News


సమీపకాలానికి టాప్‌ స్టాక్‌ సిఫార్సులు: రెలిగేర్‌ బ్రోకింగ్‌

Wednesday 6th November 2019
Markets_main1573015792.png-29390

నిఫ్టీ ఈ వారం 11,700-12,000 పరిధిలో కదలనుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా  ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వారంలో 5-14 శాతం రాబడులను ఇవ్వగలిగే టాప్‌ మూడు స్టాకులను సిఫార్సు చేశారు. మిగిలిన ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లో...

  నిఫ్టీ, గత సెషన్లో పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికి, చివరికి ప్రతికూలంగా ముగిసింది. ఇది నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌ అవుతుందనే సంకేతాన్నిస్తుంది.  గరిష్ఠ స్థాయిల వద్ద నిఫ్టీ నిరోధాన్ని ఎదుర్కొని, సెషన్‌ మొత్తం నెగిటివ్‌ దృక్పథంలోనే కదిలింది. చివరికి నిఫ్టీ 50 0.2 శాతం నష్టపోయి 11,917 వద్ద ముగిసింది. అదేవిధంగా విస్తృత మార్కెట్లయిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.1 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.8 శాతం పడిపోయాయి. ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యుమర్‌ గూడ్స్‌), టెలికాం సెక్టార్‌లు మినహా మిగిలిన రంగాల సూచీలు నెగిటివ్‌లోనే ముగిశాయి. హెల్త్‌ కేర్‌, కన్జ్యుమర్‌ డ్యూరబుల్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లలో అధిక అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో ఈ రంగాల సూచీలు, నష్టపోయిన సూచీలలో ముందున్నాయి. 
  సమీప కాలంలో మార్కెట్‌ను ప్రభావితం చేసే కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. నిఫ్టీ తాజా ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్‌ దశలో ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఈ వారం నిఫ్టీ 11,700-12,100 పరిధిలో కదలనుంది. అన్ని సెక్టార్‌లు నిఫ్టీ సానుకూల కదలికలో భాగం పంచకోనుండగా, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు ఇతర రంగాల ప్రదర్శనను మరుగునపరిచే అవకాశం ఉంది. మొత్తం ట్రెండ్‌ను పరిశీలించి, పడిపోయినప్పుడు షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సలహాయిస్తున్నాం. అంతేకాకుండా స్టాకుల ఎన్నికపై అధిక దృష్ఠి పెట్టాలని సలహాయిస్తున్నాం. వచ్చే మూడు నుంచి నాలుగు వారాలలో 5 నుంచి 14 శాతం రాబడులను ఇవ్వగలిగే టాప్‌ స్టాకులు ఈ కింద పేర్నొన్నాం. 
టాప్‌ 3 స్టాకులు..
బయోకాన్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 255.85; టార్గెట్‌ ధర: రూ. 290; స్టాప్‌ లాస్‌: రూ. 250; అప్‌సైడ్‌: 13 శాతం
బయోకాన్‌ రివర్సల్‌ నమూనా నుంచి తాజాగా(నవంబర్‌ 4 సెషన్‌లో) బ్రేక్‌ఔట్‌ అయ్యింది. అంతేకాకుండా ఈ స్టాకు రోజు వారి చార్టులో కీలక నిరోధంగా ఉన్న 200 రోజుల ఈఎంఏ(ఎక్స్‌పోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌) అధిగమించింది. ఈ స్టాకుకు సంబంధించి అన్ని సూచీలు పాజిటివ్‌ సంకేతాలనిస్తున్నాయి. రూ. 260-265 పరిధిలో ఈ స్టాకును తమ పోర్టుఫోలియోకి జోడించుకోవాలని సలహాయిస్తున్నాం. బయోకాన్‌ షేరు నవంబర్‌ 4 సెషన్‌లో రూ. 263.60 వద్ద ముగిసింది.

రాడికో ఖైతాన్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 327; టార్గెట్‌ ధర: రూ. 375; స్టాప్‌ లాస్‌: రూ. 315
ఈ స్టాకు గత ఐదు నెలల నుంచి రూ. 280-335 పరిధిలో కన్సాలిడేట్‌ అవుతుంది. అంతేకాకుండా వారపు చార్టులలో రివర్సల్‌ నమూనాను(ఎసెండింగ్‌ ట్రై-యాంగిల్‌) ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ షేరు అప్పర్‌ బ్యాండ్‌కు చేరువలో ట్రేడవుతోంది. అంతేకాకుండా సమీప కాలంలో ఈ స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేసే అవకాశం ఉంది. ఈ స్టాకును రూ. 332-336 పరిధిలో కూడబెట్టుకోవాలని ఇన్వెస్టర్లకు మేము సలహాయిస్తున్నాం. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: నవంబర్‌ ప్యూచర్‌ను అమ్మొచ్చు; తాజా ధర: 101; టార్గెట్‌ ధర: 95; స్టాప్‌ లాస్‌: రూ. 108; డౌన్‌ సైడ్‌: 6 శాతం వరకు పడిపోగలదు
ఇతర పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లతో పాటే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు కూడా రికవరి అయ్యింది. ఈ స్టాకు తక్షణ, కీలక నిరోధమైన 100 రోజుల ఈఎంఏను అధిగమించింది. కానీ మొత్తంగా ఈ బ్యాంక్‌ షేరు డౌన్‌ ట్రెండ్‌లో ఉండడం, బలమైన నిరోధాలుండడంతో, సమీప కాలంలో ఈ షేరు పతనాన్ని చూస్తుందని అంచనావేస్తున్నాం. రూ. 103-105 పరిధిలో తాజా షార్ట్‌ పొజిషన్లను తీసుకోవాలని ట్రేడర్లకు సలహాయిస్తున్నాం. You may be interested

టైటాన్‌ 9.50శాతం డౌన్‌

Wednesday 6th November 2019

టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9.50శాతం పతనమైంది. రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో పాటు వచ్చే రెండు తైమాసికంలో ఆభరణాల అమ్మకాల వృద్ధి గైడెన్స్‌ను తగ్గించడం ఇందుకు కారణమైంది.  నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్యూ‍2లో కంపెనీ నికరలాభం 4 వృద్ధి చెంది రూ.301 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది.

నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 6th November 2019

కెనరా బ్యాంక్‌, టాటా స్టీల్‌, లుపిన్‌, సిప్లా, ఓల్టాస్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఈఐడీ ప్యారీ, మణప్పురం ఫైనాన్స్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, ర్యాడికో ఖైతాన్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌  తదితర కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category