News


ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ అంశాలు ఒక్కసారి...

Sunday 23rd June 2019
Markets_main1561314302.png-26507

స్టాక్‌ మార్కెట్లో కూడబెట్టుకోవాలన్నది ప్రతీ ఇన్వెస్టర్‌ సంకల్పం. అయితే, కష్టార్జితాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పులో పడేయలేం కదా... పెట్టుబడులను తుడిచిపెట్టేవి కాకుండా, మంచి రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. కనుక ఇన్వెస్ట్‌ చేసే ముందు తగినంత సాధన అవసరం. మరి ఓ మంచి కంపెనీని గుర్తించి పెట్టుబడులు పెట్టడం ఎలా..? అన్న సందేహం రావచ్చు. అందుకు నిపుణులు సూచిస్తున్న అంశాలు కొన్ని...

 

వ్యాపార నమూనా
ఓ కంపెనీ అసలు ఏ వ్యాపారం చేస్తుందన్నది ఇన్వెస్టర్‌ అర్థం చేసుకోగలగాలి. ఎలా సంపాదిస్తోంది? నగదు సమృద్ధిగా తెచ్చిపెట్టే వ్యాపారమేనా, కాదా? అన్నది పరిశీలించుకోవాలి. ఏ ఉత్పత్తులను తయారు చేస్తుంది లేక ఏ సేవలను అందిస్తుంది? వీటికి ఉన్న డిమాండ్‌? వీటి గురించి పరిశీలించిన తర్వాత మంచి కంపెనీయా, కాదా అన్న అంచనాకు రావాలి. ఉదాహరణకు అడెసివ్స్‌లో పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ గుత్తాధిపత్యం కలిగిన కంపెనీ. కారణం, వినూత్నమైన, నాణ్యమైన ఉత్పత్తులే.  

 

కార్పొరేట్‌ గవర్నెన్స్‌
కంపెనీ ఏ విధంగా నడుస్తోంది? అన్నది ముఖ్యం. కంపెనీ సిద్ధాంతాలు అన్నీ కూడా పెట్టుబడిదారుల కోణంలో సానుకూలమేనా? కంపెనీల చట్టం ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తోందా? ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఉన్నాయా? వీటన్నింటికీ సమాధానాలు రాబట్టుకోవాలి. అన్నింటికీ సానుకూలమే అన్న జవాబు లభిస్తే ఆ తర్వాత కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగ్గా ఉందా అని కూడా చూడాలి. ఉత్తమ కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు బజాజ్‌ గ్రూపు, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు ఉదాహరణలు.

 

యాజమాన్యం
కంపెనీ యాజమాన్యం సమర్థతలను కూడా చూడాలి. మేనేజ్‌మెంట్‌ క్రియాశీలంగా ఉంటుందా? మారే పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరిస్తోందా? ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందా? ఇన్వెస్టర్‌కు సానుకూలమైనదేనా? కంపెనీకి సంబంధిత వ్యాపారంలో లోతైన అవగాహన ఉందా? వీటికి కూడా సానుకూల సమాధానాలు వస్తే ఆ కంపెనీ పెట్టుబడులకు అర్హమైనదే. 

 

పోటీలో అనుకూలత
కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు కొందరే పోటీదారులు ఉన్నారా లేక చాలా మంది ఉన్నారా? దీర్ఘకాలం పాటు పోటీలో నిలిచే సత్తా కంపెనీకి ఉందా? కంపెనీకి ప్రత్యేకమైన స్థానం ఉందా? అన్నవి కూడా చూడాలి. 

 

పరిశ్రమ
పరిశ్రమ వృద్ధి రేటుకు అనుగుణంగానే కంపెనీ వృద్ధి గణాంకాలు కూడా ఉన్నాయా? పరిశ్రమ వృద్ధి రేటుకు మించి వృద్ధిని చూపించే కంపెనీ అయితే మంచిది. అందుకే ఈ రెండింటినీ గమనించాలి. 

 

వినియోగదారులు
కంపెనీకి ఎక్కువ మంది కస్టమర్లు ఉంటే రిస్క్‌ వైవిధ్యమైనట్టు. తన అమ్మకాల కోసం కేవలం కొంత మందిపైనే ఆధారపడితే ఆ వ్యాపారంలో భారీ రిస్క్‌ ఉన్నట్టు. అందుకే కంపెనీ వ్యాపారం బహుముఖమైనదేనా అన్నది చూడాలి. ఉదాహరణకు హిందుస్తాన్‌ యూనిలీవర్‌. 

 

పోటీ
కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంటే లాభాలు పరిమితమవుతాయి. అదే పరిశ్రమలో ఒకటికి మంచి కంపెనీలు పోటీ పడుతుంటే, మార్కెట్‌ వాటాను పెంచుకోవడం చాలా కష్టమవుతుంది. 

 

ఆర్థిక అంశాలు
ఆదాయం, క్యాష్‌ఫ్లో అన్నవి కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. కంపెనీ వ్యాపారం లాభదాయకంగా ఉందా, భవిష్యత్తుకు భరోసానిస్తుందా అన్నవి వీటి ద్వారా తెలుస్తుంది.You may be interested

ప్రస్తుత స్థాయిల్లో వీటిల్లో కొనుగోళ్లు?

Sunday 23rd June 2019

ఇన్వెస్టర్లు బలమైన మూలాలు కలిగిన స్టాక్స్‌, మంచి కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన బ్యాలన్స్‌ షీటు, సహేతుక వ్యా‍ల్యూషన్‌, మంచి వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలపై దృష్టి సారించొచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.    ‘‘నిఫ్టీ గత గురువారం పెరగడం రివకరీ ఆశలు కల్పించింది. అయితే, 11,800పైన

భిన్న దారుల్లో బంగారం-మెటల్స్‌

Sunday 23rd June 2019

బంగారం కూడా బేస్‌మెటల్స్‌లో ఒకటి. మరి  మిగిలిన లోహాల ధరలు కరెక్షన్‌లోనే ఉండగా, బంగారం మాత్రం నూతన గరిష్టాల దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఎందువల్ల...? దీనిపై మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా తన అభిప్రాయాలను తెలియజేశారు.   ‘‘నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2018 జనవరిలో 4,200 స్థాయిల్లో గరిష్టాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి ఏడాదిన్నరగా దిద్దుబాటు క్రమంలో ఉంది. గరిష్ట స్థాయిలను నమోదు చేసిన తర్వాత ఈ

Most from this category