News


విదేశీ బ్రోకరేజిలు టార్గెట్‌ పెంచిన షేర్లివే!

Thursday 31st October 2019
Markets_main1572505315.png-29260

సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి చాలా కంపెనీలు వాటి ఫలితాలను ప్రకటించాయి. ఫలితాలను ప్రకటించిన తర్వాత చాలా కంపెనీ టార్గెట్‌ ధరలను విదేశీ బ్రోకరేజిలు పెంచాయి.

 

 

 

టాప్‌ విదేశీ బ్రోకరేజిలు  టార్గెట్‌ ధరను పెంచిన టాప్‌ స్టాకులు:


బ్రోకరేజి: సిటీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,400 నుంచి 1,520 కు పెంచింది
సెప్టెంబర్‌ త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26.75 శాతం పెరిగి రూ. 6,345 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 5,005.73 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.89 శాతం పెరిగి రూ. 13,515.04 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా బ్యాంక్‌ రుణ వృద్ధి 19.5 శాతం పెరిగింది. ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనం అధికంగా ఉండడంతో ఆర్థిక సంవత్సరం 2020/21కి గాను ఈ బ్యాంక్‌  పాట్‌(పన్ను తర్వాత ఆదాయం) అంచనాలను 5%/7% కు విదేశీ బ్రోకరేజి సిటీ పెంచింది. అంతేకాకుండా స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి ఈ బ్యాంక్‌ ఆదాయం, లాభం అంచనాలకు అనుగుణంగా ఉందని, రుణ వృద్ధి క్రమంగా మెరుగుపడుతుందని ఈ బ్రోకరేజి తెలిపింది. 

 

బ్రోకరేజి: హెచ్‌ఎస్‌బీసీ
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,475 నుంచి రూ. 1,565 కు పెంచింది
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో అత్యధికంగా రూ. 11,262 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 11.46 శాతం, ఏడాది ప్రాతిపదికన 18.34 శాతం అధికం కావడం గమనార్హం. ఏకీకృత ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికంలో 3.63 శాతం పెరిగి రూ. 1,48,526 కోట్లకు చేరుకుంది. కానీ ఇది త్రైమాసిక ప్రాతిపదికన 5.4 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ బారెల్‌ 9.4 డాలర్లకు పెరిగింది. ఇది జూన్‌ త్రైమాసికంలో బారెల్‌కు 8.1 డాలర్లుగా ఉంది. ఇంధన వ్యాపారంలో బలహీనతలున్నప్పటికి, కంపెనీ ఇతర వ్యాపారాలు రాణించడంతో రిలయన్స్‌ ఫలితాలు బాగున్నాయని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడింది. రానున్న త్రైమాసికాలలో కంపెనీ బ్యాలెన్స్‌ షీటు మెరుగుపడి, ఆదాయాల దృక్పథం బలంగా ఉంటుందని ఈ బ్రోకరేజి ఆశిస్తోంది. 

 

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ
మారుతి సుజుకి: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: 7,950 నుంచి రూ. 9,000కు పెంచింది
మారుతి సుజుకి నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 39.4 శాతం తగ్గి రూ. 1,358 కోట్లుగా నమోదైంది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ .2,240.4 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ వాహనాల పరిమాణం 30 శాతం పడిపోవడంతో, ఆదాయం 24.3 శాతం తగ్గి రూ. 16,985.3 కోట్లుగా నమోదైంది. ఎబిట్డాకి ముందు ఏకీకృత ఆదాయం 53 శాతం తగ్గింది. కంపెనీ కమోడిటీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, వ్యవస్థలో డిమాండ్‌ పునరుద్ధరణ ప్రారంభమవ్వడంతో మారుతి సుజుకీ మార్జిన్లు మెరుగుపడతాయని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడుతోంది. అయినప్పటికి తక్కువ వాల్యుమ్‌లు లేదా మార్జిన్లు వలన ఆర్థిక సంవత్సరం 2020 ఈపీఎస్‌ అంచనాలను 7 శాతం మేర తగ్గించింది. కానీ ఆర్థిక సంవత్సరం 2021/22 అంచనాలను అలానే కొనసాగిస్తోంది. 

