News


మార్కెట్‌ భారీ పతనానికి కారణాలివే..!

Monday 6th January 2020
Markets_main1578293492.png-30702

ఇరాన్‌ అమెరికాల భౌగోళికల ఉద్రిక్తతలు మరింత ఉధృతం కావడంతో సోమవారం ఉదయం సెషన్‌లోనే దేశీయ స్టాక్‌మార్కెట్లో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 2శాతానికి పైగా పెరిగి 70డాలర్లకు చేరుకోవడం కూడా కూడా విక్రయాలకు మద్దతునిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 541 పాయింట్లు నష్టపోయి 41వేల మార్కు దిగువన 40,923 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో నిప్టీ సూచీ 164 పాయింట్లు పతనమైన 12100 స్థాయిని కోల్పోయి 12,062.85 వద్దకు దిగివచ్చింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.50శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.31శాతం క్షీణించాయి.

                                                మార్కెట్‌ భారీ పతనానికి కారణాలివే..!
అమెరికా - ఇరాన్‌ ఉద్రిక్తతలు:- 
అమెరికా - ఇరాన్‌ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దలాల్‌ స్ట్రీట్‌లో ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. అమెరికాపై ఇరాన్‌ ప్రతీకారదాడులకు క్షిపణులను సిద్ధం చేసుకుంటుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో తన దేశానికి చెందిన వ్యక్తులను గానీ, స్థావరాలను లక్ష్యంగా ఇరాన్‌ దాడికి పాల్పడితే ఊహించని రీతిలో దాడు చేస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరాన్‌ మిలీషియా నాయకుడు ఖాసీం సులేమానీ అమెరికా హత్య చేసిన నేపథ్యంలో తమ భూభాగం నుంచి అమెరికా సైన్యాన్ని పంపేయాలని ఇరాక్‌ పార్లమెంటు ఆదివారం నిర్ణయించింది. ఆ దేశ సైన్యాన్ని మోహరించేందుకు కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇరాక్‌లో వివిధ ప్రాంతాల్లో దాదాపు 5వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. 
 

భగ్గుమన్న క్రూడాయిల్‌ ధర:-

పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచదేశాలకు అత్యధికంగా క్రూడాయిల్‌ సరఫరా చేసే ఓపెక్‌ కూటమిలో రెండో స్థానంలో ఉన్న ఇరాన్‌ ఎగుమతులు స్తంభించడంతో క్రూడాయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో 9నెలల గరిష్టానికి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 2.76శాతం ఎగిసి 70.49డాలర్ల స్థాయికి చేరుకోగా, దేశీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 3.50శాతం ఎగిసి రూ.4,658ను తాకింది. ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ ఇంధన అవసరాలకు 80 శాతం వరకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ముడిచమురు ధరలు పెరగడంతో  ద్రవ్య లోటు మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళలు మార్కెట్‌ను వెంటాడాయి. 

72 స్థాయికి కరిగిపోయిన రూపాయి:- 

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 9నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి దిగివచ్చింది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి క్రితం ముగింపుతో పోలిస్తే 28పైసలు నష్టపోయి 72.08 వద్ద చేరుకుంది. రూపాయిలో తరుగుదల దిగుమతుల వ్యయాన్ని మరింత పెంచుతుంది. 

ప్రపంచమార్కెట్ల పతనం:- 

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా ప్రపంచమార్కెట్లు నష్టాల బాట పట్టాయి. నేడు ఆసియాలో అన్ని మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన మార్కెట్లైన చైనా, జపాన్‌ మార్కెట్లతో పాటు మిగిలిన అన్ని మార్కెట్లు అరశాతానికి పైగా క్షీణతను చవిచూసాయి. మరోవైపు అమెరికా ఫ్యూచర్లతో పాటు యూరప్‌ ఫ్యూచర్లు సైతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. 

మార్కెట్‌ కదలిక:- 
మార్కెట్లో ఒడిదుడుకులను చూసించే విఐఎక్స్‌ ఇండెక్స్‌ 12.50శాతం పెరిగింది. రూపాయి పతనంతో ఒక్క ఐటీ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా నిప్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది.  నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ అటో, నిఫ్టీ రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌లు 1శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లోని మొత్తం 30షేర్లలో టైటాన్‌ 2శాతం లాభపడింది. ఐటీరంగంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు ఎస్‌బీఐ షేర్లు అత్యధికంగా 3.03శాతం న, ఏషియన్‌ పేయింట్స్‌  2.50శాతం నష్టపోయింది. 



You may be interested

క్యు3లో లాభాలు పెరగొచ్చు!

Monday 6th January 2020

కంపెనీల ఫలితాలపై అంచనాలు నిఫ్టీ 50 కంపెనీల లాభాలు మూడో త్రైమాసికంలో పెరగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే బేస్‌ తగ్గడం, కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గడం, కొన్ని బ్యాంకులు, విత్త కంపెనీలు మంచి ప్రదర్శన చూపడం, మొండిపద్దుల కేటాయింపులు తగ్గడం.. క్యు3లో పాజిటివ్‌ ప్రభావం చూపుతాయంటున్నారు. డౌన్‌గ్రేడింగ్‌ల సీజన్‌ ముగిసిందని భావిస్తున్నా, వెనువెంటనే అప్‌గ్రేడ్స్‌ ఆరంభం కావని అభిప్రాయపడ్డారు. ఈటీ సర్వేలో నిఫ్టీ 50 కంపెనీ నికర లాభం

యాంఫీ రీజిగ్‌- ఈ మిడ్‌ క్యాప్స్‌ దారెటు?

Monday 6th January 2020

ఇన్ఫో ఎడ్జ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కన్సాయ్‌ నెరోలాక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ యస్‌ బ్యాంక్‌, కేడిలా హెల్త్‌కేర్‌ ఐబీ హౌసింగ్‌, వొడాఫోన్‌ ఐడియా దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ) తాజాగా మిడ్‌ క్యాప్‌ విభాగంలో కొన్ని మార్పులు చేపట్టింది. దీంతో లిస్టెడ్‌ మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొన్ని లార్జ్‌ క్యాప్‌ విభాగంలోకి చేరనుండగా.. మరికొన్ని లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌గా అవతరించనున్నాయి. దీంతో దేశీయంగా మ్యూచువల్‌ ఫం‍డ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడుల ప్రాధాన్యతలో ఇకపై కీలకమైన మార్పులు

Most from this category