News


జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏం చేశాయి?

Saturday 15th February 2020
Markets_main1581749326.png-31824

జనవరిలో మ్యూచువల్‌ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఐదు నెలల గరిష్ఠాలకు చేరాయి. ఈ నెల్లో దాదాపు 7880 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ నెలలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏమి కొన్నాయో, ఏమి అమ్మినవో ఒకసారి చూద్దాం...
1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌: జనవరి నాటికి 2100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిఉంది. అధిక శాతం(సుమారు 28 శాతం) ఫైనాన్షియల్‌రంగం, తర్వాత 9శాతం ఇండస్ట్రియల్స్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిఉంది. జనవరిలో ఈ ఫండ్‌ టాటాపవర్‌, ఇండియన్‌ ఆయిల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లుచిప్‌ ఫండ్‌ల్లో వాటాలను పెంచుకోగా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌బీఐల్లో వాటాలను తగ్గించుకుంది. 
2. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌: జనవరి నాటికి  2200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అధిక శాతం(మూడొంతులు) ఫైనాన్షియల్స్‌, తర్వాత ఇండస్ట్రియల్స్‌(12 శాతం)కు చెందిన కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. జనవరిలో ఈ ఫండ్‌ ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, అంబుజా సిమెంట్స్‌లో వాటాలు పెంచుకోగా, ఆర్‌ఐఎల్‌, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకుల్లో వాటాలు తగ్గించుకుంది. 
3. ఎస్‌బీఐ ఎంఎఫ్‌: జనవరి నాటికి 533 సెక్యూరిటీల్లో 2800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఈ ఎంఎఫ్‌ కూడా అత్యధికంగా ఫైనాన్షియల్స్‌(41 శాతం)లో, ఇండస్ట్రియల్స్‌(9 శాతం)కు చెందిన కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. జనవరిలో ఈ ఫండ్‌ సీడీఎస్‌ఎల్‌, టాటాక్యాపిటల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ల్లో వాటాలు పెంచుకోగా, జేకే టైర్స్‌, లౌరస్‌ల్యాబ్‌, బ్లుడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో వాటాలు తగ్గించుకుంది. 



You may be interested

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌

Saturday 15th February 2020

ఎప్పుడూ వివిధ రకాల కొత్తకొత్త ఆఫర్లతో ముందుండే దేశీయ ఆన్‌లైన్‌ దిగ్గజ సంస్థ మరో బిగ్‌ సేల్‌కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి17 నుంచి 21 వరకు మొబైల్‌పై బొనాంజాత సేల్‌ను ప్రకటించింది. దీనిలో ప్రధాన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌లతోపాటు , బడ్జెట్‌ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఏ మొబైల్‌ అయినా యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు మీద కొనుగోలు చేసినట్లయితే 10 శాతం

30రోజులకు టాప్‌-6 రికమెండేషన్లు

Saturday 15th February 2020

1.కంపెనీ పేరు: హీరో మోటోకార్ప్‌ బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ  సెక్యూరిటీస్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.2356.50 టార్గెట్‌ ధర: రూ.2980.00 కాలపరిమితి: స్వల్పకాలం( 1 నెల) విశ్లేషణ: ద్విచక్ర వాహనాలపై పెంచిన ధరలు స్వల్పకాలంలోనే నష్టాలను రికవరీ చేయగలవు. ఈ ఏడాది రెండో భాగంలో రివకరీతో ఆర్థిక సంవత్సరపు 21లో  వాల్యూమ్స్‌లు 5 శాతం ఉప వృద్ధి చెందుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తుంది.  2.కంపెనీ పేరు: మైండ్‌ ట్రీ బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ రేటింగ్‌: కొనవచ్చు ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.959.90 టార్గెట్‌ ధర: రూ.1100.00 కాల పరిమితి: స్వల్పకాలం(1నెల) విశ్లేషణ: యాన్యుటీ రెవెన్యూ, టెయిల్ అకౌంట్ హేతుబద్ధీకరణపై

Most from this category