 

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ
బజాజ్‌ ఆటో: రేటింగ్‌: అమ్మొచ్చు; టార్గెట్‌ ధర: రూ. 2,525 నుంచి రూ. 2,800కు పెంచింది.
బజాజ్ ఆటో, సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో ఏడాది ప్రాతిపదికన నికర లాభంలో  21.7 శాతం  వృద్ధిని నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,152.5 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం, ఈ త్రైమాసికంలో రూ. 1,402.4 కోట్లకు చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ పన్ను వ్యయం రూ.500.2 కోట్ల నుంచి రూ. 206.5 కోట్లకు గణనీయంగా తగ్గింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.1 శాతం క్షీణించి, రూ. 7,707.3 కోట్లకు చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన వాల్యుమ్‌లు 12 శాతం తగ్గాయి. అధిక మార్జిన్లు ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం 2020-22గాను కంపనీ ఈపీఎస్‌ అంచనాలను 2-3 శాతం సీఎల్‌ఎస్‌ఏ నవీకరించింది. 18x ఆర్థిక సంవత్సరం 21 ఈ పీఈ వద్ద కంపెనీ స్టాక్‌ ఖరీదుగా ఉండగా, ఎగుమతి వృద్ధి రేటు కూడా తగ్గుముఖం పడుతోంది.

 

బ్రోకరేజి: నోమురా
లార్సెన్ అండ్‌ టూబ్రో (ఎల్ అండ్ టీ): రేటింగ్: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,725 ​నుంచి రూ. 1,730కి పెంచింది
సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎల్ అండ్ టీ ఏకీకృత నికర లాభం 13 శాతం పెరిగి రూ. 2,527 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ .35,328.4 కోట్లకు చేరుకుంది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ .30,678.13 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఎబిట్డా రూ .4,021.4 కోట్లుగా నమోదవ్వగా, ఎబిట్డా మార్జిన్ 11.4 శాతంగా ఉంది. దేశీయంగా ఆర్డర్లు పెరగడంతో ఆర్డర్ ఇన్‌ఫ్లో బలంగా ఉంది. అయినప్పటికీ కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ ఆందోళన కలిగిస్తోందని నోమురా తెలిపింది. ట్యాక్స్‌ తగ్గడంతో ఎల్‌ అండ్‌ టీ ఈపీఎస్‌ ఆర్థిక సంవత్సరం 2021-22కి గాను 12-14 శాతం పెంచింది.

 

బ్రోకరేజి: జేపీ మోర్గాన్‌
హీరో మోటర్‌కార్ప్‌: రేటింగ్‌: అండర్‌వెయిట్‌; టార్గెట్‌ ధర: రూ. 2,400 నుంచి రూ. 2,450కి పెంచింది.
హీరో మోటర్‌కార్ప్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో 10.4 శాతం క్షీణించి రూ. 874.8 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 976.3 కోట్లుగా ఉంది. మొత్తం పన్ను వ్యయం ఏడాది ప్రాతిపదికన 65.5 శాతం తగ్గి, ఈ త్రైమాసికంలో రూ .163 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వాల్యూమ్‌లు 20.7 శాతం తగ్గి 16.91 లక్షల యూనిట్లకు చేరుకోవడంతో కార్యకలాపాల ఆదాయం 16.7 శాతం తగ్గి రూ .7,570.7 కోట్లకు చేరుకుంది. బీఎస్‌ 6 వాహనాలకు మారుతుండడం, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితియార్ధంలో మార్జిన్లు నిలకడగా లేకపోవడంతో కంపెనీ వృద్ధి దృక్పథం బలహీనంగా ఉంది. కానీ కంపెనీ నవంబర్‌ నుంచి బీఎస్‌ 6 వాహనాల తయారి ప్రారంభిస్తుండడం, రికవరికి మంచి సంకేతమని ఈ బ్రోకరేజి తెలిపింది.

