News


లాంగ్‌ టర్మ్‌కు టాప్‌ 9 సిఫార్సులు

Tuesday 3rd December 2019
Markets_main1575357529.png-30025

దీర్ఘకాలానికి మంచి రాబడినిచ్చే తొమ్మిది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌
1. సన్‌ టెక్‌ రియల్టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 487. ఇటీవల ప్రారంభించిన అవెన్యూ4 టవర్స్‌తో వచ్చే మూడు నాలుగేళ్లలో దాదాపు రూ. 12-13 వందల కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో పాటు త్వరలో ఆరంభించబోయే అంధేరీ ప్రాజెక్ట్‌, నైగావ్‌ ఫేజ్‌2 ప్రాజెక్టులు కంపెనీ విక్రయాల్లో జోరును పెంచుతాయి.
మోతీలాల్‌ ఓస్వాల్‌ రికమండేషన్లు
1. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 130. కంపెనీ గ్రామీణ ఫైనాన్స్‌ బుక్‌ రెండున్నరేళ్లలో రెండున్నరెట్లు పెరిగింది. ఏఎంసీ వ్యాపార ఏయూఎంలో 44 శాతం సగటు చక్రీయ వార్షిక వృద్ది నమోదయింది. 2021-22 నాటికి లాభాలు రెండొందల కోట్ల డాలర్లను దాటవచ్చు. 
2. ఏజిస్‌ లాజిస్టిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 247. ప్రభుత్వం ఎల్‌పీజీ సరఫరా మరింత విస్తరించాలని యత్నించడం కంపెనీకి కలిసిరానుంది. కంపెనీ లాజిస్టిక్‌ ఎబిటా చక్రీయవార్షిక వృద్ధి 40 శాతం ఉంటుందని అంచనా. కంపెనీ ఫండింగ్‌ మొత్తం అంతర్గతంగా సమీకరించుకుంటోంది. రాబోయే రోజుల్లో 20 శాతం పైగా రిటర్న్‌ నిష్పత్తి ఉండొచ్చు.
3. అల్ట్రాటెక్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 5050. మూడు నెలలుగా ప్రధాన సూచీలతో పోలిస్తే పేలవ ప్రదర్శన చూపింది. సిమెంట్‌ డిమాండ్‌ తగ్గడం, సెంచరీ సిమెంట్స్‌ విభాగం అంతంత మాత్రంగా ఫలితాలివ్వడం షేరుపై ‍ప్రభావం చూపాయి. అయితే రాబోయే రోజుల్లో పెద్దగా మూలధన అవసరాలు లేకపోవడం, బలమైన నగదు నిల్వలు ఉత్పత్తి చేయగల సత్తా ఉండడంతో ఆర్‌ఓఈ 550 బీపీఎస్‌ మేర మెరుగుపడగలదు. ఎనర్జీ, రవాణా వ్యయాలు తగ్గడం కలిసిరానుంది. 
4. టాటామోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 195. రాబోయే రోజుల్లో జేఎల్‌ఆర్‌ వాల్యూంలు స్థిరీకరణ చెందుతాయి. ఆపై సంవత్సరాల్లో జేఎల్‌ఆర్‌ వాల్యూంలు 5 శాతం మేర చక్రీయవార్షిక వృద్ది నమోదు చేయగలవు.
కోటక్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌
1. ఇంజనీర్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 130. స్టాకు తన కోర్‌ఎర్నింగ్స్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉంది. ఎబిటా మార్జిన్‌లో మంచి మెరుగుదల ఉంటుందన్న అంచనాలున్నాయి. తాజా ఆర్థిక సంవత్సరాంతానికి కొత్త ఆర్డర్లు రూ. 1800 కోట్ల వరకు ఉండొచ్చు. 
ఎస్‌పీఏ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌
1. ఎస్కార్ట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 784. వ్యవసాయోత్పత్తుల విభాగంలో రికవరీ కనిపిస్తోంది. నిర్మాణ ఉత్పత్తుల విభాగంలో కూడా వాల్యూం మెరుగుదల నమోదవుతోంది. కంపెనీ రెవెన్యూ, ఎబిటాల్లో వరుసగా 9.3, 5.7 శాతం చక్రీయవార్షిక వృద్ధి ఉంటుందని అంచనా.
జియోజిత్‌ రికమండేషన్‌
1. మిండా ఇండస్ట్రీస్‌: అక్యుములేట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 388. కంపెనీ రెవెన్యూ, లాభాల్లో 4 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా. కంపెనీ కొత్త ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. బీఎస్‌6 నిబంధనల అమలు కలిసిరానుంది. 
సీడీ ఈక్విసెర్చ్‌ రికమండేషన్‌
1. దీపక్‌ నైట్రేట్‌: అక్యుములేట్‌ రేటింగ్‌, టార్గెట్‌ రూ. 396. కంపెనీ వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉనానయి. కంపెనీ తన బేస్‌ కెమికల్స్‌ సామర్ధా‍్యన్ని 20 శాతం మేర పెంచుకునే యోచనలో ఉంది. ప్రథమార్దంలో మంచి మార్జిన్లు నమోదు చేసింది. ద్వితీయార్ధంలో కూడా ఇదే ధోరణి కొనసాగించే అవకాశాలున్నాయి. You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 3rd December 2019

బ్రెజిల్‌, అర్జెంటీనాల ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను పునరుద్ధరించనున్నట్లు ట్రంప్‌ ప్రకటనతో మంగళవారం మెటల్‌ షేర్లు  అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో దాదాపు 3శాతం నష్టపోయింది. ‘‘బ్రెజిల్‌, అర్జెంటీనాలు డాలర్‌ మారకంలో తన దేశపు కరెన్సీ విలువను భారీగా క్షీణింపజేసుకుంటున్నాయి. తద్వారా ఈ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అమెరికా రైతులకు భారీ నష్టాలను

టార్గెట్‌ తగ్గించిన యూబీఎస్‌: టాటా స్టీల్‌ 4శాతం డౌన్‌

Tuesday 3rd December 2019

టాటా స్టీల్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 4శాతానికి నష్టపోయింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ యూఎస్‌బీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.418.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యూబీఎస్‌ ఈ షేరు రేటింగ్‌ను ‘‘బై’’ నుంచి ‘‘సెల్‌’’కు సవరించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.675 నుంచి రూ.360లకు తగ్గించింది. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో షేరు ఒకదశలో 4.14శాతం నుంచి రూ.403.35 పతనమైంది.

Most from this category