News


ఈ స్టాక్స్‌ ... టాప్‌ గన్స్‌

Wednesday 1st January 2020
Markets_main1577848206.png-30570

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు .. దేశీయంగా కంపెనీల ఆదాయాలు .. లిక్విడిటీ మెరుగుపడుతుండటం, డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశాలతో .. కొత్త సంవత్సరంలో మార్కెట్లకు ఊతం లభించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2020 మరిన్ని సంస్కరణల సంవత్సరంగా ఉండవచ్చని.. 2019 ర్యాలీలో పెద్దగా పాలుపంచుకోని మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు పుంజుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులు, కన్జూమర్‌/ఎఫ్‌ఎంజీసీ, సిమెంట్, క్యాపిటల్‌ గూడ్స్‌ సంస్థల షేర్లు రాణిస్తాయని బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. మరోవైపు, 2020 ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్‌ 45,500 పాయింట్లను తాకవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. హెల్త్‌కేర్, ఆగ్రోకెమికల్స్, కార్పొరేట్‌ బ్యాంకులు, మిడ్‌క్యాప్‌ సిమెంటు.. ఫార్మా కంపెనీలు, నిర్మాణ రంగ సంస్థలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర రంగ సంస్థలు రాణించవచ్చవచ్చని అంచనా వేస్తోంది. కొత్త ఏడాదికి వివిధ బ్రోకింగ్‌ సంస్థల షేర్ల సిఫార్సులు ఇవీ..

బ్రోకింగ్‌ సంస్థ – మోతీలాల్‌ ఓస్వాల్‌

1. అల్ట్రాటెక్‌ 
టార్గెట్‌ ధర రూ. 5,050
ప్రస్తుత ధర రూ. 4,052

దేశీయంగా రెడీ మిక్స్‌ కాంక్రీట్, గ్రే సిమెంట్, వైట్‌ సిమెంట్‌ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. సెంచురీ, బినానీ సంస్థలకు చెందిన అసెట్స్‌ను కొనుగోలు చేయడంతో ఉత్పత్తి సామర్ధ్యం 109.4 మిలియన్‌ టన్నులకు పెంచుకుంది. దేశవ్యాప్తంగా మార్టె వాటా 24 శాతానికి చేరింది. తదుపరి పెద్దగా పెట్టుబడి వ్యయాల అవసరం లేకపోవడం, మెరుగైన ఆదాయ ఆర్జన అవకాశాలు సంస్థకు సానుకూల అంశాలు. 

2. ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ ధర రూ. 625
ప్రస్తుత ధర రూ. 544
అధిక రాబడికి అవకాశం ఉండే వ్యక్తిగత రుణాల వంటి రిటైల్‌ లోన్స్, క్రెడిట్‌ కార్డులపై ప్రధానంగా దృష్టి సారిస్తోంద. రాబోయే రోజుల్లో బ్యాంకు వృద్ధికి రిటైల్‌ వ్యాపార విభాగం కీలకంగా ఉండనుంది. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో దీని వాటా సుమారుగా 61 శాతంగా ఉండవచ్చు. టెక్నాలజీపై పెట్టుబడులు, డిజిటల్‌ సేవలను భారీగా విస్తరిస్తుండటం తదితర అంశాలు సంస్థకు ఊతంగా నిలవనున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో అత్యధికంగా ప్రొవిజనింగ్‌ కవరేజీ ఉన్న సంస్థల్లో ఇది కూడా ఒకటి.

3. టైటాన్‌
టార్గెట్‌ ధర రూ. 1,275
ప్రస్తుత ధర రూ. 1,194
వాచీల విభాగంలో మార్కెట్‌ లీడరు.. బ్రాండెడ్‌ జ్యుయలరీ విభాగంలో అగ్రగామి సంస్థ. దేశీ అసంఘటిత ఆభరణాల మార్కెట్లో టైటాన్‌ తన వాటాను మరింత పెంచుకునేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు గణనీయంగా మెరుగుపడవచ్చు. జ్యుయలరీ విభాగానికి సంబంధించి మొత్తం అమ్మకాల్లో సేమ్‌ స్టోర్‌ సేల్స్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) విభాగం వాటా 60 శాతం పైగా ఉండనుండటంతో నిర్వహణ మార్జిన్లు కూడా మరింత మెరుగుపడవచ్చు.

