ. 130కి పైన బ్రేకవుట్ సాధిస్తే మరింత అప్‌మూవ్ ఉంటుంది.
2. మనుప్పురం ఫైనాన్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 150. స్టాప్‌లాస్ రూ. 113. చార్టుల్లో పాయింట్ ఆఫ్ పోలారిటీ కారణంగా దిగువన మద్దతు పొందుతున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి. వంద రోజుల డీఎంఏ వద్ద గట్టి మద్దతు పొందుతోంది.
3. ఫెడరల్ బ్యాంక్: కొనొచ్చు. టార్గెట్ రూ. 118. స్టాప్‌లాస్ రూ. 99. క్రమబద్ధమైన చానెల్లో కదులుతూ ముందుకు పోతోంది. దిగువన 100- 102 రూపాయల వద్ద బలమైన సపోర్ట్ లభిస్తోంది. ఇక్కడనుంచి రెండు మార్లు పైకి ఎగిసింది. ప్రస్తుతం తన స్వల్పకాలిక మూవింగ్ సరాసరి స్థాయిలకు పైన కదులుతూ అప్‌మూవ్ సంకేతాలు ఇస్తోంది.
4. డీసీబీ బ్యాంక్: కొనొచ్చు. టార్గెట్ రూ. 260. స్టాప్‌లాస్ రూ. 218. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ప్రైస్ ప్యాట్రన్కు అనుకూలంగా ఉంది. రూ. 225 రేంజ్లో గట్టి మద్దతు పొంది పైకి వస్తోంది.
5. బిర్లా కార్పొరేషన్: కొనొచ్చు. టార్గెట్ రూ. 680. స్టాప్‌లాస్ రూ. 588. తాజా గరిష్ఠాల నుంచి మంచి పతనం చూసి దిగువన డబుల్ బాటమ్ ఏర్పరిచింది. కొద్ది రోజులుగా మూవింగ్ సరాసరిలకు పైన స్థిరంగా కదులుతూ బలాన్ని చూపుతోంది. టెక్నికల్ ఇండికేటర్లు ర్యాలీకి మద్దతు సంకేతాలు ఇస్తున్నాయి.
You may be interested
30500 పైన బ్యాంక్ నిఫ్టీ
Tuesday 16th July 2019మార్కెట్ స్వల్పలాభాల్లో భాగంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మంగళవారం అరశాతానికి పైగా లాభపడింది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్ నేడు 30532.65 వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 189 పాయింట్లు పెరిగి 30,500 అధిగమించి 30635.00 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:35ని.లకు ఇండెక్స్ గత ముగింపు(30,445.95)తో పోలిస్తే 61 పాయింట్లు పెరిగి (0.20శాతం)
ఫైనాన్స్, ఫార్మాలో ఈ షేర్లు బెస్ట్: ఇండిట్రేడ్ ఛైర్మన్
Tuesday 16th July 2019ఇన్ఫోసిస్, టీసిఎస్ వాల్యుషన్ గ్యాప్ తగ్గనుంది. సన్ ఫార్మా, డా.రెడ్డిస్ షేర్లు మంచి లాభాలను ఇవ్వగలవు ఫైనాన్స్ షేర్లలో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ బుల్లిష్‌గా ఉన్నాయి. ఫార్మాలో పెట్టుబడులు పెట్టేటప్పుడు రక్షణాత్మక దోరణిని అవళింబించవచ్చు కానీ ఈ షేర్లు ఎల్లప్పుడూ రక్షణాత్మకంగా ఉండకపోవచ్చని ఇండిట్రేడ్ క్యాపిటల్ చైర్మన్ సుదీప్ బంద్యోపధ్యాయ్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... ఇన్ఫోసిస్ అంచనాలకు మించి... ఇన్ఫోసిస్ పాజిటివ్ ఫలితాలను ప్రకటిస్తుందని అంచనా