News


ఏడాది కాలానికి ఈ షేర్లు కొనొచ్చు

Thursday 5th March 2020
Markets_main1583402449.png-32305

వివిధ బ్రోకరేజ్‌ సంస్థ నుంచి ఏడాది కాలానికి టాప్‌-5 రికమెండేషన్లు ఇవి..!

1.బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే రికమెండేషన్స్‌
షేరు పేరు: గెయిల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ.160
కాలపరిమితి: ఏడాది 
విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంఏటీ క్రిడెట్స్‌, ఇతర ప్రయోజనాల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేకపోయింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా క్రూడాయిల్‌ ధరలు ధీర్ఘాకాలికంగా కొనసాగినట్లైతే... స్వల్పకాలం పాటు ఆదాయాలు క్షీణించవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతోంది.

2. బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
షేరు పేరు: ఐషర్‌ మోటర్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ.25,350
కాలపరిమితి: ఏడాది కాలం
విశ్లేషణ: చైనా నుంచి విడిభాగాల సరఫరా అంతరాయం కలగడంతో బీఎస్‌ -6 ఉత్పత్తిని పెంచింది. ఇది బిల్లింగ్‌ వ్యాల్యూమ్స్‌ క్షీణతకు దారి తీసింది. కంపెనీ ట్రాక్టర్స్‌ ఫిబ్రవరిలో అంచనాలకు మించి అమ్ముడుపోయాయి. 

3. బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
షేరు పేరు: ఇమామి
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌: రూ.310
కాలపరిమితి: ఏడాది కాలం
విశ్లేషణ: మోతీలాల్ ఓస్వాల్‌ నివేదిక ప్రకారం డిసెంబర్ త్రైమాసికపు ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో డిమాం‍డ్‌ బలహీనపడింది. ఇప్పటికీ డిమాండ్‌ పుంజుకోలేదు. ముడిపదార్థాల ధరల దిగిరావడంతో పాటు రబీ సీజన్‌ సందర్భంగా డిమాండ్, ఉత్పత్తి ఊపందుకోవడం కలిసొస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

4. బ్రోకరేజ్‌ సం‍స్థ: ఎమ్‌కే రికమెండేషన్స్‌
షేరు పేరు: అశోక్‌ లేలాండ్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ.112
కాలపరిమితి: ఏడాది 
విశ్లేషణ: రవాణ సంస్థల పొదుపు చర్యల కారణంగా వాహన అమ్మకాలు తగ్గాయి. డీలర్లు, ఆర్థిక సమస్యలతో ఇన్వెంటరీల్లో కరెక‌్షన్‌ ఏర్పడింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో అశోక్‌ లేలాండ్‌ వ్యాల్యూమ్స్‌ క్రమంగా తగ్గతూనే ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో వాణిజ్య వాహన అమ్మకాలు పెరుగుతాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.

5. బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
షేరు పేరు: సిప్లా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ధర: రూ. 421.35
కాలపరిమితి: ఏడాది కాలం
విశ్లేషణ: సిప్లా తన దేశీయ వ్యాపారలన్నింటినీ ఏకీకృతం చేయనుంది. సిప్లా ఈ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తే పంపిణీ చైన్‌ మరింత బలపడుతుంది. ఫలితంగా కంపెనీ వ్యాల్యూమ్‌ వృద్ధి జరగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. You may be interested

వచ్చే మార్చికల్లా 13500కు నిఫ్టీ!

Thursday 5th March 2020

కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ చర్యలతో కరోనాకు చెక్‌ విదేశీ పెట్టుబడులకు ధీటుగా దేశీ సిప్స్‌ కొటక్‌ సెక్యూరిటీస్‌ తాజా అంచనా ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​మరింత బలహీనపడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. అయితే వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మార్కెట్లు బాటమవుట్‌ అయ్యే అవకాశమున్నదని అభిప్రాయపడింది. కొటక్‌ సెక్యూరిటీస్‌ నివేదికలోని ఇతర అంశాలు

పిడిలైట్‌ రికార్డ్‌- ఇండియన్‌ హోటల్స్‌ వీక్‌

Thursday 5th March 2020

సరికొత్త గరిష్టానికి పిడిలైట్‌ 3 నెలల్లో 26 శాతం ప్లస్‌ ఇండియన్‌ హోటల్స్‌ వారం రోజుల్లో 18 శాతం డౌన్‌ గత మూడు నెలలుగా లాభాల బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్‌ కంపెనీ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క ఇటీవల నేలచూపులతో కదులుతున్న తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ కౌంటర్‌ తాజాగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో

Most from this category