బ్రోకింగ్‌ సంస్థ ఇండియా నివేష్‌ సెక్యూరిటీస్‌

1. ఐటీసీ
టార్గెట్‌ ధర రూ. 310
ప్రస్తుత ధర రూ. 238
గరిష్ట స్థాయుల నుంచి రేటు సుమారు 21 శాతం కరెక్షన్‌కు లోను కావడంతో వేల్యుయేషన్‌ ఆకర్షణీయంగా మారింది. ఎఫ్‌ఎంసీజీ, హోటల్స్, పేపర్, తదితర ఇతర వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయి. మెరుగైన వర్షపాతం ఊతంతో రబీ పంటల దిగుబడిపై ఆశావహ అంచనాలు.. ఐటీసీకి సానుకూలాంశాలు.

2. హిందాల్కో
టార్గెట్‌ ధర రూ. 250
ప్రస్తుత ధర రూ. 218
అంతర్జాతీయంగా ఉదార ఆర్థిక విధానాల ఊతంతో 2020లో ప్రపంచ దేశాల వృద్ధి మెరుగుపడవచ్చన్న సంకేతాలు ఈ సంస్థకు సానుకూలం కాగలవని అంచనాలు ఉన్నాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడం వంటి స్థూల ఆర్థిక పరిణామాలు సైతం కంపెనీకి కలిసి రాగలవు.

3. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌
టార్గెట్‌ ధర రూ. 3,370
ప్రస్తుత ధర రూ. 2,891
దేశీ వ్యాపారంపై మరింతగా దృష్టి పెడుతోంది. 2015 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 12 శాతంగా ఉన్న ఈ విభాగం వాటా 2019 నాటికి 17 శాతానికి పెరగడం ఇందుకు నిదర్శనం. కొత్తగా మరిన్ని ఉత్పత్తులు ప్రవేశపెట్టనుండటంతో సంస్థ ఆదాయాలు గణనీయంగా పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి.

4. ఎస్కార్ట్స్‌
టార్గెట్‌ ధర రూ. 810
ప్రస్తుత ధర రూ. 631
దాదాపు రుణ రహిత సంస్థగా ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నాయి. రాబడుల నిష్పత్తులు, నిర్వహణ మార్జిన్లు మొదలైనవి మెరుగ్గా ఉండటం ఈ సంస్థకు సానుకూలాంశాలు.


బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్‌

1. భారతి ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ ధర రూ. 550
ప్రస్తుత ధర రూ. 460
దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం సంస్థ. 30 శాతం మార్కెట్‌ వాటా ఉంది. తీవ్రమైన పోటీతో సవాళ్లు ఎదురైనా.. దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలతో ముందుకెడుతోంది.  ఇటీవలి టారిఫ్‌ల పెంపుతో కంపెనీ ఆదాయాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. కేంద్రానికి జరపాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీ చెల్లింపు కోసం దాదాపు 3 బిలియన్‌ డాలర్లు సమీకరించనుంది. 

2. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 
టార్గెట్‌ ధర రూ. 54
ప్రస్తుత ధర రూ. 45

1997లో ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీగా మొదలై 2015లో యూనివర్సల్‌ బ్యాంక్‌గా మారింది. 2018లో ఐడీఎఫ్‌సీ బ్యాంక్, క్యాపిటల్‌ ఫస్ట్‌ల విలీనంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా మారింది. రుణ వితరణపరంగా దేశీయంగా ఎనిమిదో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంకు. ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలు, కన్జూమర్‌ ఫైనాన్సింగ్‌పై దృష్టితో రిటైల్‌ రుణాల విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని బ్యాంకు యోచిస్తోంది. నికర మొండిబాకీల నిష్పత్తి 1.17 శాతంగాను, స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 2.62 శాతంగాను ఉంది. 

