News


బ్యాంకుల నెత్తిన టెల్కోల పిడుగు!?

Friday 15th November 2019
Markets_main1573814907.png-29622

ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌కు భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు
ప్రభుత్వ సాయం అందకుంటే ఇక్కట్లేనంటున్న నిపుణులు
సుప్రీంకోర్టు తాజాతీర్పుతో ఏజీఆర్‌ రూపంలో టెలికం కంపెనీల నెత్తిన పడిన ఆర్థిక భారం అంతిమంగా బ్యాంకులను చుట్టుకోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏజీఆర్‌ తీర్పుతో క్యు2లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఉమ్మడిగా దాదాపు రూ. 74వేల కోట్ల నష్టం ప్రకటించాయి. దీంతో ఈ రెండిటికి అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి ఎలాఉంటుందోనన్న అనుమానాలు పెరిగాయి. ఈ రెండు కంపెనీలకు కలిపి ఎస్‌బీఐ అత్యధికంగా రూ. 37330 కోట్లు ఇచ్చింది. తర్వాత స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(రూ. 24515కోట్లు), యాక్సిస్‌ బ్యాంకు(రూ. 17135కోట్లు), బీఓబీ(రూ.11471 కోట్లు), పీఎన్‌బీ(రూ. 73168 కోట్లు) ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటిపై టెలికం కంపెనీల నష్టాల భారాన్ని పరోక్షంగా పడనుందని నిపుణుల అంచనా. ఒకపక్క దేశ జీడీపీ మందకొడిగా సాగుతున్న వేళ దేశ ఆర్థిక సంస్థలకు ఇలాంటి ఎదురుదెబ్బ తగిలితే మొత్తం ఎకానమీలోనే తీవ్ర ఆందోళనకర పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 
టెలికం కంపెనీలపై అనుమానాలు
టెలికం కంపెనీలు కావాలనే ఇంత మొత్తంలో నష్టాలు చూపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మేం మునిగితే మిమ్మల్ని కూడా ముంచుతాం అన్నరీతిలో సాయం చేయకుంటే దివాలాకు వెళతామని పరోక్ష బెదిరింపులు చేస్తున్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. అటు ఎయిర్‌టెల్‌, ఇటు వీఐఎల్‌ ప్రమోటర్లు కొత్తగా మూలధన సాయం అందించడానికి విముఖత చూపుతున్నారు. ఇది ఆయా కంపెనీల భవితవ్యంపై నీలినీడలు కమ్మేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వొడాఫోన్‌ ఐడియా ఇండియా ఎండీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఏజీఆర్‌ బకాయిలన్నీ చెల్లించాలని, ప్రభుత్వం సాయం అందించదని తేలితే దివాలాకు పోతామంటున్నారు. ఎయిర్‌టెల్‌ పరిస్థితి కొంత బాగున్నా, ఏజీఆర్‌ బకాయిలు చెల్లిస్తే ఆ కంపెనీ వద్ద కూడా ఏమీ మిగలదు. దీంతో ఏ బ్యాంకు కూడా కొత్త నిధులు ఇవ్వదు, ఇది అంతిమంగా కంపెనీ పనితీరునే దెబ్బతీస్తుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది. కానీ ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్దేశం కాకపోవచ్చని, నిజంగానే టెలికం కంపెనీలు ముఖ్యంగా వీఐఎల్‌ పరిస్థితి బాగాలేదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం వీటి విషయమై చర్చించేందుకు ప్రభుత్వం క్యాబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను బట్టి టెల్కోల భవితవ్యం తద్వారా బ్యాంకుల పరిస్థితి తేలనుంది. 



You may be interested

ఐటీ కంటే ఫార్మా సానుకూలం: భాసిన్‌

Friday 15th November 2019

ఐటీ కంటే ఫార్మా రంగం పట్ల సానుకూలతను వ్యక్త పరిచారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. ఫార్మా రంగంలో సన్‌ ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లను ఆయన సూచించారు. ఐటీ రంగంలో ఒక్క విప్రో షేరును మాత్రం తాను కొనుగోలు చేస్తానని పేర్కొన్నారు. పలు మార్కెట్‌ అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.    ఫార్మాలో వేటి పట్ల సానుకూలం? మూడు ‍స్టాక్స్‌పై అధిక

స్వల్ప లాభంతో సరి

Friday 15th November 2019

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ఐనప్పటికీ ఈ వారాంతపు రోజైన శుక్రవారాన్ని లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్లు లాభంతో 40,356.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,895 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 266 పాయింట్లు(0.87శాతం) ఎగిసి 31,016.50 వద్ద స్థిరపడింది. అలాగే ఫార్మా, ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్ల

Most from this category