News


ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో టాప్‌లేపిన మిడ్‌క్యాప్స్‌!

Thursday 26th September 2019
Markets_main1569492115.png-28569

 అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని  షేర్లు సెప్టెంబర్‌ నెలలో అద్భుత ప్రదర్శనను చేశాయి. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో మొత్తంగా 240 కంపెనీల షేర్లుండగా, అందులో 162 కంపెనీలు పాజిటివ్ రిటర్న్‌లను ఇవ్వడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ వ్యాపారాలలో ఉన్న టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ హోల్డింగ్స్ (సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 24 మధ్య) 50 శాతం పైనే ర్యాలీ చేసింది. దీనితో పాటు ఈ పోర్టుపోలియోలో స్టెర్లైట్ టెక్నాలజీస్ (48 శాతం), ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (46 శాతం), సీజీ పవర్ అండ్‌ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ (41 శాతం), మోరేపాన్ లాబొరేటరీస్ (39 శాతం), పటేల్ ఇంజనీరింగ్ (38 శాతం) కంపెనీల షేర్లు లాభపడిన షేర్లలో ముందున్నాయి. రానున్న అక్టోబర్‌ నెల నుంచి మార్కెట్‌ల ప్రాధాన్యంగా మిడ్‌క్యాప్‌ షేర్లు మారనున్నాయని సీనియర్‌ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా అన్నారు. ‘అక్టోబర్‌ తర్వాత మిడ్‌ క్యాప్‌ విభాగంలో అవకాశాలను వెతుక్కునేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తారు’ అని తెలిపారు. అంతేకాకుండా పెరిగిన నిరుద్యోగం, డిమాండ్‌ ఆందోళనలు వంటి అంశాలు స్థూల ఆర్థిక వ్యవస్థకు సమస్యలుగా ఉన్నాయని, ఈ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకుల వైపు ఇన్వెస్టర్లు దృష్ఠి పెట్టే అవకాశం ఉందని అన్నారు. 
పోర్టుపోలియోలో టాప్‌ 20లో ఉన్న మిడ్‌క్యాప్స్‌.. 
సెప్టెంబర్‌ 1 నుంచి 24 తేది వరకు పరిశీలిస్తే..బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 8.61 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 9.31 శాతం లాభపడగా, సెన్సెక్స్‌ 5.47 శాతం లాభపడింది. ఇదే సమయంలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గ్రాఫైట్ ఇండియా, అబాన్ ఆఫ్‌షోర్, బజాజ్ హిందూస్థాన్, ఒరిస్సా మినరల్స్ డెవలప్‌మెంట్ కంపెనీ, సంగం (ఇండియా) కంపెనీల షేర్లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో 28 శాతానికి పైగా ర్యాలీ చేయడం గమనార్హం. నిఫ్టీ కంటే మిడ్‌క్యాప్‌ వాల్యుషన్‌ 18 శాతం రాయితీతో ప్రస్తుతం ట్రేడవుతోందని, ఫలితంగా వాల్యుషన్‌ పరంగా కొంత సానుకూలత ఉందని ఎడల్వీస్‌ సెక్యురిటీస్‌ తెలిపింది. ఇండో రామా సింథటిక్స్, హెచ్‌ఈజీ, మనుగ్రాఫ్ ఇండియా, హిందూస్తాన్ మోటార్స్, జై కార్ప్, డీసీఎం షేర్లు ఈ నెలలో ఇప్పటి వరకు 25-27 శాతం రిటర్న్‌లిచ్చి ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో లాభపడిన 20 స్టాకులలో ఉన్నాయి.  
ఎల్‌ఐసీకి నష్టాలిచ్చిన స్టాకులు..
మరోవైపు హెక్సా ట్రేడెక్స్, అస్సాం కంపెనీ, అలోక్ ఇండస్ట్రీస్, ఇండియన్ బ్యాంక్, బల్లార్పూర్ ఇండస్ట్రీస్, టాటా కమ్యూనికేషన్స్, సుజ్లోన్ ఎనర్జీ కంపెనీల షేర్లు 20-46 శాతం క్షీణించాయి. ‘మార్కెట్స్‌ను ఇక్కడి నుంచి మిడ్‌క్యాప్‌ షేర్లు నడుపుతాయి. ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాకులను పరిశీలించవచ్చు’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సలహాయిచ్చింది.



You may be interested

మళ్లీ లాభాల ముగింపు

Thursday 26th September 2019

11550 పైన ముగిసిన నిఫ్టీ 396 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  ఒకరోజు పతనం అనంతరం మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం సెన్సెక్స్‌ 396.22 పాయింట్లు పెరిగి 38,990 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 11,571.20 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని అన్నిరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి.

తగ్గిన వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు: మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Thursday 26th September 2019

 అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ట్రంప్‌ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో గురువారం  ప్రపంచ మార్కెట్లలో మెటల్‌ షేర్లు లాభాల బాటపట్టాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. అలాగే నేడు ఇక్కడ మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా మెటల్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మెయిల్‌, ఎన్‌ఎండీసీ, వేదాంత, నాల్కో, సెయిల్‌ షేర్లు 6.50శాతం నుంచి

Most from this category