News


6 నెలల కాలానికి టాప్‌ సిఫార్సులు

Saturday 18th January 2020
Markets_main1579341584.png-31020

కేంద్ర ప్రభుత్వం మరో 12 రోజుల్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రభావంతో స్టాక్‌మార్కెట్లో సూచీలు స్వల్పకాలం(3నెలల పాటు)లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ బ్రోకరేజ్‌ సం‍స్థలు 6 నెలల కాలానికి 5 షేర్లను సిఫార్సు చేస్తున్నాయి.

1.షేరు పేరు:- కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌:- కొనవచ్చు
షేరు ప్రస్తుత ధర:- రూ.588.70
టార్గెట్‌ ధర:- రూ.677.00
కాలపరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ మెరుగైన పనితీరును కనబరిచింది.  వర్షపాతం ఆశించినస్థాయిలో నమోదుకావడం, ముడిచమురు ధరలు దిగిరావడం,  కొత్త పాస్ఫారిక్ యాసిడ్ ప్లాంట్ ప్రారంభించడంతో తద్వారా వ్యయాన్ని ఆదా చేసుకోవడం లాంటి కారణాలతో ద్వితీయార్థంలోనూ అదే మూమెంటమ్‌ను కనబరుస్తుందని మోతీలాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడుతుంది.

2.షేరు పేరు:- ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
బ్రోకరేజ్‌ సంస్థ:- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత షేరు ధర:- రూ.1352.55
టార్గెట్‌ ధర:- రూ.1990.00
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- పెరిగిన స్లిపేజ్‌లు, కేటాయింపులు తదితర కారణాల తో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆస్తుల మీద  ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అయితే ఇప్పటికే ఈ ఒత్తిళ్లు బ్యాంక్‌పై ప్రభావాన్ని చూపాయి. దీంతో గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది.


3.షేరు పేరు:- భారతీ ఎయిర్‌టెల్‌
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌ 
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత ధర:- రూ500.00
టార్గెట్‌ ధర:- రూ.575.00
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- భారతీ ఎయిర్‌టెల్‌

 

2019-20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఉచిత నగదు ప్రవాహ విరామానికి చేరుకుంది.  నగదు ప్రవాహం రానున్న ఒకటి రెండేళ్లలో డెట్‌ టు ఇబిటా రేషియో నిష్పత్తిని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయడుతుంది.

4. షేరు పేరు:- నెస్కో లిమిటెడ్‌
బ్రోకరేజ్‌ సంస్థ:- నిర్మల్‌బంగ్‌
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత ధర:- రూ.706.45
టార్గెట్‌ ధర:- రూ.711.65
కాల పరిమితి:- 6నెలలు
విశ్లేషణ:- కంపెనీకి ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీట్ కలిసొచ్చే అంశం. స్థిరమైన సానుకూల ఉచిత నగదు ప్రవాహం, రాబోయే 20 ఏళ్లల్లో వృద్ధి-ఆధారిత అంశాలపై యాజమాన్య దృష్టి కంపెనీకి కలిసొచ్చే అంశాలు బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది.

5.షేరు పేరు:- ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ 
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత ధర:- రూ.1900.45
టార్గెట్‌ ధర:- రూ.1899.70
కాల పరిమితి:- 6 నెలలు
విశ్లేషణ:- క్యూ3లో ప్రకటించిన మెరుగైన ఫలితాలతో క్యాలెండర్ సంవత్సరం 2019 మొదటి తొమ్మిది నెలల్లో కంపెనీ ఎదుర్కొంటున్న క్లయింట్-నిర్దిష్ట సమస్యలు తీరాయని తెలుస్తోంది. సంస్థ నుంచి వలసలు పెద్దగా లేకపోవడం కూడా కలిసొచ్చే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. You may be interested

ఇది ప్రీబడ్జెట్‌ ర్యాలీ ; నాయర్‌

Saturday 18th January 2020

ప్రభుత్వ చర్యలు, కంపెనీల ఆర్జనలపై అంచనాల ఎఫెక్ట్‌ వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట ప్రీబడ్జెట్‌ ర్యాలీ నెలకొన్నట్లు మార్కెట్‌ నిపుణులు వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. మందగమనం‍లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్ను, పారిశ్రామిక రంగానికి మద్దతు, వినియోగాన్ని పెంచే గ్రామీణ ఆదాయాల పెంపు తదితర చర్యలను 2020 బడ్జెట్‌లో మార్కెట్లు ఆశిస్తున్నట్లు తెలియజేశారు. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌

టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌ షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా?

Saturday 18th January 2020

దిగ్గజ కంపెనీల ఫలితాలపై ప్రభావం ఇలా... శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో గడిచిన వారం ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దీంతో ఇకపై మార్కెట్‌ కొంతమేర కన్సాలిడేట్‌ కావచ్చు. లార్జ్‌క్యాప్స్‌లో ఈ ప్రభావం కనిపించే వీలుంది. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ప్రారంభమైన ర్యాలీ కొనసాగవచ్చని భావిస్తున్నామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా. ఒక ఇంటర్వ్యూలో మెహతా వెల్లడించిన

Most from this category