News


నెలరోజులకు టాప్‌-5 స్టాక్‌ సిఫార్సులు

Friday 21st February 2020
Markets_main1582269804.png-31984

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో గత కొన్ని వారాలుగా అనిశ్చతి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నెలరోజుల కాలానికి కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం...

బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌
షేరు పేరు: యూపీఎల్‌
ప్రస్తుత ధర: రూ.584 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.704.00
కాలపరిమితి: 1నెల
విశ్లేషణ: విదేశాల్లో  సబార్డినేటెడ్ క్యాపిటల్ సెక్యూరిటీల జారీ ఇష్యూ ద్వారా యూపీఎల్‌ తన మొత్తం నికరరుణాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సంస్థ కనీసం కనీసం 550 మిలియన్‌ డాలర్లను సేకరిస్తుందని అంచనా.

బ్రోకరేజ్‌ సంస్థ: ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌
షేరు పేరు: ఐసీఐసీఐ బ్యాంక్‌
ప్రస్తుత ధర: రూ.547 
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.630.00
కాలపరిమితి: 1నెల
విశ్లేషణ: పెద్ద రుణగ్రహీలు తక్కువగా రుణాలు తీసుకోవడం, రీటైల్‌ రుణాలు క్రమంగా పెరగడం, మెరుగైన రేటింగ్‌ కలిగిన కార్పోరేట్‌ కంపెనీలకు రుణాలు ఇవ్వడం లాంటి అంశాలతో బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌ బలోపేతం కావడం షేరు ర్యాలీకి తోడ్పాటునిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు బలమైన రుణ వృద్ధిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని బ్రోకరేజ్‌ సం‍స్థ పేర్కోంది.

బ్రోకరేజ్‌ సంస్థ: యాక్సిస్‌ బ్యాంక్‌ సెక్యూరిటీస్‌
షేరు పేరు: ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌
ప్రస్తుత ధర: రూ.2114.30
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.2370.00
కాల పరిమితి: 1నెల
విశ్లేషణ: ఉక్కు ధరలకు అనుగుణంగా ముందుకు సాగే ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌... ఉక్కు ధరలు అదుపులో ఉండటం సానుకూలాంశమని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనే కంపెనీ వ్యూహం మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంతో పాటు మీడియం నుండి దీర్ఘకాలిక లబ్ది పొందడానికి సహాయపడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ పేర్కోంది.

బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్కే
షేరు పేరు: జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ హిస్సార్‌
ప్రస్తుత ధర: రూ.72.20(ఫిబ్రవరి 21నాటికి)
రేటింగ్‌: హోల్డింగ్‌
టార్గెట్‌​ ధర: రూ.79.00
కాల పరిమితి: 1నెల
విశ్లేషణ: కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావంతో చైనాలో ఉక్కు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. చైనా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించి అక్కడి ఉత్పత్తి తిరిగి పుంజుకొని కమోడీటీలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగినపుడు మాత్రమే షేరులో తిరిగి మూమెంటం కనిపిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది.

బ్రోకరేజ్‌ సంస్థ: ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌
షేరు పేరు: ఎస్‌బీఐ
ప్రస్తుత ధర: రూ.327.65(ఫిబ్రవరి 21నాటికి)
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.404.00
కాల పరిమితి: 1నెల
విశ్లేషణ: అధిక స్లిపేజ్‌, రుణ వ్యయ గైడైల్స్‌లున్నప్పటికీ... ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి రికార్డు స్థాయిలో లాభదాయకతను నమోదు చేస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. లోయర్‌ ఎంప్లాయ్‌ ప్రొవిజన్స్‌, అధిక ఉద్యోగుల రాజీనామా, స్థిరమైన బ్యాంచ్‌ హెచ్‌కౌంట్‌, డిజిటిలైజేషన్‌, ఉన్నతస్థాయిలో సాంకేతిక పెట్టుబడులు, ఉద్యోగుల నియామకంపై ఖర్చు ఆదా తదితర అంశాలతో గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన వ్యయ నిష్పత్తులను 55.7శాతం ఆర్థిక సంవత్సరం 22నాటికి 50.9 శాతానికి తగ్గించగలదని బ్రోకేరేజ్‌ సంస్థ భావిస్తుంది. You may be interested

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ ఐపీఓ ఆఫర్‌ ధర రూ.750-755..?

Friday 21st February 2020

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)లో ఆఫర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.750నుంచి 755గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,500 కోట్లను సమీకరించనుంది. కాగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ మార్చి2న ప్రారంభమై మార్చి 5న ముగియనుంది. ఆఫర్‌ ముగిసిన తరువాత నాల్గోరోజు ప్రత్యేకంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్క్‌ ఇన్వెస్టర్లు, ఎస్‌బీఐ

నేను నంబర్‌ 1, మోదీ నంబర్‌ 2..డోనాల్డ్‌ ట్రంప్‌!

Friday 21st February 2020

ఫేస్‌బుక్‌లో తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నానని, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తర్వాత రెండో స్థానంలో ఉన్నారని అమెరికా అధక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. లాస్‌వేగాస్‌లో జరిగిన హోప్‌ ఫర్‌ ప్రిసనర్స్‌ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. ఫేస్‌బుక్‌లో తనని ఫాలో అవుతున్న యూజర్ల సంఖ్యను బట్టి తాను నంబర్‌ 1 స్థానంలో ఉన్నట్లు ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌ స్వయంగా తనతో

Most from this category