News


అక్టోబర్‌లో ఫంద్స్‌ కొన్న బ్లూచిప్స్‌ ఇవే!

Friday 15th November 2019
Markets_main1573797689.png-29615

మ్యూచువల్‌ ఫండ్స్‌ అక్టోబర్‌ నెలలో బ్లూచిప్‌ స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. వీటి వాల్యుయేషన్‌లు చౌకగా లేనప్పటికి, ఈ కంపెనీల వృద్ధి ఆశాజనకంగా ఉండడమే దీనికి కారణం. ఈ బ్లూచిప్‌ కంపెనీలన్ని ఒక పోలికను కలిగివున్నాయి. ఈ కంపెనీలు ఆయా రంగాలలో కీలకంగా ఉండడం లేదా కీలకంగా మారడానికి దగ్గర్లో ఉండడం గమనార్హం. ఫండ్‌ మేనేజర్లు అక్టోబర్‌ నెలలో కొనుగోలు చేసిన కంపెనీలలో టాప్‌ కంపెనీల గురించి ఈ కింద ఉంది. 
ఐటీసీ
కొనుగోలు చేసింది: హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌); ప్రస్తుత ధర: రూ. 254
గత  రెండు నెలల్లో ఐటీసీ షేరు 5-6 శాతం పతనమయ్యింది. కాగా కార్పోరేట్‌ పన్ను రేటును ప్రభుత్వం తగ్గించడం వలన , సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ అత్యధిక త్రైమాసిక నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కంపెనీ ఇతర వ్యాపారాలు నిలకడగా రాణిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మందగమనంలో కూడా తక్కువ ప్రభావం అయ్యే కొన్ని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఐటీసీ ఖచ్చితంగా ఉంటుంది. అందువలన ఈ షేరుపై ఫండ్‌ మేనేజర్లు బుల్లిష్‌గా ఉన్నారు. 

లార్సెన్‌ అండ్‌ టూబ్రో
కొనుగోలు చేసింది: ఆదిత్య బిర్లా ఎస్‌ఎల్‌ ఎంఎఫ్‌; ప్రస్తుత ధర: రూ. 1,380
చాలా కాలం నుంచి ఇన్వెస్టర్లు ఈ స్టాకుపై బుల్లిష్‌గా ఉన్నారు. విస్తృత మార్కెట్లు 2-3 శాతం పడిపోయి, అనిశ్చితిలో ఉన్నప్పుడు ఫండ్‌మేనేజర్లు  ఈ స్టాకుపై తమ ఎక్స్‌పోజర్‌ను పెంచుకున్నారు. ఎల్‌ అండ్‌ టీ కి సంబంధించి రెండు వేరు వేరు ప్రయోజనాలున్నాయి. మొదటిది ఈ కంపెనీ కొత్త ఆర్డర్లకు బిడ్‌లు వేయమని ప్రకటించింది. దీంతో బ్యాలెన్స్‌షీట్‌ను పణంగా పెట్టి ఈ కంపెనీ ప్రతి ఆర్డర్‌కు బిడ్‌లు వేయదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండవది, ఈ కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ. 3,03,222 కోట్లుతో బలంగా ఉంది. ఇది ఆర్థిక సంవత్సరం 2020లో కంపెనీ రెవెన్యూ వృద్ధి 12-15 శాతం పెరగడానికి సహాయపడుతుంది. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
కొనుగోలు చేసింది: హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌; ప్రస్తుత ధర: రూ. 306
మార్కెట్‌ అనిశ్చితిలో భాగంగా ఎస్‌బీఐ షేరు గత రెండు నెలలో 5-8 శాతం పడిపోయింది. అందువలన ఈ స్టాక్‌పై ఫండ్‌ మేనేజర్ల ఎక్స్‌పోజర్‌ పెరిగింది. అన్నిటికన్నా ఈ బ్యాంక్‌ సెప్టెంబర్‌ ఫలితాలు బాగున్నాయి. బ్యాంక్‌ నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగి రూ. 3,011 కోట్లుగా నమోదైంది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం పెరగడంతో పాటు, బ్యాంక్‌ ఆస్తి నాణ్యత మెరుగుపడడంతో బ్యాంక్‌ లాభం పెరిగింది. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్స్‌లో 14 శాతం వాటను ఐపీఓ ద్వారా విక్రయించేందుకు బ్యాంక్‌ ప్రయత్నిస్తుందనే వార్తలు వెలువడ్డాయి. దీంతోకూడా  బ్యాంక్‌ షేరుపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. 

ఇన్ఫోసిస్‌
కొనుగోలు చేసింది: డీఎస్‌పీ ఎంఎఫ్‌; ప్రస్తుత ధర: రూ. 705
కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓలు గత కొన్ని త్రైమాసికాల నుంచి అనైతిక పద్ధతులను అనుసరిస్తున్నారని, కంపెనీ బోర్డుకు, ఎక్సేంజ్‌ బోర్డులకు గుర్తుతెలియని ఉద్యోగులు లేఖలు రాయడంతో ఇన్ఫోసిస్‌ షేరు ఒకే రోజులో 16 శాతం పడిపోయింది. ఇది గత ఆరేళ్లలో కంపెనీకి అతిపెద్ద ఒకే రోజు పతనం కావడం గమనార్హం. ఇన్ఫోసిస్‌ వాల్యుషన్‌ చౌకగా ఉండడంతో చాలా మంది ఫండ్‌ మేనేజర్లు ఈ షేరును తమ పోర్టుఫోలియోకి జోడిస్తున్నారు. 

యాక్సిస్‌ బ్యాంక్‌
కొనుగోలు చేసింది: ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌ ఎంఎఫ్‌; ప్రస్తుత ధర: రూ. 716
మేనేజ్‌మెంట్‌ మారడంతో బ్యాంక్‌ ఈల్డ్‌ మంచి వృద్ధి సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంక్‌ రిటైల్‌ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 23 శాతంగా నమోదైంది. దీంతో బ్యాంక్‌ రుణవృద్ధి, అడ్వాన్స్‌ల వృద్ధి రెండెంకల స్థాయిలో కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తి నాణ్యత, బ్యాలెన్స్‌ షీట్‌, ఆరోగ్యకరమైన మార్జిన్లకు సంబంధించి బ్యాంక్‌ దృష్ఠి సారించడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ వృద్ధి పథం బాగుందని అన్నారు.You may be interested

ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌పై అనలిస్టుల అంచనాలు

Friday 15th November 2019

నష్టాల్లోంచి లాభాల్లోకి మారిన  షేర్లు ఆరంభ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన వొడాఫోన్‌ ఐడియా, స్వల్పనష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించిన ఎయిర్‌టెల్‌ షేర్లు మధ్యాహ్న సమయానికి దాదాపు 7 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ షేర్లపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. = యూబీఎస్‌: ఎయిర్‌టెల్‌ షేరుకు కొనొచ్చు రేటింగ్‌ను రూ. 415 టార్గెట్‌ను ఇచ్చింది. షేరు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని తెలిపింది. ఏజీఆర్‌ లెక్కలు లేకుంటే ఫలితాలు బలంగా ఉన్నట్లేనని

పెరిగి..పడిన పసిడి

Friday 15th November 2019

క్రితం రాత్రి అమెరికా మార్కెట్లో 10డాలర్లు లాభపడిన పసిడి ఫ్యూచర్లలో నేటి ఉదయం లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 7.05 డాలర్లు నష్టపోయి 1,466.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి  అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలతో పసిడి ధర 10డాలర్లు పెరిగి 1,473  డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక నేడు ఆసియాలో ఔన్స్‌

Most from this category