News


ప్రముఖ బ్రోకరేజ్‌ల నుంచి టాప్‌ సిఫార్సులు

Saturday 22nd February 2020
Markets_main1582355067.png-32006


బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌
షేరు పేరు: ధనుక అగ్రిటెక్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.635
విశ్లేషణ: ఈ క్యూ3 కంపెనీ మిశ్రమ ఫలితాలను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం 2021లో కంపెనీ ఆదాయం 7శాతం, ఈబిటా 10శాతం, నికరలాభం 11శాతం వృద్ధిని సాధిస్తుంది. అలాగే ఆర్థిక సంవత్సరం 22లో ఆదాయం 7శాతం, ఈబిటా 7శాతం, నికరలాభం 0.8శాతం వృద్ధిని అందుకుంటుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. వచ్చే రెండేళ్లలో వార్షిక ప్రాతిపదికన 7శాతం వృద్ధిని సాధించగలదనే అంచనాలతో షేరుకు గతంలో ఇచ్చిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించింది. షేరుకు గతంలో కేటాయించిన టార్గెట్‌ ధరను రూ.423 నుంచి రూ.635లకు పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 


బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌
షేరు పేరు: శ్రీ సిమెంట్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.26000
విశ్లేషణ: సిమెంట్‌ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనతో మూడో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 10శాతం వృద్దిని సాధించింది. అయితే పవర్‌ విభాగంలో మాత్రం బలహీనంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. శ్రీ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం 40ఎంటీపీఏగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యాన్ని వచ్చే నాలుగేళ్లలో 60ఎంటీపీఏకు పెంచాలని యోచిస్తోంది. భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు నిధుల అవరసం నిమిత్తం క్యూఐపీ ద్వారా రూ.2,400 కోట్లను సమీకరించింది. కంపెనీ ఇటీవల భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు సహాయం చేయడానికి క్యూఐపీ ద్వారా 2,400 కోట్లను సమీకరించింది. పరపతి పెరుగుదలతో శ్రీ సిమెంట్ నిరంతర సామర్థ్య విస్తరణ ప్రణాళిక రాబోయే రెండేళ్ళలో ఆరోగ్యకరమైన నికర ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది. 

బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌
షేరు పేరు: సద్భవ్‌ ఇంజనీరింగ్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.120
విశ్లేషణ: అకాల వర్షకాల కారణంగా ప్రాజెక్ట్‌ల పూర్తి ఆలస్యం కావడంతో కంపెనీ ఈ క్యూ3 నిరాజకమైన ఫలితాలను వెల్లడించింది. బలహీనమైన క్యూ2, క్యూ3 గణాంకాల కారణంగా యాజమాన్యం తన ఆర్థిక సంవత్సరపు 2020, 2021 ఆదాయ గైడ్‌లైన్స్‌లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం హెచ్‌ఏఎం ప్రాజెక్ట్‌ తిరిగి పట్టాలెక్కనుంది.  తొమ్మిది ప్రాజెక్టుల అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో మొత్తం నికర రుణాన్ని రూ.2,372 కోట్ల నుంచి రూ.400 కోట్లకు తగ్గించుకోనుంది. 

బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌
షేరు పేరు: ఇప్కా ల్యాబొరేటరీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1826
విశ్లేషణ: మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచాలను అందుకున్నాయి. చైనాలో పరిస్థితులు చక్కబడే వరుకు ఇన్వెంటరీ ఆందోళనలు తప్పవని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. అంచనా వేసిన ఆర్థిక సంవత్సరపు ఆదాయాలతో పోలిస్తే షేరు కేటాయించిన రూ.1826 ధర షేరు పీఈకి 23.3 రెట్లు ఉంది. You may be interested

ఇండియాలో అత్యంత విలువైన కంపెనీలు ఏవో మీకు తెలుసా?

Saturday 22nd February 2020

 మన దేశంలో అత్యంత విలువైన కంపెనీలా జాబితాలో రిలయన్స్‌ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్‌ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎప్పుడూ టాప్‌ 10 జాబితాలో ఉండే ఎస్‌బీఐ తాజాగా తన స్థానాన్ని చేజార్చుకుని 11వ స్థానంతో సరిపెట్టుకోగా,...టాప్‌ 10లోకి బజాజ్‌ ఫైనాన్స్‌ వచ్చి చేరింది. జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఈ కింది విధంగా ఉన్నాయి..... క్రమసంఖ్య కంపెనీ పేరు ప్రస్తుత ధర(రూపాయలలో) మార్కెట్‌ విలువ(రూ.కోట్లలో) 1. రిలయన్స్‌    1,485.50 941,693 2.  టీసీఎస్‌       2,156.30 809,126 3. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ 1,217.30  666,914 4. హెయూఎల్‌     2,251.00 487,299 5.  హెచ్‌డీఎఫ్‌సీ  2,362.45 408,602 6. ఐసీఐసీఐబ్యాంక్‌ 546.00  353,346 7. ఇన్ఫోసిస్‌ 796.70  339,280 8. కోటక్‌ మహీంద్రా 1,684.40 322,103 9. భారతీఎయిర్‌టెల్‌ 545.50 297,600 10. బజాజ్‌

కొన్ని షేర్ల బుల్‌ రన్‌ ఆశ్చర్యకరం

Saturday 22nd February 2020

పెట్టుబడులకు వ్యక్తిగత వ్యూహాలు అనుసరించవలసిందే షేర్ల విలువ, ధర, మార్కెట్‌ ధోరణి వంటివి గమనించాలి - కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా  షేరు ధరకు లేదా విలువకు ప్రాధాన్యత ఇవ్వకుండా మార్కెట్లో కొనుగోళ్లు కనిపిస్తున్నంతవరకూ ఏదైనా ఒక కంపెనీ షేరు ధర పెరుగుతూనే ఉంటుందని కొటక్‌ ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇంతక్రితం హర్షద్‌ మెహతా కుంభకోణం బయటపడకముందు దేశీ మార్కెట్లో నమోదైన బుల్‌రన్‌లో కనిపించినట్లు పేర్కొంటున్నారు. ఒక

Most from this category