 

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ
జుబిలియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,655 నుంచి రూ. 1,850 కి పెంచింది
 ఒకేసారి రూ. 12.5 కోట్లు నష్టపోవడంతో, జుబిలియంట్ ఫుడ్‌వర్క్స్ ఏకికృత నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం క్షీణించి రూ. 73.4 కోట్లుగా నమోదైంది. కానీ ఏకీకృత ఆదాయం 12.2 శాతం పెరిగి రూ. 998 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ స్థాయిలో..ఎబిట్డా ఏడాది ప్రాతిపదికన  59.9 శాతం పెరిగి రూ. 234.1 కోట్లకు చేరుకోగా, మార్జిన్ 700 బీపీఎస్‌ పెరిగి 23.5 శాతానికి విస్తరించింది. స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికి, ఈ కంపెనీ స్టోర్‌ అమ్మకాలు 4.9 శాతం వద్ద సహేతుకంగానే ఉన్నాయని, ఈ కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను ఆర్థిక సంవత్సరం 2020కి గాను 3-5 శాతం​నవీకరించమని ఈ బ్రోకరేజి తెలిపింది. ఈ స్టాక్ సమీప కాలంలో అస్థిరంగా ఉండవచ్చని, ఏదైనా బలహీనత,ఈ షేరు కొనుగోలు చేయడానికి ఒక అవకాశమని ఈ బ్రోకరేజి తెలిపింది.

 


బ్రోకరేజి: జేపీ మోర్గాన్‌
యాక్సిస్‌ బ్యాంక్‌: రేటింగ్‌: న్యూట్రల్‌; టార్గెట్‌ ధర: రూ. 770 నుంచి రూ. 790 కి పెంచింది.
సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో, యాక్సిస్ బ్యాంక్ రూ. 112.1 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇది అంచనాల కంటే తక్కువకావడం గమనార్హం. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ రూ. 789.61 కోట్ల నికర లాభాన్ని ప్రకటించగా, జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ. 1,370.08 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పెరిగి రూ. 6,102 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎం) 3.51 శాతంగా నమోదైంది. ఇది గత తొమ్మిది త్రైమాసికాలలో కంటే అధికం కావడం గమనార్హం. బ్యాంక్‌ ఆపరేటింగ్ వృద్ధి బలంగా ఉందని జేపీ మోర్గాన్‌ తెలిపింది. అంతేకాకుండా ఈ బ్యాంక్‌ స్టాక్‌ రీరేటింగ్‌ జరగాలంటే బ్యాంక్‌ మొండి బకాయిలు ఖచ్చితంగా తగ్గాలని అభిప్రాయపడింది. ఆర్థిక సంవత్సరం 2020/21 ఈపీఎస్‌ అంచనాలను -10%/+5% గా నవీకరించింది.

 

బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ
కోటక్‌ మహింద్రా బ్యాంక్‌: రేటింగ్‌: న్యూట్రల్‌; టార్గెట్‌ ధర: రూ. 1,340 నుంచి రూ. 1,450 కు పెంచింది. 
కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 51 శాతం పెరిగి రూ. 1,724.5 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 1,141.65 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 25.2 శాతం పెరిగి రూ. 3,349.6 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 2,676.3 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4.61 శాతంగా ఉంది. పన్ను తగ్గడం వలన బ్యాంక్‌ లాభాలు, వడ్డీ మార్జిన్లలో మెరుగుదల కనిపిస్తోందని క్రెడిట్‌ సూసీ తెలిపింది.



You may be interested

యస్‌బ్యాంక్‌కు రూ. 8400 కోట్ల ఆఫర్‌...షేరు 35 శాతం జంప్‌

Thursday 31st October 2019

35 శాతం దూసుకుపోయిన షేరు ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ నుంచి వాటా కొనుగోలుకు సంబంధించి బైండింగ్‌ ఆఫర్‌ పొందామని యస్‌బ్యాంక్‌ ప్రకటించింది. తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ నుంచి 120 కోట్ల డాలర్ల(సుమారు రూ.8400 కోట్లు) పెట్టుబడులు పొందేందుకు బైండింగ్‌ ఆఫర్‌ సాధించామని వెల్లడించింది. సదరు గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ పేరును బ్యాంకు బహిర్గతం చేయలేదు. అయితే హాంకాంగ్‌కు చెందిన ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ సంస్థే ఈ ఇన్వెస్టరని,

కాగ్నిజంట్‌లో 12వేల ఉద్యోగాల కోత!

Thursday 31st October 2019

రాబోయే కొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7000 ఉద్యోగాలను తగ్గించుకుంటున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ తెలిపింది. దీంతో పాటు కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ వైదొలగడం కారణంగా మరో 6000 మంది ఉద్యోగాలు మాయం కానున్నాయి. వెరసి మొత్తం మీద త్వరలో కంపెనీ సుమారు 10- 12వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. మిడ్‌ నుంచి సీనియర్‌

Most from this category