3. మహానగర్‌ గ్యాస్‌
టార్గెట్‌ ధర రూ. 1,230
ప్రస్తుత ధర రూ. 1,055

దేశీయంగా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) విభాగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటి. ప్రస్తుం ముంబై, రాయగఢ్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సీఎన్‌జీ, పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ)కి ఏకైక సరఫరాదారు. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 25 సీఎన్‌జీ స్టేషన్స్‌ చొప్పున ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం 244 సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయి. సీజీడీ రంగానికి గ్యాస్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటం, భారీ పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ధరలపరంగా పటిష్టమైన స్థితిలో ఉండటం మొదలైనవి మహానగర్‌ గ్యాస్‌కు అనుకూలించే అంశాలు.

4. నారాయణ హృదయాలయ
టార్గెట్‌ ధర రూ. 360
ప్రస్తుత ధర రూ. 307
దేశవ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. మరిన్ని ప్రాంతాలకు విస్తరించే క్రమంలో.. అందుబాటు చికిత్స వ్యయాల మోడల్‌తో పాటు ప్రీమియం చార్జీల మోడల్‌ను కూడా అనుసరించే అవకాశాలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ రేటు మెరుగుపడుతూ ఉండటం ఆదాయాలు, మార్జిన్ల వృద్ధికి దోహదపడనున్నాయి. కొత్త ఆస్పత్రులకు నష్టాలు తగ్గుతున్నాయి. పెట్టుబడుల వ్యయాలూ గణనీయంగా క్రమబద్ధీకరించుకుంటోంది. అసెట్‌ రైట్‌ మోడల్, అఫోర్డబిలిటీ వంటివి ఈ స్టాక్‌కు సానుకూలాంశాలు.

5. పీవీఆర్‌ లిమిటెడ్‌
టార్గెట్‌ ధర రూ. 2,200
ప్రస్తుత ధర రూ. 1,902
దేశీయంగా సుమారు 69 నగరాల్లో దాదాపు 800 స్క్రీన్స్‌తో అతి పెద్ద మల్టీప్లెక్స్‌ సంస్థ. గడిచిన నాలుగేళ్లలో ఆదాయాలు 11 శాతం, ఎబిటా 15 శాతం వృద్ధి సాధిస్తోంది. ఇటు కంటెంట్, అటు ఎఫ్‌అండ్‌బీ, యాడ్స్‌పరమైన ఆదాయాలు మొదలైనవి మెరుగైన వృద్ధికి దోహదపడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌ వ్యాపారాలు వృద్ధి చెందుతుండటం ఈ సంస్థకు లాభించే అంశం.  కొత్త సంవత్సరం ప్రథమార్ధంలో విడుదల కానున్న స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ, తానాజీ, బాగీ 3 వంటి సినిమాలు హిట్‌ కాగలవన్న అంచనాలు.. పీవీఆర్‌కు సానుకూలం. You may be interested

కొత్త ఏడాది తొలి రోజు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Wednesday 1st January 2020

నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌  దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి రోజు(బుధవారం) అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా గత రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,243 వద్ద ముగిసింది.  సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా బుధవారం న్యూఇయర్‌ హాలీడే సందర్భంగా సింగపూర్‌లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడ్‌కాదు. మరోవైపు మంగళవారం ఒడిదొడుకుల మధ్య దేశీ

కొత్త ఏడాదిలో పండుగ చేసుకోవచ్చా.?

Tuesday 31st December 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఎప్పుడు ర్యాలీ చేస్తాయి..? అని ఆశగా ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు గుడ్‌ న్యూస్‌. 2020లో నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తు‍న్నారు. 2019 పూర్తిగా ఇండెక్స్‌లోని నాణ్యమైన స్టాక్స్‌దే హవా అని చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో లాభాలు ఇచ్చినవీ ఉన్నాయి. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. దీంతో బ్రోడర్‌ మార్కెట్లు ర్యాలీలో పాల్గొనలేదు. ప్రభుత్వం ఆర్థిక

Most from this category