News


ఈ ర్యాలీకి కారణాలేంటి?

Thursday 9th January 2020
Markets_main1578553601.png-30797

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ బలంగా 12150 పాయింట్లపైన 12190 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బుధవారం అమెరికా మార్కెట్లు బలంగా క్లోజవడం, గురువారం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ మార్కెట్లు కూడా బలమైన గ్యాప్‌ అప్‌తో ఓపెనయ్యాయి. అనంతరం వెనుకంజ వేయకుండా ముందుకే కొనసాగాయి. మార్కెట్లో ఇంత బలమైన ర్యాలీకి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు.
1. ఇరాన్‌ దాడులపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించకపోవడం: ఇరాక్‌లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్‌ జరిపిన దాడులను అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సీరియస్‌గా తీసుకోలేదు. తమ వైపు నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఎదురుదాడి ఉండదని చెప్పారు. ఇరాన్‌దాడుల్లో తమకెలాంటి నష్టం కలగలేదన్నారు. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తామని చెప్పారు. ఇరాన్‌ చర్చలకు రాదలుచుకుంటే తాము రెడీ అని ప్రకటించారు. ట్రంప్‌ స్పందనతో అమెరికా సహా ఇతర మార్కెట్లు ఊపిరి పీల్చుకొన్నాయి. దీంతో బుల్స్‌ చెలరేగారు.
2. చమురు ధరలు చల్లారడం: ఇరాన్‌ దాడులతో ఒక్కమారుగా 71 డాలర్లను తాకిన బ్రెంట్‌ క్రూడ్‌ వెనువెంటనే వెనుదిరిగింది. చివరకు గురువారం చమురు ధర నెగిటివ్‌గా ట్రేడవుతోంది. దీంతో దేశీయంగా విత్తలోటు భయాలు ఉపశమించాయి.
3. రూపీ రీబౌండ్‌: డాలర్‌తో రూపాయి మారకం విలువ 72 స్థాయిల నుంచి కోలుకుంది. గురువారం రూపీ 71.47 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. రూపాయి క్షీణతకు అడ్డుకట్ట పడడంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా స్పందించారు.
4. క్యు3పై అంచనాలు: ఈ దఫా కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా అద్భుతంగా ఉంటాయని ఎక్కువమంది అనలిస్టులు ఊహిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు మంచి ప్రదర్శన చూపుతాయని భావిస్తున్నారు. కార్పొరేట్‌ టాక్స్‌ కోత ప్రభావం ఈ దఫా ఫలితాలపై ఉంటుందంటున్నారు. ఈ అంచనాలతో దేశీయ ఈక్విటీలు పాజిటివ్‌గా స్పందించాయి. You may be interested

హెచ్‌ఎస్‌బీసీ నుంచి 3 అటో స్టాక్స్‌ రికమెండేషన్లు

Thursday 9th January 2020

ఈ ఏడాదిలో వాహనరంగాలకు డిమాండ్‌ పెరగకపోతే ఆటోమొబైల్ షేర్లు ఇన్వెస్టర్లకు ఆశించినస్థాయిలో ఆదాయాలను ఇవ్వడం అసాధ్యమని హెచ్‌ఎస్‌బీసీ బ్రోకరేజ్‌ సంస్థ అంటోంది. దేశీయ అటోరంగం 2019 ఏడాదిలో ఈ దశాబ్దంలో అతిపెద్ద గడ్డు పరిస్థితిని ఎదుర్కోంది. స్ధూల ఆర్థిక వ్యవస్థ బలహీనత, వ్యవస్థలో ద్రవ్య కొరత, పన్ను ఉద్దీపన చుట్టూ అనిశ్చితి, కఠినతరమైన నిబంధనలు డిమాండ్‌ను ప్రభావితం చేశాయని బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే ఈ ఏడాదిలో

సన్‌టెక్‌, ఐబీ హౌసింగ్‌.. జూమ్‌

Thursday 9th January 2020

సెన్సెక్స్‌ 530 పాయింట్లు అప్‌ 150 పాయింట్లు ఎగసిన నిఫ్టీ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 529 పాయింట్లు జంప్‌చేసింది. 41,347 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 153 పాయింట్లు ఎగసి 12,178కు చేరింది.

Most from this category