News


ఈ ఐదూ ఫలరాజాలు!

Tuesday 28th May 2019
Markets_main1558984518.png-25944

సమీప కాలంలో నిఫ్టీ, సెన్సెక్స్‌ కీలక స్థాయిల వద్ద సానుకూలంగా చలించొచ్చని, నిర్ణయాత్మక అప్‌మూవ్‌ మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చని రెలిగేర్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ పేర్కొన్నారు. స్టాక్‌ వారీగా ట్రేడింగ్‌, పెట్టుబడుల విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్‌డీఏ అద్భుత విజయం, స్పష్టమైన మెజారిటీ అన్నది కీలకమైన విధానాలు, సంస్కరణల విషయంలో ప్రభుత్వం తన దృష్టి కొనసాగించేందుకు వీలుంటుందన్నారు. ద్రవ్య, ఆర్థిక పరిస్థితుల మెరుగునకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. సమీప కాలంలో కార్పొరేట్‌ ఫలితాలు, అంతర్జాతీయ అనిశ్చితి, గరిష్ట విలువలు కొంత అస్థిరతకు, కరెక్షన్‌కు అవకాశం కల్పించే విధంగా ఉన్నాయన్నారు. దీర్ఘకాలానికి మాత్రం భారత మార్కెట్లు సానుకూల స్థితిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2-3 ఏళ్ల కాలానికి మిడ్‌, స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులను పరిశీలించొచ్చన్నారు. ఎర్నింగ్స్‌ అవకాశాలు మెరుగుపడి, బలమైన బ్యాలన్స్‌ షీటు, మంచి యాజమాన్యం కలిగిన కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. దీర్ఘకాలానికి మంచి లాభాలకు అవకాశం ఉన్న ఐదు కంపెనీలను ఆయన సిఫారసు చేశారు.

 

డాబర్‌ ఇండియా
ఆయుర్వేద మార్కెట్‌ ఏటా 16 శాతం చొప్పున 2021 వరకు వృద్ధి చెందగలదు. ప్రముఖ ఆయుర్వేద, సహజ ఉత్పత్తుల కంపెనీ అయిన డాబర్‌ పెరుగుతున్న డిమాండ్‌ను, అవకాశాలను సొంతం చేసుకునే మంచి స్థితిలో ఉంది. అన్ని విభాగాల్లో వినూత్నమైన ఉత్పత్తులు, భౌగోళికంగా తన కార్యకలాపాలను భిన్న ప్రాంతాలకు విస్తరించుకోవడం సానుకూలతలు. బలమైన ఉత్పత్తులపై పెట్టుబడులను పెంచుకోవడం, డిజిటల్‌ వేదికలపై ప్రచారాన్ని పెంచుకోవడం, అన్ని విభాగాల్లో ఉత్పత్తుల పరంగా నవ్యత అన్నవి కంపెనీ షేరును ముందుకు తీసుకెళ్లే సానుకూల అంశాలు. 

 

గోద్రేజ్‌ కన్జ్యూమర్‌
గత మూడు త్రైమాసికాలుగా గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ పనితీరు స్తబ్ధుగా ఉంది. బ్రాండ్ల బలోపేతానికి చర్యలు, ఉత్పత్తుల్లో కొత్తదనం కోసం కంపెనీ తీసుకునే చర్యలు, పుంజుకునే డిమాండ్‌తో దేశీయ విక్రయాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నాం. దీనికి అదనంగా నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, బలమైన మార్కెటింగ్‌ విధానాలు, విదేశీ వ్యాపారం క్రమంగా రికవరీ అవడం సానుకూలతలు. ఇటీవలి కరెక్షన్‌తో స్టాక్‌లో ప్రవేశించడానికి ఇది సరైన సమయం.

 

మారుతి సుజుకీ ఇండియా
కరెన్సీ పరంగా సమస్యలు సులభతరం కావడం, ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్లో, గ్రామీణ మార్కెట్లలో బలంగా ఉండడం వంటి అంశాలతో దీర్ఘకాలానికి సానుకూలతతో ఉన్నాం. తక్కువ వడ్డీ రేట్లు ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌కు మంచి ప్రోత్సాహకరం. అమ్మకాలు పెరుగుతాయి. ఇటీవలి ఆర్థిక పనితీరు స్టాక్‌లో ఇప్పటికే ప్రతిఫలించింది. కనుక ప్రస్తుత ధర వద్ద ఈ స్టాక్‌ ఆకర్షణీయంగా ఉంది.

 

కమిన్స్‌ ఇండియా
ఇంజన్లు, పవర్‌ జనరేషన్‌ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపెనీ. ఇటీవలి త్రైమాసికాల్లో దేశీయ మార్కెట్లో బలమైన పనితీరు చూపించింది. అన్ని రకాల ఇన్‌ఫ్రా విభాగాల్లో డిమాండ్‌ పుంజుకోవడం, అలాగే, రైలు, మెరైన్‌ విస్తరణ, డేటా సెంటర్ల నుంచి డిమాండ్‌ దేశీయ వృద్ధి అవకాశాలను పెంచుతుంది. ఉత్పత్తుల పెంపు కోసం పెట్టుబడులు, మార్కెట్‌ వాటా బలపడడం వృద్ధికి ప్రేరణనిచ్చేవి. 

 

ఇంద్రప్రస్థ గ్యాస్‌
నెట్‌వర్క్‌ విస్తరణ, సీఎన్‌జీకి కన్వర్షన్‌ పెరగడం వంటి అంశాలతో కంపెనీ ఆదాయం, లాభాలు వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. గ్యాస్‌ పంపిణీ, సిటీ గ్యాస్‌ డిస్టి‍్రబ్యూషన్‌ విభాగంలో కొత్త ప్రాంతాల అవార్డుల ద్వారా కంపెనీ ప్రయోజనం పొందనుంది. You may be interested

లాభాల ప్రారంభం

Tuesday 28th May 2019

లోక్‌సభ ఎన్నికల్లో మార్కెట్‌ అంచనాల్ని మించి బీజేపీ విజయం సాధించడంతో గతవారం మార్కెట్లో మొదలైన ర్యాలీ మంగళవారం ప్రారంభసమయంలో కూడా కొనసాగింది. 70 పాయింట్లకుపైగా లాభంతో 39,750 పాయింట్ల పైన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 15 పాయింట్ల లాభంతో 11,940 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అదాని పోర్ట్స్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హిందాల్కోలు 1-2 శాతం పెరగ్గా, జీ టెలి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌లు 1

మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ... రెడీ!

Tuesday 28th May 2019

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు మెరుగైన పనితీరు చూపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వివేక్‌ రాజన్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మార్కెట్లో విస్తృతమైన ర్యాలీ (అన్ని విభాగాల స్టాక్స్‌) ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తద్వారా నూతన గరిష్టాలను మార్కెట్‌ సూచీలు నమోదు చేస్తాయని, ఆ తర్వాత కొంత ఉపశమనం తీసుకోవచ్చన్నారు. ఒకటి నుంచి రెండు త్రైమాసికాల

Most from this category