News


ఎస్సార్‌ కేసు పరిష్కారం..... ఎస్‌బీఐ,ఐసీఐసీఐ బ్యాంక్‌లపై సానుకూలం!

Monday 18th November 2019
Markets_main1574070579.png-29677

ఎస్సార్‌ స్టీల్‌కు సం‍బంధించి అక్టోబర్‌ 2018 రిజల్యూషన్‌ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో శుక్రవారం సెషన్‌లో ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు, సోమవారం సెషన్‌లో కూడా ఆ ర్యాలీ కొనసాగిస్తున్నాయి. ఈ తీర్పుతో ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి ఆర్సెలర్‌ మిట్టల్‌కు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పుతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అధికంగా లాభపడనున్నాయి. ఫలితంగా చాలా వరకు బ్రోకరేజిలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి.  ఈ తీర్పు వెలువడిన తర్వాత నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.3 శాతం పెరిగింది. ఇండెక్స్‌లోని జమ్ము అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 0.5 శాతం నుంచి 2 శాతం మధ్య పెరిగాయి. కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఏకంగా 16 శాతం పెరిగింది. గత సెషన్‌లో ఈ స్టాక్‌ 17 శాతం మేర లాభపడింది. 
    ఆర్‌బీఐ ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌)కి సిఫార్సు చేసిన 12 అతిపెద్ద మొండిబకాయిలలో(ఎన్‌పీఏ) ఎస్సార్‌ స్టీల్‌ ఒకటి. ఎన్‌సీఎల్‌టీ డాక్యుమెంట్లు పరంగా ఈ కేసులో ఫైనాన్సియల్‌ క్రెడటార్స్‌ రూ. 49,500 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివుండగా, ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌ రూ. 19,700 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. కాగా అక్టోబర్‌ 2018 రిజల్యూషన్‌ ప్రణాళిక ప్రకారం సెక్యుర్డ్‌ ఫైనాన్సియల్‌ క్రెడిటార్స్‌కు 92 శాతం(రూ. 42,000 కోట్లు) రికవరీ అవ్వనుండగా, ఆన్‌సెక్యుర్డ్‌(ఆపరేషనల్‌ క్రెడిటర్స్‌-ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు మొ.)కు 2-4 శాతం మాత్రమే రికవరీ కానుంది. ‘సుప్రీం కోర్టు తీర్పు వలన రెండు కీలకమైన  విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి ఆపరేషనల్‌ క్రెడిటార్స్‌ కంటే ఫైనాన్సియల్‌ క్రెడిటర్స్‌కు అధికప్రాధాన్యం ఇవ్వడమయితే, రెండవది రుణదాతల కమిటీ తయారి చేసిన పంపిణీ ప్రణాళికను ఎన్‌సీఎల్‌టీ ప్రశ్నించే అధికారం లేకపోవడం. ఈ రెండు అంశాల వలన భవిష్యత్తులో ఐబీసీ రిజల్యుషన్లపై సానుకూల ప్రభావం పడనుంది.‘ మేము కవరేజ్‌ చేస్తున్న బ్యాంకులలో అధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ లేదా యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా ఎస్‌బీఐల ఎన్‌పీఏ(మొండి బకాయిలు) రికవరి అధికంగా జరుగుతుంది. అందువలన వీటిపై పాజిటివ్‌గా ఉన్నాం’ అని జేఎం ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంకుల ఎన్‌పీఏలు కూడా తగ్గుతాయి. వీటితోపాటు ఈ ఎక్స్‌పోజర్‌పై బ్యాంకులు కలిగివున్నా ప్రోవిజన్‌ రేషియో పెరుగుతుంది. ‘బ్యాంకింగ్‌ సెక్టార్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మా ఎంపికలో ముందుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌పై సానుకూలంగా ఉన్నాం’ అని జేఎం ఫైనాన్సియల్‌ పేర్కొంది. 
   ఈ రిజల్యూషన్‌  సైకిల్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభపడనున్నాయని జేపీ మోర్గాన్‌ తెలిపింది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్‌ టార్గెట్‌ ధరను రూ. 560 కు ఈ బ్రోకరేజి పెంచింది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి 12 శాతం అప్‌సైడ్‌ కావడం గమనార్హం. అదేవిధంగా ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను కూడా రూ. 375 కు పెంచింది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి 16.5 శాతం అధికం.  సుప్రీం కోర్టు తీర్పు బ్యాంకులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, దీని వలన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు అధికంగా లాభపడనున్నాయని జపనీస్‌ బ్రోకరేజి నోమురా పేర్కొంది. ఈ తీర్పు వలన ఎస్‌బీఐ రుణం రూ. 12,000 కోట్ల వరకు తిరిగి రికవరి కానుంది. ‘ఎస్‌బీఐపై మేము కొనచ్చు రేటింగ్‌ను కొనసాగించి, రూ. 400 టార్గెట్‌ ధరను నిర్ణయించాం. ఇది ప్రస్తుత స్థాయి నుంచి 24 శాతం అధికం’ అని నోమురా తెలిపింది. అంతేకాకుండా సీటీ బ్రోకరేజి కూడా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఎస్సార్‌ స్టీల్‌పై ఎక్స్‌పోజర్‌ను కలిగివున్న ప్రభుత్వ రంగ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉంది. ఐబీసీ కింద ఉన్న మూడు కేసుల  నుంచి ఎస్‌బీఐ రూ. 17,000 కోట్ల రికవరీని అంచనావేసింది. ఈ మూడింటిలో ఎస్సార్‌ కేసు పెద్దది. 



You may be interested

సెన్సెక్స్‌ నష్టం 73 పాయింట్లు

Monday 18th November 2019

మార్కెట్‌ను ప్రభావితం చేయగలిగిన అంశాలేవి లేకపోవడంతో సోమవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 73 పాయింట్ల స్వల్ప నష్టంతో 40284 వద్ద, నిఫ్టీ 11 పాయింట్లను కోల్పోయి 11884 వద్ద స్థిరపడ్డాయి. అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, ఫార్మా, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వాటితో పాటు రియల్టీ, ఐటీ, మీడియా షేర్లు కూడా స్వల్పంగా ర్యాలీ చేశాయి.

మిడ్‌టర్మ్‌కు టాప్‌ 10 రికమండేషన్లు

Monday 18th November 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినందించే పదిషేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు.  రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ వికాస్‌ జైన్‌ సిఫార్సులు: 1. అంబుజా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 224. స్టాప్‌లాస్‌ రూ. 190. డైలీ చార్టుల్లో హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరిచింది. టర్నెరౌండ్‌కు రెడీగా ఉన్న సంకేతాలు ఇస్తోంది.  2. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 265. స్టాప్‌లాస్‌ రూ. 218. దిగువన బహుళస్థాయి మద్దతు పొంది పాజిటివ్‌ బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. కీలక

Most from this category