News


ఈ టాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ

Thursday 26th December 2019
Markets_main1577352532.png-30455

హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌
ఐడీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌
వేల్యూ రీసెర్చ్‌ ధీరేంద్ర కుమార్‌ రికమండేషన్స్‌

గతేడాది పలు ఒడిదొడుకులు, నియంత్రణల్లో మార్పులు వంటి అంశాల నడుమ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లు ఆకర్షణీయ పనితీరును చూపలేకపోయాయంటున్నారు వేల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విభిన్న ఇన్వెస్టర్లకు విభిన్న ఫండ్స్‌ను సూచించారు. ఇతర వివరాలు చూద్దాం..

2019లో ఈక్విటీ విభాగంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ముందు నిలిచాయి. వ్యక్తిగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు అధికంగా కలిగిన మల్టీక్యాప్‌ ఫండ్‌ సైతం 7-8 శాతం రిటర్నులు అందించింది. వెరసి గతేడాదిని పూర్తిగా నిరాశపరచినట్లుగా భావించరాదు. రెండేళ్లక్రితం నమోదైన ఉత్సాహకర పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు  చిన్నషేర్ల ఫండ్స్‌లో పెట్టుబడులకు బాగా ఆసక్తి చూపారు. అయితే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ 2-3 శాతం క్షీణించినప్పటికీ నిరుత్సాహపడనక్కర్లేదు. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ విషయానికివస్తే.. లాభనష్టాలను చవిచూశాయి. గతేడాది ఫండ్స్‌ నియంత్రణల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక వచ్చే ఏడాది(2020) కోసం మరీ దూరంగా ఆలోచించడంకంటే సమీప భవిష్యత్‌పైనే దృష్టిపెట్టడం మేలు. గత రెండేళ్లలో ప్రోత్సాహకర పరిస్థితులు లేకపోవడంతో ఇకపై రికవరీకి అవకాశముంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌వైపు దృష్టిపెట్టవచ్చు. 

ఎస్‌ఐపీ సంగతేంటి?
సిప్‌ ఇన్వెస్టర్లు విజయవంతం కావాలంటే రెండు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీ పెట్టుబడుల కాలపరిమితికి అనుగుణంగా సరైన ఫండ్స్‌ను ఎంచుకోవడం, దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించడం. ఏదేమైనా కన్సర్వేటివ్‌గా వెళ్లడం మేలు. అంతగా ఎక్స్‌పీరియన్స్‌ లేని ఇన్వెస్టర్లయితే కొంత మొత్తాన్ని బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ లేదా ఈక్విటీ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ప్రధానంగా మార్కెట్ల నడక ఆధారంగా మీ పెట్టుబడుల ప్రణాళికలు ఉండకూడదు. మార్కెట్లు డీలాపడ్డాయని మీ ప్రణాళికలో మార్పులు చేసుకోవడం లాభించకపోవచ్చు. అయితే మార్కెట్ల ట్రెండ్‌ను బట్టి ఆలోచనలు మారడం సహజమే. మల్టీబ్యాగర్ల కోసం, లేదా చౌకగా లభిస్తున్నాయనో స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లోనే అధికంగా ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. సమయానుగుణంగా పెట్టుబడులను విభిన్నంగా ఇన్వెస్ట్‌ చేయడం లాభిస్తుంది. అధిక రిటర్నుల కోసం ఆశపడితే పెట్టుబడులకు రిస్కులు పెరుగుతాయి.

ఈ ఫండ్స్‌ ఎంచుకోవచ్చు
జాగ్రత్తగా వ్యవహరించే ఇన్వెస్టర్లు నిలకడైన పనితీరు చూపే కన్సర్వేటివ్‌ గ్రోత్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌, ఐడీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. దీర్ఘకాలం వేచిచూసే ఇన్వెస్టర్లు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెసివ్‌ గ్రోత్‌ ఫండ్స్‌ కోసమైతే యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా ‍ప్రైమా, హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లను పరిశీలించవచ్చు. You may be interested

2019: ఈ స్టాక్స్‌.. హీరోలు

Thursday 26th December 2019

కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సగటున 10 శాతంపైగా లాభాలు ఆర్జించాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 13 శాతంపైగా ర్యాలీ చేయగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 శాతం పురోగమించింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు

స్వల్పకాలానికి స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 26th December 2019

సూచీలు కొత్త గరిష్టాలను నమోదు చేసిన అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఓవర్‌బాట్‌ అయిన నేపథ్యంలో ఎప్పుడైనా లాభాల స్వీకరణ జరవచ్చనే అంచనాలతో  ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకు మార్కెట్లో స్తబ్దుగా కొనసాగే అవకాశం ఉండొచ్చంటున్నారు.  ఈ నేపథ్యంలో స్వల్పకాలానికి కొనుగోలుచేసేందుకు వారు కొన్ని స్టాక్‌లను సిఫార్సు చేస్తున్నారు.  కునాల్‌ బోత్రా నుంచి 5స్టాక్‌ రికమెండేషన్లు.... షేరు పేరు:- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ టార్గెట్‌

Most from this category