News


క్రెడిట్‌ సూసీ నుంచి టాప్‌-5 రికమెండేషన్లు

Saturday 23rd November 2019
Markets_main1574506012.png-29817

నాన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ సంక్షోభం, క్షీణిస్తున్న వినియోగంతో పాటు ఇతరేతర కారణాలతో దేశీయ ఆర్థిక  తొలి త్రైమాసికంలో వ్యవస్థను మందగించింది. క్యూ1లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అయినప్పటికీ అం‍తర్జాతీయ బ్రోకరేజ్‌ సం‍స్థ క్రిడిట్‌ సూసీ ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూలంగా దృక్పథాన్ని కలిగి వుంది. బ్రోకరేజ్‌ సంస్థ ప్రకారం... ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా క్షీణించడటమనేది ‍ప్రధాన సమస్య అయితే...ప్రధాన ద్రవ్యోల్బణం 3శాతంగా ఉండటం, ప్రభుత్వ రుణం జీడీపీలో 69 శాతం ఉండటం ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చే అంశాలని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. దేశంలో పోటీతత్వం పెరిగింది. 2014 నుంచి వరల్డ్‌ బ్యాంక్‌ ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంక్‌లో 79సాన్థాలను మెరుగుపరుచుకుంది. కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో సుస్థితర ఏర్పాటు చేయడంతో గతంలో కన్నా సాహసోపేతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కలిసొచ్చే అంశాలుగా బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. 

ఈ క్రమంలో బ్రోకరేజ్‌ సంస్థ 5 షేర్లను రికమెండ్‌ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌ గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్లున్నాయి. రానున్న రోజుల్లో 10-45శాతం పొటెన్షియల్‌ అప్‌సైడ్‌ ట్రెండ్‌కు ర్యాలీ చేసే అవకాశం ఉన్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. 

క్రిడెట్‌ శాష్యూ నుంచి టాప్‌-5 షేరు రికమెండేషన్లు 

స్టాక్‌పేరు టార్గెట్‌ ధర పొటెన్షియల్‌ అప్‌సైడ్‌(శాతాల్లో..)
ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.525 5.85
ఎస్‌బీఐ  రూ.370 12.50
ఎల్‌అండ్‌టీ రూ.1750 27
పవర్‌గ్రిడ్‌ రూ.250     26.26
ఎన్‌టీపీసీ రూ.170 45.30

 



You may be interested

వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం

Monday 25th November 2019

విదేశీ పెట్టుబడుల ప్రవాహం నవంబర్ సిరీస్‌ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ ఈ వారం మార్కెట్‌ను నిర్దేశించే అంశాలు న్యూఢిల్లీ: అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశానికి సంబంధించిన పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, డెరివేటివ్స్‌కి సంబంధించి ముగియనున్న నవంబర్ సిరీస్ తదితర అంశాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. "ఈ వారం మార్కెట్లు మరీ ఆసక్తికరంగా

బెంచ్‌టైమ్‌లో కోత విధించిన కాగ్నిజంట్‌

Saturday 23rd November 2019

ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ గరిష్ఠ పరిమితిని దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజంట్‌ తగ్గించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో రాబోయే నెలల్లో పలువురి ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పెరిగాయి. నాన్‌ బిల్లబుల్‌ ప్రాజెక్ట్‌లోని ఉద్యోగులకు ఇప్పటివరకు 60 రోజులున్న బెంచ్‌టైమ్‌ గరిష్ఠకాలపరిమితిని తాజాగా 32 రోజులకు కంపెనీ తగ్గించింది.  35 రోజుల తర్వాత ఈ ఉద్యోగులకు ఎలాంటి ప్రాజెక్టు అసైన్‌ కాకపోతే కంపెనీ నుంచి వైదొలగాల్సిఉంటుంది.

Most from this category