News


బడా ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 షేర్లివే!

Monday 23rd December 2019
Markets_main1577077682.png-30378

పోర్టుఫోలియో మేనేజర్లు, అల్ట్రారిచ్‌ ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన స్టాకులపైనే మక్కువ చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలా షేర్లు ఇప్పటికే మంచి ర్యాలీ జరిపినా, ఇంకా వీటిపైనే బడా ఇన్వెస్టర్లు ఆధారపడుతున్నట్లు పైసాబజార్‌ గణాంకాలు చూపుతున్నాయి. ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న స్టాకుల్లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌, కోటక్‌మహీంద్రాబ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర దిగ్గజాలున్నాయి.
పెద్ద ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 స్టాక్స్‌...

మార్కెట్లో స్మార్ట్‌మనీ మొత్తం కేవలం క్వాలిటీ స్టాక్స్‌లోకే పోతున్నదని, ఎక్కువమంది ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్స్‌పై భరోసా పెట్టుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక రంగంలో లీడర్‌ అనే కంపెనీల షేర్లనే ఎంఎఫ్‌లు, ఎఫ్‌ఐఐలు ఎంచుకుంటున్నాయన్నారు. ఎకానమీలో మందగమనం కనిపిస్తున్న వేళ కేవలం టాప్‌ 15- 20 స్టాకుల్లోకి మాత్రమే ఇన్వెస్టర్ల సొమ్ము పోతోందని, కేవలం కొన్ని షేర్లే మార్కెట్‌ను నిలబెడుతున్నాయని చెప్పారు. రూ. 50 లక్షల పైచిలుకు పోర్టుఫోలియోలను పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ స్కీముల కింద పరిగణిస్తారు. వీటిని ప్రత్యేకంగా ఆయా మేనేజర్లు పర్యవేక్షిస్తుంటారు. వీరి ఫీజులు సాధారణ ఎంఎఫ్‌ల కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పీఎంఎస్‌ఈఎస్‌లు పైన చెప్పిన టాప్‌ 20 స్టాకులపైనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. 2020లో కూడా లార్జ్‌క్యాప్స్‌ హవానే కొనసాగవచ్చని, మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ పునరుజ్జీవానికి మరింత సమయం పట్టవచ్చని నిపుణుల అంచనా. ఎర్నింగ్స్‌లో మెరుగుదల వస్తే చిన్నస్టాకులు పుంజుకుంటాయని అప్పటివరకు ఎక్కువగా పెట్టుబడులు ఇలాంటి టాప్‌ క్వాలిటీ స్టాకుల చుట్టూనే తిరుగుతుంటాయని ఎడెల్‌వీజ్‌ అభిప్రాయపడింది. 

పైన చెప్పిన స్టాకులు రికమండేషన్లు కావు. కేవలం సూచికలు మాత్రమే...You may be interested

రూ.38వేలపైన ప్రారంభమైన పసిడి

Monday 23rd December 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర సోమవారం రూ.38వేలపైన రూ.38,040 వద్ద ప్రారంభమైంది. నేడు అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడికి ధరకు డిమాండ్‌ లభించడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనం‍గా ప్రారంభం పసిడి ఫ్యూచర్ల లాభాలకు కారణమవుతున్నాయి. ఉదయం గం.10:15ని.లకు డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.108.00ల లాభంతో రూ.38099.00 వద్ద ట్రేడింగ్‌  అవుతోంది. ‘‘ ఈ వారంలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవు సందర్భంగా పసిడి

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు ఐడియాలు!

Monday 23rd December 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు రికమండేషన్లను యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది. 1. కెనెరాబ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 242. స్టాప్‌లాస్‌ రూ. 220. డైలీ చార్టుల్లో హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పాటు చేస్తూ వస్తోంది. వీక్లీ చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం షేరు ధర కీలక 20, 50, 100 డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతూ బలంగా ఉంది.  2. ఐసీఐసీఐ లొంబార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1500. స్టాప్‌లాస్‌ రూ.

Most from this category