News


టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు..

Wednesday 12th September 2018
Markets_main1536746203.png-20203

వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు కలిగిన కంపెనీలు మంచి పనితీరు కనబర్చవని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవాని తెలిపారు. అందువల్ల మహీంద్రా ఫైనాన్స్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. మిడ్‌క్యాప్స్‌లో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, వాహన విడిభాగాల కంపెనీలకు ప్రాధ్యానమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి మరింత బలహీనపడితే ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టపోతాయని తెలిపారు. సమీప కాలంలో ఐటీకి మంచి రోజులు ఉన్నాయని పేర్కొన్నారు. ఓఎంసీలకు దూరంగా ఉండటం ఉత్తమమని సూచించారు. 
మార్కెట్లు పడిపోతున్నప్పుడు స్టాక్స్‌ ఆకర్షణీయంగానే కనిపిస్తాయని వివేక్‌ తెలిపారు. చరిత్రను చూస్తే రూపాయి పడిపోయినప్పుడల్లా ఈక్విటీ మార్కెట్లు కూడా వెంటనే క్షీణించాయని గుర్తుచేశారు. అందువల్ల కొద్ది రోజులు వేచి చూడాలన్నారు. 72-73 శ్రేణలో రూపాయి ఉండటం మార్కెట్లకు మంచిది కాదని తెలిపారు. రూపాయి మరింత పడిపోతే ఈక్విటీ మార్కెట్లు కూడా పతనమౌతాయని పేర్కొన్నారు. 
ఎగుమతి ఆధారిత కంపెనీల విషయానికి వస్తే.. ఐటీ రంగానికి సమీప కాలంలో మంచి రోజులు ఉన్నాయని వివేక్‌ తెలిపారు. రూపాయి పతనం కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. టెక్నాలజీ కంపెనీలకు ఈ ఏడాది రూపాయి ఎర్నింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పెయింట్స్‌ కంపెనీలు దిగుమతులపై ఆధారపడతాయని పేర్కొన్నారు. పెయింట్స్‌ విభాగంలో కేవలం 4 కంపెనీలే 90 శాతం వాటాను ఆక్రమించాయని, అందువల్ల అవి ధరలను నిర్దేశిస్తున్నాయని తెలిపారు. రూపాయి పతనం వల్ల వీటిపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపారు. గత 5-10 ఏళ్లను గమనిస్తే.. రూపాయి 39 నుంచి 72 స్థాయికి పెరిగిందని, అయినా కూడా పెయింట్‌ కంపెనీల మార్జిన్లపై ఎలాంటి ప్రభావం పడలేదని గుర్తుచేశారు. రానున్న కాలంలోనే ఇదే ట్రెండ్‌ ఉంటుందని తెలిపారు. 
జైన్‌ ఇరిగేషన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి సంస్థల వ్యాపారాలు బలహీనంగా ఉన్నాయని, రూపాయి పడిపోవడం వల్ల పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయని వివేక్‌ పేర్కొన్నారు. హిందాల్కో, భారత్‌ ఫోర్జ్‌ విషయానికి వస్తే ఇవి డాలర్‌ రూపంలో చెల్లించాల్సిన రుణాలను ఎక్కువగా కలిగి ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో ఇవి డాలర్‌ రూపంలో ఎక్కువగా అర్జిస్తాయని పేర్కొన్నారు. అందువల్ల వీటి పనితీరును వార్షికంగా చూడాల్సి ఉంటుందన్నారు. ఓఎంసీ కంపెనీలకు ప్రస్తుతం దూరంగా ఉండటం మంచిదని తెలిపారు. 
బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా ఫైనాన్స్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని వివేక్‌ సూచించారు. వచ్చే రెండేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మంచి ఫలితాలను నమోదు చేయవచ్చని అంచనా వేశారు. అప్పుడు మహీంద్రా ఫైనాన్స్‌ ప్రయోజనం పొందుతుందన్నారు. చోళమండలం ఫైనాన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని తెలిపారు. 
మిడ్‌క్యాప్స్‌లో మహానగర్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, గుజరాత్‌ గ్యాస్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని వివేక్‌ పేర్కొన్నారు. గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో మంచి వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. వాహన రంగానికి వస్తే.. బజాజ్‌ ఆటో, మారుతీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. మిడ్‌క్యాప్స్‌లో వాహన విడిభాగాల విభాగంలో జేటీఈకేటీ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. ఇది ప్యాసింజర్‌ కార్లకు షాక్‌ అబ్సార్బర్స్‌, సస్పెన్షన్‌ సిస్టమ్స్‌ను తయారు చేస్తుంది.  
      You may be interested

రూపీ రేంజ్‌ 70-74!

Wednesday 12th September 2018

క్రూడ్‌ ధరలు పెరిగాయని, ఇవి ఈ ఏడాది అధిక స్థాయిల్లోనే ఉంటాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణమని పేర్కొంది. సమీప కాలంలో డిమాండ్‌-సప్లై సమీకరణాలు క్రూడ్‌ ధరలను నిర్దేశిస్తాయని తెలిపింది. ఒపెక్‌ దేశాల నుంచి క్రూడ్‌ సరఫరా, అమెరికాలో ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు క్రూడ్‌ ధరల పరుగును కొంత అడ్డుకోవచ్చని అంచనా వేసింది.  వెనిజుల వంటి దేశాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి తగ్గడం సహా

ఆగస్ట్‌లో తగ్గిన వాణిజ్య లోటు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ:- ఆగస్ట్‌లో వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గింది. ఈ నెలలో వాణిజ్య లోటు 17.4 బిలియన్‌ డాలర్లగా నమోదైంది. వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి... -    ఆగస్ట్‌లో ఎగుమతులు 19.21శాతం పెరిగి 27.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇతర ఉత్పత్తులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం ఎగుమతుల పెరుగుదలకు దోహదపడింది. పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతులను మినహాయించినప్పటికీ వృద్ధి 17.43శాతంగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ

Most from this category